Jump to content

రెడ్డి

వికీపీడియా నుండి
గమనిక: ఈ తరహా వ్యాసంలో వివాదాస్పదమైన విషయాలు ఉండే అవకాశం ఉన్నది. కనుక నిర్ధారించుకొనదగిన ఆధారాలు చాలా అవసరం. రచయితలు ప్రత్యేక శ్రద్ధ వహించవలసినదిగా కోరడమైనది.

రెడ్డి (Reddy, Reddi) అనునది ఒక పేరు, హిందూ మతం లోని ఒక కులం. వీరి భాష ప్రధానంగా తెలుగు. భూస్వాములు, గ్రామ పెద్దలు ఈ కులస్తులకు చెందినవారే ఎక్కువ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో ఉన్నారు.

భౌగోళికం

[మార్చు]

రెడ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని అన్ని జిల్లాలలోను, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, మహారాష్ట్రలలో కూడా నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామపెద్దగా (మునసబు) రెడ్డి కులస్తులే వ్యవహరిస్తూ ఉంటారు. వీరు పన్నులు వసూళ్ళు, గ్రామ రక్షణ, గ్రామం తరపున ప్రభుత్వంతోను, బయట వారితోను వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఈ కులములో కొందరు ధనికులు, భూస్వాములు, వ్యాపారస్తులు. చాలా వరకు చిన్నకారు రైతులే. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో, చిన్నగ్రామాలలో గ్రామం తరఫున వీరి మాటే వేదవాక్కు. గ్రామ నాయకత్వము ఈ కులస్తులే నెరపుతారు. రాజకీయాలలో ప్రముఖ పాత్ర వీరిదే. కొండరెడ్లకు (గిరిజన) మామూలు రెడ్లకు సాంఘికంగాను, భౌగోళికంగాను ఏవిధమైన సంబంధమూ కనిపించదు.

చరిత్ర

[మార్చు]

మూలం

[మార్చు]

రెడ్డి వర్గం వారు ఒక సమూహానికి చెందిన వారు కాదు. వీరు దక్కను పర్వత కనుమలకు చెందిన అనేక సమూహాల కలయిక అని చరిత్ర చెపుతుంది.

కొంత మంది చరిత్రకారుల ప్రకారం రెడ్డి వర్గం వారిని రథి వర్గం అంటారు. మరి కొంత మంది చరిత్రకారుల ప్రకారం క్రీస్తుశకం ఏడెనిమిది శతాబ్దాల నుంచి తెలుగు గడ్డ మీద " రట్టగుడి " పేరిట చిన్న గ్రామాధికారులు ఉండేవారు. ఈ రట్టగుడి శబ్దం నుండే రట్టోడి, రట్ట, రడ్డి, రెడ్డి అనే రూపాలు పుట్టాయి.చిన్న చిన్న భూభాగాలకు అధికారులై వాటిని గుత్తగా అనుభవిస్తున్న వాళ్లని  రట్టగుట్టలు, రట్టగుడ్లు అని పిలిచేవారు. వీరి ముఖ్య వృత్తి వ్యవసాయం. రట్లడులకు నిధి, నిక్షేపము, జలము, పాషాణములు, అక్షిణి, ఆగామి, సిద్ధమి, సాధ్యము అనే అష్టభోగస్వామ్యాలు తమ భూములపై ఉండేవి. ఆ కాలంలో రట్టడలు ఒకరకంగా ఆర్థిక వ్యవస్థలు.[1] ఆదిలో వృత్తివాచకమైన " రడ్డి " పదం తర్వాత జాతి వాచకమైంది.[2]

చాలా ప్రాంతాలలో గ్రామ పెద్దగా వుండే వారిని "రెడ్డి"గా వ్యవహరిస్తారు. కాలగమనంలో వారి అనుచరులు రెడ్డి గ్రూపులుగా ఏర్పడ్డారు. ఈవిధంగా కూడా రెడ్డి వర్గం ఏర్పడిందని చెప్పవచ్చు. రెడ్లు చరిత్రలో గ్రామ అధికారులుగా, భూస్వాములుగా, జమీందార్లుగా, పాలేగార్లుగా, సామంత రాజులుగా, సేన నాయకులుగా, రాజ్య పాలకులగా పేర్కొనబడినారు.[3] భారత దేశ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో రెడ్ల పాత్ర అత్యంత ముఖ్యమయినది.

చరిత్రలో రెడ్డి రాజ్యాలు

కాకతీయ రెడ్డి సామంతులు [4]

  • రేచర్ల రెడ్డి వంశీయులు
  • గోన రెడ్డి వంశస్థులు
  • విరియాల రెడ్డి వంశస్థులు
  • వావిలాల రెడ్డి వంశస్థులు
  • చెరకు రెడ్డి వంశస్థులు
  • మల్యాల రెడ్డి వంశస్థులు

రెడ్డి సంస్థానాలు[5]

  • అలంపూర్ సంస్థానం, తెలంగాణ.
  • అమరచింత సంస్థానం, తెలంగాణ.
  • గద్వాల సంస్థానం, తెలంగాణ.
  • వనపర్తి సంస్థానం, తెలంగాణ.
  • దోమకొండ సంస్థానం, తెలంగాణ.
  • మునగాల సంస్థానం, తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్
  • పాపన్నపేట సంస్థానం, తెలంగాణ.
  • సిర్నాపల్లి సంస్థానం, తెలంగాణ.
  • బోరవేల్లి సంస్థానం, తెలంగాణ.
  • గోపాలపేట సంస్థానం, తెలంగాణ.
  • బుచ్చిరెడ్డిపాలెం సంస్థానం, ఆంధ్ర ప్రదేశ్.
  • నోస్సం సంస్థానం, ఆంధ్ర ప్రదేశ్.
  • నారాయణపురం సంస్థానం, తెలంగాణ.
  • దొంతి సంస్థానం, తెలంగాణ.
  • కొండూరు సంస్థానం, ఆంధ్ర ప్రదేశ్.
  • కార్వేటి నగర సంస్థానం (మొదట్లో), ఆంధ్రప్రదేశ్

రెడ్ల పేర్లు పెట్టిన పట్టణాలు, నగరాలు

రెడ్డియర్ పాలేం (పుదుచ్చేరి)

ఉయ్యలవాడ నరసింహ రెడ్డి

ప్రముఖ రెడ్లు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

కళలు

[మార్చు]

వ్యాపారం

[మార్చు]

శీర్షిక పాఠ్యం

[మార్చు]

కేంద్ర ప్రభుత్వం

[మార్చు]

రాష్ట్ర ప్రభుత్వం

[మార్చు]

ముఖ్యమంత్రి (2019 ప్రస్తుతం)

తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి (2024 ప్రస్తుతం)

అంతర్జాతీయం

[మార్చు]
  • బత్తెన. కోటేశ్వర రెడ్డి - ఐక్యరాజ్యసమితి విశ్లేషకమండలి సలహాదారుడు.
  • చిట్టెపు రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి- ఐ.సి.సి సభ్యులు

క్రీడలు

[మార్చు]
  • భరత్ రెడ్డి - భారత మాజీ క్రికెట్ ఆటగాడు
  • బి. దుర్గా ప్రసాద్ రెడ్డి- ప్రముఖ ఫెన్సింగ్ ఆటగాడు
  • రాజశేఖరరెడ్డి పుల్లయ్యగారి, మాజీ అండర్ (19) క్రికెట్ క్రీడాకారుడు.

గమనికలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. చూ., మన వేమన, ఆరుద్ర రచన, పేజీ 129.
  2. " రెడ్డి " సంచికలో కుందూరి ఈశ్వరదత్తుగారి రెడ్డి పదోత్పత్తి వికాసం అనే వ్యాసం.
  3. "శ్రీరస్తు రెడ్డి కుల నిర్ణయ చంద్రిక, శేషాద్రి రమణ కవులు".
  4. 4.0 4.1 "కాకతీయ సామంతులు".
  5. "Telangana lo Mukhyamaina Samsthanalu".
  6. "సంగారెడ్డి జిల్లా".
  7. "A lifeless ordinary".