Jump to content

సంచి

వికీపీడియా నుండి
వాష్ బ్యాగ్
జర్మన్ మిలిటరీ బ్రెడ్ బ్యాగ్

సంచి (ఆంగ్లం Bag) మనం సాధారణ గృహోపకరణంగా ఉపయోగించే వస్తువు. ఇవి మృదువుగా ఉండి కాగితం, వస్త్రం, ప్లాస్టిక్, తోలు మొదలైన పదార్ధాలతో తయారుచేయబడతాయి. కొన్ని పెద్ద సంచుల్ని బస్తాలు అంటారు.

వివిధ రకాలైన సంచుల్ని ప్యాకింగ్ లోను, వస్తువుల్ని మనతో తీసుకొని పోవడానికి ఉపయోగిస్తారు. మన కోసం ఉపయోగించేటప్పుడు చేతితో పట్టుకోవడానికి హేండిల్స్ లేదా తాళ్ళు కట్టి ఉండాలి. కొన్నింటిని భుజానికి వేలాడదీస్తాము. కొన్నింటిని వీపు మీద మోయడానికి పెద్ద బెల్టుల్ని ఉపయోగిస్తారు.

చిన్న చిన్న కాగితపు సంచుల్ని టీ పొడి మొదలైన వస్తువుల రసం తీసుకోవడానికి చాలా సౌకర్యంగా రెడీమేడ్ పద్ధతిలో ఉపయోగంలో ఉన్నాయి.

సంచుల్ని మూయడానికి జిప్పు గాని మరొక విధంగా అమరిక చేసి ఉంటుంది. కొన్నింటికి తాళం వేసుకోవడానికి వీలుగా రింగులు ఉంటాయి. విలువైన వస్తువులు లేదా ఎక్కువగా ఖరీదైన నగలు కోసం ఉపయోగించేవాటికి ఈ ఏర్పాటు ఉంటుంది. బస్తాలు వంటి పెద్ద సంచుల్ని తాడు లేదా దారంతో కుట్టి దూర ప్రాంతాలకు రవాణా చేస్తారు.

ప్లాస్టిక్ తో చేసిన సన్నని సంచులు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడతాయి. చెత్తవేసుకోవడానికి ఉపయోగించే సంచులు పారిశుధ్యం గురించి చెత్తతో పారవేయడం మంచిది. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సంచుల్ని ఉపయోగించవద్దని చాలా స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. గుడ్డతో చేసిన సంచులు శుభ్రం చేసుకొని మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చును.

సంచులు చిన్నగా మడత పెట్టుకొని చాలా సౌకర్యంగా కావలసిన ప్రదేశానికి తీసుకొని వెళ్ళవచ్చును. అయితే డబ్బాలను ఈ విధంగా చేయుటకు వీలుకాదు.

సంచులలో చిన్నవి తోలుతో తయారుచేసినవి జేబులో పెట్టుకొని పర్సుగా చిన్నచిన్న వస్తువులు మనతో తీసుకొని పోవచ్చును. జేబుఖర్చుకోసం ఉపయోగించే ధనం, లైసెన్స్, క్రెడిట్ కార్డులు మొదలైనవి ఇందులో ఉంచుకుంటాము.

కాగితంతో చేసిన చేతి సంచులు చాలా చౌకగా సౌకర్యంగా ఉంటాయి. పర్యావరణం దీని వలన హాని కలుగదు. ప్లాస్టిక్ సంచులకు ఇవి మంచి ప్రత్యామ్నాయం. కానీ ఇవి ఎక్కువ బరువును తీసుకొని పోతే చిరిగిపోతాయి.

కాగితం వస్తువుల్ని పాకింగ్ కోసం ప్రాచీన చైనాలో 2వ శతాబ్దం నుండి ఉపయోగంలో ఉన్నాయి.[1] అయితే కాగితాన్ని సంచులుగా ఉపయోగించడం టాంగ్ సామ్రాజ్యం (618-907 AD) నుండి మొదలైనది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Needham, Volume 4, 122.