1552
స్వరూపం
1552 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1549 1550 1551 - 1552 - 1553 1554 1555 |
దశాబ్దాలు: | 1530లు 1540లు - 1550లు - 1560లు 1570లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 12: పెడ్రో డి వాల్డివియా చిలీ నగరమైన వాల్డివియాను శాంటా మారియా లా బ్లాంకా డి వాల్డివియా అనే పేరుతో స్థాపించాడు.
- ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్‌లో హన్సేటిక్ లీగ్ అధికారాలను రద్దు చేసారు.
- మార్చి: ఏకరీతి చట్టంతో ఇంగ్లాండ్లో ప్రొటెస్టంట్ పద్ధతిలో ప్రార్థన చెయ్యాలనే నిబంధన విధించింది.
- మార్చి 26: గురు అమర్ దాస్ మూడవ సిక్కు గురువు అయ్యాడు .
- ఏప్రిల్: ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ II, చార్లెస్ V చక్రవర్తి మధ్య యుద్ధం ప్రారంభమైంది. హెన్రీ డచీ ఆఫ్ లోరైన్ పై దాడి చేసి, టౌల్, మెట్జ్, వెర్డున్‌లను బంధిస్తాడు.
- ఏప్రిల్ 16: పెడ్రో డి వాల్డివియా చిలీలోని లా ఇంపీరియల్ నగరాన్ని స్థాపించాడు.
- జూలై 6 - జూలై 9: హంగరీలో, ఒట్టోమన్ సామ్రాజ్యం డ్రెగ్లీ కాజిల్‌పై దాడి చేసింది. 8,000 టర్కిష్ రైడర్లతో 4 రోజుల పోరాటం తరువాత కోటలోని 140 మంది సైనికులు, కెప్టెన్ గైర్జీ స్జాండి మరణించారు.
- సెప్టెంబరు: హంగేరిలో, ఒట్టోమన్ సామ్రాజ్యానికి చెందిన కారా అహ్మద్ పాషా జరిపిన ఈజర్ ముట్టడిని కెప్టెన్ ఇస్తావిన్ డోబే విచ్ఛిన్నం చేసాడు.
- అక్టోబర్ 2: కజాన్ ఖానేట్, రష్యాకు చెందిన ఇవాన్ IV దళాల వశమైపోయింది .
- తేదీ తెలియనివి
- పెర్షియన్ గల్ఫ్‌లో, ఒట్టోమన్ సామ్రాజ్యపు ఎర్ర సముద్ర దళం పోర్చుగీస్ బలమైన కోట అయిన హార్ముజ్‌పై దాడి చేసింది. కాని దానిని పట్టుకోవడంలో విఫలమైంది.[1]
- ఒట్టోమన్లు టెమేశ్వర్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- ఇటలీలో బార్టోలోమియో యుస్టాచి తన టాబులే అనాటొమైకేను పూర్తి చేసి, లోపలి చెవి, గుండె యొక్క నిర్మాణంపై తన ఆవిష్కరణలను ప్రదర్శించాడు, [2] అయితే, మత విచారణకు భయపడి, దీన్ని 1714 వరకు ప్రచురించలేదు.
- ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ VI రాయల్ చార్టర్ ద్వారా 35 గ్రామర్ స్కూళ్ళను స్థాపించాడు.[3] ష్రూస్‌బరీతో సహా; లీడ్స్ గ్రామర్ స్కూల్ కూడా ఈ క్రమం లోనే స్థాపించారు.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- మార్చి 28: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ (జననం.1504)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ మూస:New Cambridge History of Islam
- ↑ Grun, Bernard (1991). the Timetables of History (3rd ed.). New York: Simon & Schuster. p. 245. ISBN 0-671-74919-6.
- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 218–223. ISBN 0-304-35730-8.