వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో దంతమూలీయ స్పర్శోష్మ శ్వాస అల్పప్రాణ (Unaspirated voiceless alveolar affricate) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [t͡s]. సామాన్యంగా ఈ ధ్వనిని "దంత్య-చ" అనిగాని "తేలిక-చ" అనిగాని వ్యవహరించడం కద్దు. ISO 15919 లో దీని సంకేతం [ĉ]. IASTలో ఈ ధ్వనికి సంకేతం లేదు.

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

స్థానం: దంతమూలీయం (alveolar)

కరణం: జిహ్వాగ్రము (tongue tip)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: స్పర్శోష్మ (affricate) - ముందుగా స్పర్శ (stop) ధ్వనిగా పలికుతూ, చివరగా ఊష్మ ధ్వనిగా ఉచ్చరించడం.

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

[మార్చు]

అచ్చ తెలుగు పదాలలో తాలవ్యాచ్చుల ముందు తాలవ్య చ (ఉదా:చిలక, చేప), కంఠ్యాచ్చుల ముందు దంత్య చ (ఉదా:చదువు, చుక్క, చొప్ప) ను పలుకుతాం. భాషాశాస్త్ర పరిభాషలో దీనిని Complementary Distribution అని అంటారు. రెండు సమీప ధ్వనులు Complementary Distribution లో ఉండే వాటిని సవర్ణాలుగానే (allophones) తప్ప, వేర్వేరు వర్ణాలుగా పరిగణించరు. అయితే, సంస్కృత పదాలను పలికేటప్పుడు మాత్రం కొంతమంది శిష్టులు కంఠ్యాచ్చుల ముందుకూడా వీటిని తాలవ్య చగా పలకడం వినిపిస్తుంది (ఉదా: చక్రం, చూడామణి, చోద్యము) కాబట్టి దంత్య-చను ప్రత్యేక వర్ణంగా గుర్తించాలని వాదించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=ౘ&oldid=2607473" నుండి వెలికితీశారు