శశాంక్
సిద్ధంశెట్టి శశాంక్ | |
---|---|
జననం | [1] సికిందరాబాదు[1] | 1979 నవంబరు 22
వృత్తి | నటుడు |
పురస్కారాలు | నంది పురస్కారం |
సిద్ధంశెట్టి శశాంక్ (జననం: నవంబరు 22, 1979) ఒక తెలుగు సినిమా నటుడు. శశాంక్ మొదటి సినిమా ఐతే. 2005 లో సై సినిమాకు గాను శశాంక్ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.[2]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]శశాంక్ నవంబరు 22, 1979 న సికిందరాబాదులో జన్మించాడు. పదో తరగతి దాకా సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో చదివాడు. తండ్రి సిద్ధంశెట్టి రాజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజరు. తల్లి ఉషారాణి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రంలో సహాయ ఆచార్యులు.[3] హిమాయత్ నగర్ లోని సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా బీకాం పూర్తి చేశాడు.
నటన
[మార్చు]శశాంక్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని. ఆయన స్ఫూర్తితో నటుడు కావాలనుకున్నాడు. మొదట్లో డి.యస్. దీక్షితులు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత ముంబై లోని కిషోర్ నమిత్ కపూర్ ఇన్‌స్టిట్యూట్ లో శిక్షణ తీసుకున్నాడు. బాలీవుడ్ కథానాయకుడు హృతిక్ రోషన్ కూడా ఈ పాఠశాల విద్యార్థి కావడం గమనార్హం. ఫిబ్రవరి 2002 లో చంద్రశేఖర్ యేలేటి ఇతనికి ఐతే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
సినిమాలు
[మార్చు]- ఐతే
- సై
- అనుకోకుండా ఒక రోజు
- పార్టీ
- ఏమైంది ఈవేళ
- పాఠశాల (2014)
- కౌసల్య కృష్ణమూర్తి (2019)[4]
- ప్రణవం (2021)
- శబరి (2023)
- మా నాన్న సూపర్‌హీరో (2024)
- ఆర్టిఐ (2024)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో శశాంక్ ముఖాముఖి". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 5 September 2017.
- ↑ "Rajendra Prasad is over the moon". thehindu.com. ది హిందు. Retrieved 5 September 2017.
- ↑ "తెలుగు సహాయ నటుడు శశాంక్ జీవిత విశేషాలు". nettv4u.com. nettv4u.com. Retrieved 5 September 2017.
- ↑ ఈనాడు, సినిమా (23 August 2019). "రివ్యూ: కౌసల్య కృష్ణమూర్తి". www.eenadu.net. Archived from the original on 23 ఆగస్టు 2019. Retrieved 10 January 2020.