Jump to content

ఆర్. పరిమళ

వికీపీడియా నుండి
(ఆర్. పరిమల నుండి దారిమార్పు చెందింది)
ఆర్. పరిమళ
ఆర్.పరిమళ
జననం1976
ముంబై
వృత్తిమహిళా శాస్త్రవేత్త

ఆర్. పరిమళ తండ్రి ఆంగ్ల ప్రొఫెసర్, తల్లి గృహిణి. ఆమె చదువుకు ప్రాముఖ్యం ఇచ్చే కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఆమెకు క్రమశిక్షణ, ఏపని చేసినా అది అత్యుత్తమస్థాయిలో చేయడం నేర్పించాడు. ఆమె ఉన్నత పాఠశాల వరకు " శరదా విద్యాలయం "లో చదివింది. అలాగే " స్టెల్లా మేరీస్ కాలేజ్ "లో డిగ్రీ పూర్తిచేసింది. ఆమెకు మాథనెటిక్స్ మీద ఆసక్తి కలగడానికి స్కూలు , కాలేజులలో లభించిన ఉత్తమమైన ఉపాధ్యాయులే కారణమని ఆమె భావించింది. ఆమె తండ్రి ఆదపిల్లలకు మెడిసిన్ , టీచింగ్ చాలా నప్పుతాయని అందువలన వాటిలో ఏదైనా ఎంచుకొమ్మని సలహా ఇచ్చాడు. అయినప్పటికీ ఆయనకు త్వరగానే పరిమళ గణితం పట్ల మక్కువచూపుతుందని తెలిసింది. ఆయన అతున్నత విద్యా సంస్థలో చదివే అవకాశం కలిగిస్తానని కుమార్తెకు మాటిచ్చాడు.

కాలేజ్

[మార్చు]

ఆర్. పరిమళ మాథమెటిక్స్ రీసెర్చ్ చేయడం అనుకోకుండా జరిగింది. ఆమె ఎం.ఎస్.సి పూర్తి చేయగానే స్టెల్లామేరీస్ కాలేజిలో టీచరుగా పనిచేయాలని అనుకున్నది. ఆమె సీనియర్లు అధికంగా అలాచేయడం కారణంగా ఆమె మార్గదర్శకంగా ఎంచుకున్నది. వారిలో చాలా మంది అవకాశం లభిస్తే విజయవంతమైన మాథమెటిక్స్ అయిఉండేవారని అని భావించింది. ప్రొఫెసర్ తంగమణి పరిమల లెక్చరర్ కాకూడదని ఆమె రీసెర్చ్ చేయాలని సలహా ఇచ్చింది. ఆది పరిమలకు చక్కట్టి ప్రేరణ ఇచ్చింది.

రీసెర్చ్

[మార్చు]

ఆమె టాటాఇంస్టిట్యూట్ గురించి తెలుసుకుని చెన్నైలో ఉండి రీసెర్చ్ కొనసాగించాలని విశ్చయించుకున్నది. నిదానంగా ఆలోచించి చివరకు " యూనివర్శిటీ అఫ్ మద్రాసు, రామానుజం ఇంస్టిట్యూట్‌" రీసెర్చ్ కొనసాగించాలని నిర్ణయించుకున్నది. భానమూర్తి , రమా ఆమెకు ఉత్సాహంగా గణితం బోధించారు. ఒక సంవత్సరం తరువాత ఆమె పి.హెచ్.డి డిగ్రీ చేయడామికి ప్రొఫెసర్ శ్రీధరన్‌తో కలిసి పనిచేయడానికి టాటాఇంస్టిట్యూట్‌కు మారింది. ఆమె థిసీస్ టైటిల్ " ప్రొజెక్టివ్ మాడ్యూల్స్ ఓవర్ పాలినోమియల్ రింగ్స్ ఓవర్ డివిషన్ రింగ్స్ " . థీసీస్ సమర్పించిన తరువాత మాథమెటీషియన్ రీసెర్చ్ కొనసాగించగలనా అన్న సందేహం తలెత్తింది.

వివాహం

[మార్చు]

ఆర్. పరిమళ తంజానియా " బోర్డ్ ఆఫ్ ట్రేడ్ "చీఫ్ ఇంటర్నల్ అడిటర్ రామన్‌ను వివాహం చేసుకున్నది. తరువాత ఆమె ఇంస్టిట్యూట్ నుండి ఒక సంవత్సరం శలవు తీసుకుని భర్తతో తంజానియా వెళ్ళింది. కొన్ని మాసాల తరువాత ఆమె భర్త రామన్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్. పరిమల పోస్ట్ డాక్టొరల్ పని కొరకు జ్యూరిచ్ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతి ముఖ్యమైన నిర్ణయం కారణంగా ఆమె మథమెటిక్స్ కేరీర్ తిరిగి మొదలైంది. స్విడ్జర్‌లాండ్లో ఆమెకు పనిచేసిన సహోద్యోగులుగా ఎం.ఒజాంగ్యురిన్, ఎం.ఎ. నూస్ కృషి, సహకారంతో ఆమె విజయవంతమైన మాథమెటీషీయన్ కాగలిగానని ఆమె కృతఙతా భావం వెలిబుచ్చింది.

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.