ఆర్ద్రత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేమ అలుముకున్న ప్రాంతం
ఆర్ద్రతామాపకం

ఆర్ద్రత అనగా గాలిలోని నీటి ఆవిరి పరిమాణం. ఈ నీటి ఆవిరి నీటి యొక్క వాయు స్థితిలో, కంటికి కనిపించకుండా ఉంటుంది. ఆర్ద్రత అనేది అవపాతం, బిందు, లేదా పొగమంచు ఏర్పడే సంభావ్యత సూచిస్తుంది. అధిక తేమ చర్మం నుండి తేమ యొక్క ఆవిరి రేటు తగ్గించడం ద్వారా శరీరం శీతలీకరణలో చెమట పట్టుట యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఆర్ద్రత రెండు విధాలు: 1. పరమ ఆర్ద్రత 2. సాపేక్ష ఆర్ద్రత. నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుత ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.

ఆర్ద్రతను కొలవడానికి ఆర్ద్రతామాపకాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఆంగ్లంలో హైగ్రోమీటర్ అంటారు. హైగ్రోమీటర్లు రెండు రకాలు: 1. హెయిర్ హైగ్రోమీటర్, 2. కెపాసిటివ్ హైగ్రోమీటర్

సాపేక్ష ఆర్ద్రత

[మార్చు]

సమతలంగా ఉన్న స్వచ్ఛమైన నీటి ఉపరితలంపై,[1] నిర్దుష్ట ఉష్ణోగ్రత వద్ద, గాలి-నీరుల మిశ్రమం లోని నీటి ఆవిరి పాక్షిక పీడనానికి , నీటి సమతుల్య బాష్పపీడనానికీ ఉన్న నిష్పత్తిని ఆ మిశ్రమపు సాపేక్ష ఆర్ద్రత or అంటారు:[2][3]

మరో మాటలో చెప్పాలంటే, సాపేక్ష ఆర్ద్రత అనేది నిర్దుష్ట ఉష్ణోగ్రత వద్ద, గాలిలో ఉన్న నీటి ఆవిరికీ, గాలికి ఎంత నీటి ఆవిరిని కలిగి ఉండే సామర్థ్యానికీ ఉన్న నిష్పత్తి అన్నమాట. ఇది గాలి ఉష్ణోగ్రతతో మారుతుంది: చల్లటి గాలిలో తక్కువ నీటి ఆవిరి ఉంటుంది. కాబట్టి సంపూర్ణ ఆర్ద్రత స్థిరంగా ఉన్నప్పటికీ, గాలి ఉష్ణోగ్రతను మారితే సాపేక్ష ఆర్ద్రత మారుతుంది.

గాలి చల్లబడే కొద్దీ సాపేక్ష ఆర్ద్రత పెరుగుతూ, నీటి ఆవిరి ద్రవీభవించడానికి కారణమవుతుంది (సాపేక్ష ఆర్ద్రత 100% కంటే ఎక్కువ పెరిగితే, సంతృప్త స్థానం). అలాగే, వేడెక్కుతున్న గాలి సాపేక్ష ఆర్ద్రతను తగ్గిస్తుంది. పొగమంచుతో కూడిన గాలిని వేడెక్కిస్తే, ఆ పొగమంచు ఆవిరైపోతుంది, ఎందుకంటే నీటి బిందువుల మధ్య గాలి నీటి ఆవిరిని పట్టుకుంటుంది కాబట్టి.

సాపేక్ష ఆర్ద్రత అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని మాత్రమే పరిగణిస్తుంది. మిస్ట్, మేఘాలు, పొగమంచు, నీటి ఏరోసోల్‌లు గాలి సాపేక్ష ఆర్ద్రత కొలమానంలో లెక్కించబడవు. అయితే వాటి ఉనికిని బట్టి, ఆ ప్రదేశం లోని గాలి డ్యూ పాయింటుకు దగ్గరగా ఉండవచ్చని సూచిస్తుంది.

సాపేక్ష ఆర్ద్రతను సాధారణంగా శాతంగా చూపిస్తారు; ఈ శాతం ఎంత ఎక్కువగా ఉంటే గాలి-నీటి మిశ్రమం అంత తేమగా ఉంన్నట్లు. 100% సాపేక్ష ఆర్ద్రత వద్ద, గాలి సంతృప్తమవుతుంది, దాని ద్రవీభవన స్థానం (డ్యూ పాయింటు) వద్ద ఉంటుంది. చుక్కలు లేదా స్ఫటికాలు ఏర్పడడానికి అవసరమైన బయటి పదార్థం లేనప్పుడు, సాపేక్ష ఆర్ద్రత 100% కంటే ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంలో గాలి సూపర్‌శాచురేటెడ్ గా ఉంది అని అంటారు. 100% సాపేక్ష ఆర్ద్రత కంటే ఎక్కువ ఉన్న గాలి ఉన్న ప్రదేశంలో కొన్ని కణాలను లేదా ఏదైనా ఉపరితలాన్ని ప్రవేశపెడితే, వాటిపై ద్రవీభవనం లేదా మంచు ఏర్పడుతుంది. తద్వారా కొంత ఆవిరి తొలగిపోయి, తేమ తగ్గుతుంది.

సాపేక్ష ఆర్ద్రత అనేది వాతావరణ సూచనలు, నివేదికలలో ఉపయోగించే ముఖ్యమైన కొలమానం. ఇది అవపాతం, మంచు లేదా పొగమంచు యొక్క సంభావ్యతను సూచిస్తుంది. వేడి వేసవి వాతావరణంలో, సాపేక్ష ఆర్ద్రత పెరిగితే చర్మం నుండి చెమట బాష్పీభవనాన్ని అడ్డుకుని మానవులకు (ఇతర జంతువులకూ) శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉదాహరణకు, హీట్ ఇండెక్స్ ప్రకారం, గాలి ఉష్ణోగ్రత 26.7 °C (80.0 °F), సాపేక్ష ఆర్ద్రత 75% ఉంటే శరీరానికి అది 28.7 °C ±0.7 °C (83.6 °F ±1.3 °F) లాగా అనిపిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "Water Vapor Myths: A Brief Tutorial".
  2. Perry, R.H. and Green, D.W, Perry's Chemical Engineers' Handbook (7th Edition), McGraw-Hill, ISBN 0-07-049841-5, Eqn 12-7
  3. Lide, David (2005). CRC Handbook of Chemistry and Physics (85 ed.). CRC Press. pp. 15–25. ISBN 0-8493-0485-7.