Jump to content

అనూరాధా లోహియా

వికీపీడియా నుండి
అనూరాధా లోహియా
అనూరాధా లోహియా
ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం 3వ ఉప-కులపతి
Assumed office
2 మే 2014
ఛాన్సలర్పశ్చిమ బెంగాల్ గవర్నర్
గవర్నర్ఎం.కె.నారాయణన్
కేశరి నాథ్ త్రిపాఠీ
జగదీప్ ధంకర్
అంతకు ముందు వారుమాళవిక సర్కార్
వ్యక్తిగత వివరాలు
జననం (1956-06-11) 1956 జూన్ 11 (వయసు 68)
కలకత్తా (ప్రస్తుతం కోల్‌కాతా), పశ్చిమ బెంగాల్
జాతీయతభారతీయులు
నివాసం
కళాశాల
  • ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం
    (కలకత్తా విశ్వవిద్యాలయం)
  • రాజ్‌బజార్ సైన్సు కాలేజీ
    (కలకత్తా విశ్వవిద్యాలయం)
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిచల్ బయాలజీ

అనురాధా లోహియా అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త.[1][2] ప్రస్తుతం ఆమె ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉంది.[3][4][5][6] ఆమె ఇంతకుముందు కోల్‌కతాలోని బోస్ ఇనిస్టిట్యూట్‌లో బయోకెమిస్ట్రీ విభాగానికి చైర్‌పర్సన్‌గా ఉంది. . ఆమె భారతదేశంలో వైద్య పరిశోధనలను ప్రోత్సహించే సంస్థ ఇండో-బ్రిటిష్ వెల్కమ్ ట్రస్ట్ / డిబిటి ఇండియా అలయన్స్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తుంది.[7] ఈమె తన పి.హెచ్‌డిని కలకత్తాలోని ఐ.ఐ.సి.బి కలకత్తా యూనివర్సిటీ నుండి 1986లో పొందారు.

అనురాధ లోహియా (నీ ఫతేపురియా) అంటు వ్యాధిలో పనిచేసే భారతీయ పరమాణు పరాన్నజీవి శాస్త్రవేత్త. ప్రస్తుతం ఆమె ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉన్నారు. ఆమె ఇంతకుముందు కోల్‌కతాలోని బోస్ ఇనిస్టిట్యూట్‌లో బయోకెమిస్ట్రీ విభాగానికి చైర్‌పర్సన్‌గా ఉంది. ఆమె భారతదేశంలో వైద్య పరిశోధనలను ప్రోత్సహించే సంస్థ అయిన ఇండో-బ్రిటిష్ వెల్కమ్ ట్రస్ట్ / డిబిటి ఇండియా అలయన్స్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె కలకత్తాలోని మోడరన్ హై స్కూల్ లో విద్యార్థిని. ఆమె బీఎస్సీ చేసింది. కలకత్తా విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఫిజియాలజీ, ఎం.యస్సీ చేసింది. కలకత్తా విశ్వవిద్యాలయానికి చెద్మిన రాజాబజార్ సైన్స్ కాలేజీ నుండి ఫిజియాలజీలో, తరువాత ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ నుండి విబ్రియో కలరాలో డాక్టరేట్ పొందింది. ఆమె ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో శాస్త్రవేత్తలను కలుసుకుంది. ఆమె న్యూయార్క్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లో పోస్ట్ డాక్టోరల్ పరిశోధన చేసింది. ఆమె ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క ఫెలోగా ఎన్నికయ్యింది. ఆమెకు స్ట్రీ శక్తి అవార్డు, యునెస్కో మాలిక్యులర్ అండ్ సెల్ బయాలజీ నెట్‌వర్క్ గ్రాంట్ కూడా లభించింది.

అవార్డులు

[మార్చు]
  • ఇండియన్ అకాడమీ అఫ్ సైన్స్ నుండి 2006 లో ఎన్నికైంది
  • స్త్రీశక్తి సైన్స్ సన్మానం 2005
  • జీ నెట్‌వర్క్ ఆక్టివ్ అవార్డ్ 2005
  • డి.భి.టి నేషనల్ అవార్డ్ అతి పిన్న వయసు బయో సైంటిస్ట్ 2001
  • ఫోగర్టీ స్పెషల్ ఫెలోషిప్ 1991

మూలాలు

[మార్చు]
  1. "Anuradha Lohia Vice Chancellor". Presidency University, Kolkata. Retrieved 13 July 2016.
  2. "Anuradha Lohia". Bose Institute. Archived from the original on 22 July 2016. Retrieved 13 July 2016.
  3. "Lohia selected as Presidency VC". The Telegraph (Calcutta). 27 April 2014. Retrieved 13 July 2016.
  4. "Presidency University VC Anuradha Lohia under gherao since last evening". The Economic Times. 22 August 2015. Archived from the original on 23 ఆగస్టు 2016. Retrieved 13 July 2016.
  5. "Presidency University stalemate: Students vacate V-C Anuradha Lohia's chambers, panel set up to hear them out". Indian Express. 26 August 2015. Retrieved 13 July 2016.
  6. "Happy to feature on Presidency University's vice chancellor probable list: Lohia". Jhimli Mukherjee Pandey. Times of India. 25 April 2014. Retrieved 13 July 2016.
  7. "Ten women, ten questions: Anuradha Lohia". indiabioscience.org. 17 July 2015. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 13 July 2016.

బాహ్య లంకెలు

[మార్చు]