అనూరాధా మిశ్రా
అనూరాధా మిశ్రా Anuradha Misra | |
---|---|
పౌరసత్వం | భారతీయురాలు |
జాతీయత | Indian |
రంగములు | భౌతిక శాస్త్రము |
చదువుకున్న సంస్థలు | అలహాబాద్ విశ్వవిద్యాలయం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఎస్.డి. జోగ్లేకర్ |
అనూరాధా మిశ్రా భౌతిక శాస్త్రవేత్త.[1]
జీవిత సంగ్రహం
[మార్చు]ఉత్తర ప్రదేశ్ లోని ఒక పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అనూరాధ అన్నలతో సమానంగా శాస్త్రాల అధ్యయనం మీద దృష్టిపెట్టింది. ఆమె తండ్రి వైద్యుడి, తల్లి గృహిణి. కుటుంబసభ్యుల సమ్మతితో చదువు కోసం ప్రభుత్వ బాలికల కళాశాలలో చేరింది. అక్కడి ఉపాధ్యాయని శ్రీమతి విచిత్రతారా శ్రీవాత్సవ ప్రోత్సాహంతొ కృషిచేసి జియోమెట్రీలో మంచి ప్రావీణ్యత సంపాదించింది. తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కొరకు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో బి.యస్.సి. భౌతికశాస్త్రం, గణితం, గణాంకంలతొ 2 సంవత్సరాలలో పూర్తిచేసింది. మేరీ క్యూరీ, రామానుజన్ ల స్ఫూర్తిగా పరిశోధనల వైపుగా ఆలోచించి ఐ.ఐ.టి. కాన్పూర్లో పి.హెచ్.డి.లో చేరింది. ప్రొ. ఎస్.డి. జోగ్లేకర్ నాయకత్వంలో ఆమె Renormalization Theory గురించి పరిశోధన చేసి ఫలితాలను జర్నల్ లో ప్రచురించారు.
ఈమె 1989లో తన సహాధ్యాయి రాఘవను వివాహం చేసుకున్నారు. అతడి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ లో చేరాడు.
మూలాలు
[మార్చు]- [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.
- https://web.archive.org/web/20130510163259/http://www.eltweekly.com/elt-newsletter/2013/05/teaching-english-as-a-foreign-language-by-dr-anuradha-mishra/