Jump to content

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 57

వికీపీడియా నుండి

పాత చర్చ 56 | పాత చర్చ 57 | పాత చర్చ 58

alt text=2018 జనవరి 21 - 2018 మార్చి 12 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 జనవరి 21 - 2018 మార్చి 12

Wikigraphists Bootcamp Survey Reminder

[మార్చు]

Greetings,

As it has already been notified about Wikigraphists Bootcamp in India, for training related to creation drawings, illustrations, diagrams, maps, graphs, bar charts etc. and to tune the images to meet the QI and FP criteria, please fill the survey form linked from Talk:Wikigraphists Bootcamp (2018 India). It'll help the organizers to assess the needs of the community, and plan accordingly. Please ignore if already done. Krishna Chaitanya Velaga 03:03, 21 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయ అవసరాల మదింపు - సర్వే

[మార్చు]

అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియా సముదాయం అవసరాలు, జరిగిన కార్యక్రమాల తీరుతెన్నులపై స్పందన తెలుసుకునేందుకు, తదనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు రూపకల్పన చేసేందుకు సీఐఎస్-ఎ2కె సర్వే చేపట్టింది. ఈ సందర్భంగా దయచేసి సముదాయ సభ్యులు ఈ సర్వే ఫాం నింపి, తమ సూచనలు, స్పందన తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:43, 24 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సర్వే ఫారం పూరించటానికి పూర్తిగా కొనసాగటం లేదు. JVRKPRASAD (చర్చ) 02:25, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ సమస్యను నివేదించినందుకు ధన్యవాదాలు. పూర్తిగా కొనసాగకపోవడం అంటే ఏమవుతోంది? ఏ విభాగం వద్ద ఆగిపోతోంది? కాస్త వివరంగా చెప్తే సరిదిద్దుతాం. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 03:00, 29 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) మీరే ఒకసారి ప్రయత్నము చేసి చూడండి, లేదా తెలిసిన వారితో ఫారం పూర్తి చేయించండి. ఎక్కడ అంటే మధ్యలో ముందుకు కొనసాగలేదు నాకు, వివరం చెప్పలేను, అయినా మరోసారి ప్రయత్నం చేస్తాను, వీలయితే వ్రాస్తాను. JVRKPRASAD (చర్చ) 02:34, 5 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అంగ్ల పదానికి తెలుగు పదం

[మార్చు]

forced circulation అనే పదానికి సరైన తెలుగు పదాన్నిఎవ్వరైన తెలిసిన వారు సూచించగలరు.Palagiri (చర్చ) 04:25, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Palagiri గారు, వ్యాసము సందర్భాన్ని బట్టి, forced circulation = నిర్బంధ ప్రసరణము అనేది సరి అయిన పదము అని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 05:46, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గార్కీ మీ స్పందనకు ధన్యవాదాలు.నేను రాస్తున్న బాయిలరు వ్యాసానికి సందర్భయుతంగా లేదనిపిస్తున్నది.Palagiri (చర్చ) 07:30, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
"అస్వాభావికమైన ప్రసరణము" అనే పదము సరిపోతుందేమోనండి. JVRKPRASAD (చర్చ) 14:24, 28 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Palagiri గారూ, natural circulation = సహజ ప్రసరణము , forced circulation = బలాత్కృత ప్రసరణము అవుతుంది. ఇటువంటి పదాలే ధ్వని లో కూడా వాడబడుచున్నవి. అందులో natural vibrations = సహజ కంపనాలు , forced vibrations = బలాత్కృత కంపనాలు అని వాడబడుచున్నవి. --కె.వెంకటరమణచర్చ 14:57, 29 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASADమరియుకె.వెంకటరమణగార్కి మీ స్పందనకు ధన్యవాదాలు.రమణ గారన్నట్లు forced circulation కు బలాత్కృత ప్రసరణము అనువాదం సరిపోతుందని అనుకుంటున్నాను.

సీఐఎస్-ఎ2కె 2017-18 కార్యప్రణాళిక పురోగతి నివేదిక

[మార్చు]

అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె వారి 2017 జూలై నుంచి 2018 జూన్ వరకూ గల కాలంలో అమలుచేస్తున్న కార్యప్రణాళిక యొక్క పురోగతిపై అర్థసంవత్సర నివేదిక తయారుచేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలుగు ఫోకస్ లాంగ్వేజ్ ఏరియా కార్యప్రణాళిక పురోగతి నివేదికను అనువదించి ఇక్కడ ప్రచురిస్తున్నాను, దాని ఆంగ్ల మూలాన్ని ఇక్కడ ఉంచాము (డ్రాఫ్ట్ స్థితి నుంచి ప్రచురించాకా, ఆ లంకె, మొత్తం సీఐఎస్-ఎ2కె 2017-18 అర్థసంవత్సర పురోగతి నివేదిక లంకె కూడా ఇక్కడ ఇస్తాము). దయచేసి పరిశీలించి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:02, 29 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఫౌండేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు (ఇంటర్నెట్ అభ్యర్థన)లో మద్దతు కొరకు

[మార్చు]

అందరికి నమస్కారం. వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ సంయుక్తంగా ఇండిక్ వికిమీడియన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు (ల్యాప్ టాప్, ఇంటర్నెట్ వంటివి) ను అందిస్తున్నారు. అందులో భాగంగా నేను ఇంటర్నెట్ కోసం అభ్యర్థించడం జరిగింది. నేను నా మొబైల్ ఇంటర్నెట్ సహాయంతో వికీలో రాస్తున్నాను. నాకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే మరింత ఎక్కువగా వికీని అభివృద్ధి చేసే అవకాశముండడమేకాకుండా, నా భార్య (నాగరాణి బేతి) చేత కూడా వికీలో రాయించడానికి వీలుగా ఉంటుంది. సభ్యులు తమ మద్దతును ఇక్కడ తెలుపగలరు. ధన్యవాదాలు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:42, 30 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Pranayraj Vangari, రచ్చబండను వ్యక్తిగత ప్రయోజనాలకై ఉపయోగించుకోవడం బాగుండదు. ఫలానాచోట ఈ విషయంపై మీ అభిప్రాయాలు తెలపండి అని వ్రాసినా సరిపోయేది. ఏకంగా మద్దతు ఇమ్మనే వ్రాసుకోవడం సరికాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:11, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అందరికి నమస్కారం.
నేను 2013, మార్చి 8న థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) ఆధ్వర్యంలో హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన వికీపీడియా:సమావేశం/మార్చి 8, 2013 సమావేశంలో సభ్యునిగా చేరాను. ఆనాటి నుండి ఇప్పటివరకు దాదాపుగా హైదారాబాదులో జరిగిన ను నిర్వహించాను, పాల్గొన్నాను. అంతేకాకుండా అన్లైన్ లో రాస్తూ (తెవికీలో నా మార్పులు) వస్తున్నాను.

వికీలో నా కృషి

  1. 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్ తో 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్ గా గుర్తింపుపొందాను. 2016, సెప్టెంబర్ 8న తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబర్ 7న 'వికీవత్సరం' పూర్తిచేశాను. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందనలు తెలిపారు, తెలుగు వికీపీడియా గురించి కూడా ప్రస్తావన అయింది. (ఉపరాష్ట్రపతి గారి ట్వీట్, ఉపరాష్ట్రపతి గారి ట్వీట్) రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్, ఫేస్ బుక్ అభినందనలు తెలిపడమేకాకుండా ప్రగతి భవన్ లోని తన ఛాంబర్ లో సత్కరించారు. (కేటీఆర్ గారి ట్వీట్, కేటీఆర్ గారి ట్వీట్) ప్రస్తుతం 1000రోజులు – 1000వ్యాసాలు రాసే ప్రయత్నంలో ఉన్నాను.
  2. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వికీపీడియన్లు చేస్తున్న 100రోజులు – 100వ్యాసాలు అనే కాన్సెప్ట్ ను వికీవత్సరంగా రూపకల్పన చేసుకొని, దాన్ని విజయవంతగా పూర్తిచేసి, ప్రపంచ భాషల వికీపీడియన్లు తెలుగు వికీపీడియా గురించి చర్చించుకునేలా చేశాను. (వికీమీడియా బ్లాగులో నా వికీవత్సరం గురించిన బ్లాగ్ పోస్టు) అంతేకాకుండా తెలుగు వికీపీడియాపై వివిధ పత్రికలలో అనేక వార్త కథనాలు వచ్చి, మరింత మందికి తెలుగు వికీపీడియా ప్రచారం చేరువయ్యేందుకు దోహదపడ్డాను. (తెవికీలో నా కృషిపై వివిధ పత్రికల వార్తాకథనాలు)
  3. ఇంతవరకు ఏ భాష వికీపీడియా సమూహానికి లభించని రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు, భాగస్వామ్యంను తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలుగు వికీపీడియాకు లభించేందుకు కృషి చేశాను. (తెలుగు వికీపీడియాతో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందంపై ది హిందూ పత్రికలో వచ్చిన వార్త)
  4. ఇప్పటివరకి 870కి పైగా కొత్త వ్యాసాలను సృష్టించాను. అనేక వ్యాసాలలో మార్పులు చేశాను.
  5. తెలంగాణ, తెలంగాణ తేజోమూర్తులు ఎడిటథాన్, తెలుగు సినిమాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక స్థలాలు ఎడిటథాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాలు మొదలైన వికీ ప్రాజెక్టులలో పాల్గొంటున్నాను.
  6. తెలుగు వికీపీడియా గురించి సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా చరిత్రలో ఈరోజు, మీకు తెలుసా, ప్రముఖ జయంతి వర్ధంతుల వివరాలు, ముఖ్య దినాల గురించి పోస్టు చేసి తెలుగు వికిపీడియా గురించి అవగాహన కలిపిస్తున్నాను.
  7. నా పెళ్లి జరిగిన రోజున కూడా ఒక వ్యాసం రాయడమేకాకుండా, అదేరోజున మా ఆవిడను (నాగరాణి బేతి) కూడా వికీపీడియాలో సభ్యురాలుగా చేర్పించాను. ఈ కాన్సెప్టును సముదాయ సభ్యులైన పవన్ సంతోష్ గారు వికీకళ్యాణంగా ప్రస్తావించారు. అంతేకాకుడుండా నానుండి స్ఫూర్తిని పొంది అజయ్ బంబి, రాజశేఖర్ లు వికీలో రాస్తున్నారు.

అంతర్జాల సమస్య
లాప్టాప్ కొనుక్కోలేక తెలుగు వికీపీడియాలో కృషిచేయలేకపోతూండగా మరింత కృషి చేయగలిగేందుకు వికీమీడియా ఇండియా చాప్టర్ వారు 2015లో నాకు లాప్ టాప్ ఇచ్చారు. గత సంవత్సరం వరకు నేను తెలుగు విశ్వవిద్యాలయం వారి హాస్టల్ లో ఉండడంతో అక్కడి వైఫైని ఉపయోగించి లాప్ టాప్ లో వికీపీడియా పనులు చేసేవాడిని. ప్రస్తుతం నేను వేరుగా గది తీసుకొని ఉంటూ, నా చరవాణిలో ఉన్న అంతర్జాలాన్ని ఉపయోగించి వికీలో రాస్తున్నాను. కానీ, సరైన సిగ్నల్ రాకపోవడం, ఒక్కోసారి అంతర్జాలం పనిచేయకపోడం వల్ల వికీ రచనకు ఆటంకం కలుగుతుంది. వికీకామన్స్ లో ఫోటోలను ఎక్కించడం సాధ్యపడడటంలేదు. ఇంట్లో అంతర్జాలం అందుబాటులో లేకపోవడంవల్ల నేను లేని సమయంలో మా ఆవిడ వికీలో రాయడం సాధ్యపడడంలేదు.

అంతర్జాలం ఉంటే
చరవాణి అంతర్జాలం ఉపయోగించి చేసే వికీ రచనతో పోల్చుకుంటే అంతర్జాలంతో చేసే పని వేగవంతం అవుతుంది. అంతర్జాలం అందుబాటులో ఉంటే నా వికీ రచనతోపాటు మా ఆవిడ కృషి కూడా పెరుగుతుంది.

రచ్చబండ - వ్యక్తిగత ప్రయోజనం
రచ్చబండ అనేది సముదాయ సభ్యుల మధ్య చర్చలకోసం ఏర్పాటుచేయబడింది. వికీపీడియా రచనలకోసం వికీపీడియా నుండి ఏదైన సహాయం కోరుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని సముదాయ సభ్యులకు చెప్పడం అవసరం. అందులో భాగంగా రచ్చబండలో నా ఈ అభ్యర్థన గురించి టపా చేయడం జరిగింది. ఇటువంటి వికీపీడియా సంబంధిత అంశాలను వ్యక్తిగత పరిచయాలను ఆధారంగా వేరే వేరే మాధ్యమాల్లో కన్నా రచ్చబండలో రాయడమే ఆరోగ్యకరం. ఇక మద్దతు విషయం... ఇది సముదాయ సభ్యుల మధ్య పోటి కాదు, వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ సంయుక్తంగా ఇండిక్ వికీమీడియన్లకు ఇవ్వబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు కోసం చేసిన అభ్యర్థన. ఇప్పటికే భారతీయ భాషల వికీపీడియాల్లో కృషిచేసి, లాప్టాప్ కానీ, ఇంటర్నెట్ కానీ అందుబాటులో ఉంటే మరింతగా కృషిచేయగలిగిన భారతీయ వికీపీడియన్లు అందరూ దరఖాస్తు చేయవచ్చు. కాబట్టి, సముదాయ సభ్యుల మద్దతు కోరడంలో తప్పులేదని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 12:14, 6 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీకార్యక్రమం అనేది స్వచ్ఛందంగా చేసే కార్యక్రమం. చేసినదాని గురించి చెప్పుకోవడం బాగుండదు, దానికి రచ్చబండ ప్రచారవేదిక అసలేకాదు. ఆ సంగతి ప్రక్కనపెట్టి అసలు సంగతికి వస్తే రచ్చబండ అనేది చర్చలకోసం ఏర్పాటు చేసిన సంగతిని కూడా ఎవరూ తప్పుపట్టరు. ఒకానొకదశలో రచ్చబండనే తొలగించాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు నేనే తీవ్రంగా వాదించి రచ్చబండ ఉండాల్సిందేనని వాదించిన సంగతి కూడా సభ్యులకు తెలుసు. ఏదేని అంశం సభ్యుల దృష్టికి వెంటనే రావడానికి ఇది దోహదకారేననే సంగతిపై చర్చ అక్కరలేదు కాని ఏదేని చోట ఓటింగు లేదా చర్చ జరుగుతున్నప్పుడు ఇక్కడ లింకు ఇచ్చి సభ్యుల అభిప్రాయాలు తెలియజేయమని వ్రాయడం వరకే బాగుంటుంది. ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని సభ్యులను అభ్యర్థించడం మాత్రం తగదు (ప్రతిస్పందిస్తారా లేదా, ప్రతిస్పందించిననూ మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా, తటస్థంగా ఉంటారా అనేది సభ్యుల ఇష్టానికి వదిలేయాలి). పొరపాట్లు జరుగుతున్నప్పుడు తెవికీ నిర్వహణలో భాగంగా తెలియజేయబడింది. అర్థం చేసుకుంటే చాలు. ఒక్క దిద్దుబాటు చేసిననూ, లక్ష దిద్దుబాట్లు చేసిననూ పొరపాట్ల విషయంలో మినహాయింపులు ఉండవు. నిర్వహణ సూచనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:20, 6 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రణయ్‌రాజ్ గారూ, వికీపీడియాకు మీరు చేస్తున్న సేవ అభినందనీయం. మీరు కోరుతున్న గ్రాంటుకు మీరు అర్హులే. మీకు గ్రాంటు లభించలని కోరుకుంటూ __చదువరి (చర్చరచనలు) 04:35, 7 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ భాషల వికీపీడియాల మద్దతు ప్రోగ్రాం-అవసరమైన వికీపీడియన్లకు లాప్టాప్ ఇంటర్నెట్ స్టైపండ్

[మార్చు]

భారతీయ భాషల్లో స్థానికంగా ఉపకరించే, అత్యంత నాణ్యమైన సమాచారం సృష్టించేలా వికీపీడియా సముదాయాలను ప్రోత్సహించడం లక్ష్యంగా 2017-18లో వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ కలసి, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ - యాక్సెస్ టు నాలెడ్జ్ (సీఐఎస్-ఎ2కె), వికీమీడియా ఇండియా చాప్టర్ మరియు యూజర్ గ్రూపులతో సన్నిహితంగా పనిచేస్తూ పైలట్ ప్రోగ్రాం ప్రారంభిస్తూంది. ఈ ప్రోగ్రాం (కోడ్: ప్రాజెక్ట్ టైగర్) అ. చురుకైన, అనుభవం కలిగిన వికీపీడియా వాడుకరులకు లాప్టాపులు అందించడం, ఆ. ప్రస్తుతం వికీపీడియాలో ఉన్న కొన్ని అంశాల్లో సమాచారం లోటు తీర్చడం లక్ష్యంగా ఒక భాష-ఆధారిత పోటీకి స్పాన్సర్ చేయడం.

ప్రస్తుత దశ (జనవరి 2018)లో ఇప్పటికే కృషిచేస్తున్న వాడుకరుల్లో మరింత చురుకుగా కృషిసాగించేందుకు లాప్టాప్, ఇంటర్నెట్ మద్దతు అవసరమైనవారికి లాప్టాప్, ఇంటర్నెట్ స్టైపెండ్ అందిస్తారు. 50 బేసిక్ మోడల్ ఏసర్ క్రోమ్ బుక్స్, 100మంది వాడుకరులకు ఇంటర్నెట్ స్టైపండ్స్ అందజేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అందించిన వనరులు లబ్దిదారులవి అవుతాయి, వికీమీడియా ఉద్యమం మెరుగుదల కోసం ఉపయోగించాలి.

మద్దతు కోసం అప్లై చేయండి
  • మీరు చురుకైన వికీమీడియన్ అయివుండీ, ఈ ప్రాజెక్టు ద్వారా మద్దతు అందుకునేందుకు ఆసక్తి కలిగివుంటే ఇక్కడ అప్లై చేయవచ్చు.
  • ఇందుకు పది నిమిషాల దాకా సమయం పడుతుంది, భారతీయ భాషల వికీమీడియా ప్రాజెక్టుల్లో మీ కృషిని గురించి వివరణాత్మకమైన ప్రశ్నలు ఉంటాయి.
  • పైన ఇచ్చిన లింకులో Your Username అన్న పెట్టెలో మీ వాడుకరి పేరు రాసి "Request for support" అన్నదానిపై నొక్కండి, అదొక కొత్త ఉపపేజీకి తీసుకువెళ్తుంది.
  • అన్ని ప్రశ్నలకూ సవివరంగా సమాధానం ఇవ్వండి.
  • మీకు సౌకర్యవంతమైన భాషలో అప్లికేషన్ నింపవచ్చు. ఆంగ్లంలోకి మీ అప్లికేషన్ అనువదించేందుకు ఎవరైనా సహ-వికీపీడియన్ ను మీరు కోరగలిగితే తప్పకుండా ప్రయత్నించండి.
  • విజయవంతంగా అప్లికేషన్ నింపిన తర్వాత, సహ సముదాయ సభ్యులను ఆమోదించమని కోరండి. ఆమోదాల సంఖ్య ఆధారంగా అప్లికేషన్ ఎంపిక జరగదు. ఐతే మీ అవసరాలు, మీరు ఏ విధమైన కృషి చేశారన్నది దీని వల్ల తెలిసే వీలుంటుంది.
  • అప్లికేషన్లు ఇండిక్ వికీమీడియన్లు, పాల్గొనే సంస్థల ప్రతినిధులతో కూడిన ఓ కమిటీ పరిశీలిస్తుంది.
  • మలిదశ పరిశీలనకు ఎంపికైన దరఖాస్తుదారులను వారి అవసరాలను, భవిష్యత్తులో కృషిచేయడం విషయమై సమర్థతల వివరాలు కోసం సంప్రదించడం జరుగుతుంది.
  • అప్లికేషన్లు పూర్తిచేసేందుకు ఆఖరు తేదీ - 2018 ఫిబ్రవరి 11, 11:59 IST
  • దరఖాస్తుల స్థితి ఇక్కడ చూడవచ్చు.

ఈ ప్రాజెక్టు గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ పేజీకి వెళ్ళండి. --పవన్ సంతోష్ (చర్చ) 12:01, 30 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అన్నీ బావున్నాయి. అందరూ అప్లై చేసుకొంటున్నారు. కాని ఇచ్చేవాటిని ఎంతవరకూ వాడుకోగలరు అనేదానిపై కనీస స్పందన కరువవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది. మురళీమోహన్ గారికి లాప్ టాప్ ఇచ్చారుగా అది ఆయనకు ఎంతబాగా ఉపయోగంగా ఉందో మనకందరకూ తెలుసు...అప్పటికపుడు, నాది నాకు, అంతే చాలు, దొరికిందే బంగారం అనుకుంటే దీనిపై స్పందన అవసరం లేదు..లేదూ స్ప్ందించండి. మీకే ఉపయోగం...--Viswanadh (చర్చ) 08:04, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కొందరికి గణాంకాలు కావాలి, మరికొందరికి స్టైపెండ్ కావాలి ! తెవికీ నాణ్యత సంగతి దేవుడెరుగు !! సి. చంద్ర కాంత రావు- చర్చ 19:19, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి సంవత్సరం బాగా పని చేసిన వారికి ఇవ్వాలనుకున్నదేదో ఒక బహుమతి రూపంగా ఇస్తే బావుంటుంది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 02:38, 5 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి స్పందిస్తున్నాను. నేను హార్డ్‌వేర్ డొనేషన్ ప్రోగ్రాం క్రింద వికీమీడియా ఫౌండేషన్ నుండి ఒక లాప్ టాప్‌ను తీసుకున్నాను. అయితే నేను అది వరకు ఉపయోగిస్తున్న ఆఫీసు లాప్‌టాప్ పరిమాణంలో చిన్నది. వికీమీడియా వారు ప్రొవైడ్ చేసే లాప్‌టాప్ పెద్ద సైజులో ఉంటుందని భావించాను. చిన్న సైజు లాప్‌టాప్‌లో ఎడిట్ చేయడానికి నాకు కొంత ఇబ్బందిగా ఉండేది. అయితే నాకు లభించిన లాప్‌టాప్ నా వద్ద ఉన్న లాప్‌టాప్ కన్నా చిన్నది. అదీ కాక ఆ లాప్‌టాప్ వచ్చిన తర్వాత మా ఆఫీసులో నా వద్ద ఉన్న పాతలాప్‌టాప్ బదులుగా కొత్త లాప్‌టాప్ ఇచ్చారు. ఈ కొత్త లాప్‌టాప్ అన్ని విధాలా వికీమీడియా ఫౌండేషన్ ఇచ్చిన లాప్‌టాప్ కన్నా మెరుగైనది. ఈ కారణాల వల్ల ప్రస్తుతం నేను ప్రస్తుతం మా ఆఫీసు లాప్‌టాప్ నే వికీపీడియాలో వ్యాసాలు వ్రాయడానికి గాని, మార్పుచేర్పులు చేయడానికి గాని వాడుతున్నాను. వికీమీడియా ఫౌండేషన్ ప్రదానం చేసిన యూజ్డ్ లాప్‌టాప్ నాకు అన్‌యూజ్డ్‌గా మారింది. :) అయితే నా వికీ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్న విషయాన్ని అందరూ గమనించే ఉంటారు. ప్రస్తుతం నాకు ఉపయోగపడని ఆ లాప్ టాప్ ను ఎవరైనా వికీపీడియా కొరకు వినియోగించడానికి అవసరమైతే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.--స్వరలాసిక (చర్చ) 06:31, 6 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
హార్డ్‌వేర్ డొనేషన్ ప్రోగ్రాం క్రింద వికీమీడియా ఫౌండేషన్ నుండి ప్రాప్తమైన లాప్‌టాప్‌ను 24 మార్చి 2018న అజయ్‌కు అందివ్వడమైనది--స్వరలాసిక (చర్చ) 03:39, 25 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ అంశంమీద నేను పైన రాసిన దానికి ఒక్కొక్కరు ఒకోలా అనుకోవడం జరిగినదని తెలుస్తున్నది. కొన్ని కారణాల రీత్యా కొందరు సహ వికీ మిత్రులు నిజంగా ఆశక్తి ఉండీ రాయలేక అసహాయులుగా ఆగిపోవడం జరుగుతున్న నేపద్యంలో వికీమీడియా పౌండేషన్ గూగుల్ మరియు వికీమీడియా భారతదేశపు గ్రూపులు ఆలోచనలపై వారు ఎంపిక చేసిన అభ్యర్దులకు అందించాలనుకొనే కొన్ని వనరులను అందుకోవడం అవసరమే అనుకొంటూన్నాను. ఒకవేళ మనం వద్దనుకొన్నా మిగతా భాషా వికీ మిత్రులు ఎందరో తయారుగా ఉన్నారు. అయితే వారు ప్రకటించిన వనరులు మునుపు మురళీమోహన్ గారికిచ్చినట్లు నిరుపయోగం కాక ఇచ్చిన వారికి వారి తరువాత మరొకరికి ఉపయోగపడేవిధంగా ఉండాలని నేను ఆ విధంగా నా అభిప్రాయం రాయడం జరిగింది. దీనిపై ఎవరూ అన్యధా భావించవద్దని మనవి..--Viswanadh (చర్చ) 15:28, 6 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఫౌండేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు (ఇంటర్నెట్ అభ్యర్థన)లో మద్దతు కొరకు

[మార్చు]

అందరికి నమస్కారం. వికీమీడియా ఫౌండేషన్, గూగుల్ సంయుక్తంగా ఇండిక్ వికిమీడియన్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు (ల్యాప్ టాప్, ఇంటర్నెట్ వంటివి) ను అందిస్తున్నారు. అందులో భాగంగా నేను ఇంటర్నెట్ కోసం అభ్యర్థించడం జరిగింది. నేను ప్రైవేట్ కంప్యూటర్స్ ద్వారా వికీ లో రాస్తున్నాను. నాకు ల్యాప్ టాప్ మరియు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంటే మరిన్ని వ్యాసాలు రాయడానికి మరియు అభివృధి చేయడానికి తోడ్పాటుగా ఉంటుంది . కావున సభ్యులు తమ మద్దతును ఇక్కడ తెలుపగలరని మనవి. ధన్యవాదాలు. --Ajaybanbi (చర్చ) 13:07, 30 జనవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Ajaybanbi, రచ్చబండను వ్యక్తిగత ప్రయోజనాలకై ఉపయోగించుకోవడం బాగుండదు. ఫలానాచోట ఈ విషయంపై మీ అభిప్రాయాలు తెలపండి అని వ్రాసినా సరిపోయేది. ఏకంగా మద్దతు ఇమ్మనే వ్రాసుకోవడం సరికాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:12, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అజయ్ గారూ, మీకు ఈ గ్రాంటు లభించాలని కోరుకుంటున్నాను.__చదువరి (చర్చరచనలు) 04:40, 7 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఫౌండేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టు (లాప్ టాప్, ఇంటర్నెట్ అభ్యర్థన)లో మద్దతు కోసం

[మార్చు]

సభ్యులందరికీ నమస్కారం. వికీమీడియా ఫౌండేషన్ అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టులో భాగంగా నేను లాప్ టాప్, ఇంటర్నెట్ కోసం అభ్యార్ధించాను. తెలుగు వికీపీడియాలో 100విమెన్ వికీడేస్(రూపకల్పన కూడా), 100వికీడేస్ వంటి చాలెంజ్ లు పూర్తి చేయడం, వివిధ ఎడిటథాన్ లలోనూ, గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు నిర్వహణ, వ్యాసాల అనువాదాలలోనూ నేను చేసిన కృషి సభ్యులందరికీ తెలిసిందే. అక్టోబరులో నా వివాహమైనప్పటినుంచీ వికీలో రాయడానికి మా ఇంట్లో లాప్ టాప్ గానీ, కంప్యూటర్ గానీ, ఇంటర్నెట్ గానీ లేకపోవడంతో సాధ్యపడటం లేదు. అప్పుడప్పుడూ మావారి ఆఫీసుకి వచ్చినప్పుడు వికీలో రాయడానికి ప్రయత్నించడం మినహా ఇదివరకట్లా వికీలో పూర్తిస్థాయిలో రాయడానికి వీలు కుదరట్లేదు. తెలుగు వికీపీడియాలో గూగుల్ అనువాద వ్యాసాలను తిరిగరాయడం ద్వారా నాణ్యతను అభివృద్ధి చేయడం, 100విమెన్ వికీడేస్ ద్వారా సమాచారాన్నీ, వైవిధ్యాన్నీ(Diversity) పెంపొందించడం మాత్రమే కాక, తోటి తెవికీపీడియన్లను, ఇతర భారతీయ భాషావికీపీడియన్లను 100విమెన్ వికీడేస్ చాలెంజ్ స్వీకరించేలా ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్లన్నీ తిరిగి ప్రారంభించాలనీ, తెలుగు వికీపీడియాలోకి మరింత సమాచారం, నాణ్యత నా వంతుగా పెంపొందించాలనీ ఆశిస్తున్నా, లాప్ టాప్ సౌకర్యం లేక ఆగిపోయాను. కాబట్టీ సభ్యులు తమ మద్దతును ఈ లంకెలో తెలుపగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో ..--Meena gayathri.s (చర్చ) 05:06, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Meena gayathri, రచ్చబండను వ్యక్తిగత ప్రయోజనాలకై ఉపయోగించుకోవడం బాగుండదు. ఫలానాచోట ఈ విషయంపై మీ అభిప్రాయాలు తెలపండి అని వ్రాసినా సరిపోయేది. ఏకంగా మద్దతు ఇమ్మనే వ్రాసుకోవడం సరికాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:16, 4 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మీనాగాయత్రి గారూ, మీకు గ్రాంటు లభించాలనీ, మళ్ళీ మునుపటి ఉత్సాహంతో పని చేస్తారనీ ఆశిస్తున్నాను.__చదువరి (చర్చరచనలు) 04:39, 7 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్ల వికీపీడియా విశేష-అతిముఖ్యమైన వ్యాసాలు

[మార్చు]

ఆంగ్ల వికీపీడియా విశేష వ్యాసాల సమీక్షా విధానం చాలా ఆసక్తికరంగా, చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఈ పద్ధతి జర్నళ్ళలోని సమవుజ్జీ సమీక్షా విధానానికి చాలా దగ్గరిగా ఉంటుంది. తద్వారా విశేష వ్యాసాల నాణ్యత చాలా ఉన్నత స్థాయిలోనూ, సమాచార లభ్యత దాదాపు సంపూర్తిగానూ ఉంటుంది. అలానే వ్యాసం ఒకసారి ఆ హోదా సాధించాకా శాశ్వత ప్రాతిపదికన అదే హోదాలో ఉండిపోదు, ఏదైనా నాణ్యాతపరమైన, సమాచార విస్తరణపరమైన లోపాలు కనిపిస్తే దాని హోదా పోతుంది కూడాను. 55 లక్షలకు పైగా ఉన్న ఆంగ్ల వికీపీడియాలో 0.094%గా 5,247 వ్యాసాలు మాత్రమే ఈ హోదా పొందాయంటే వీటి స్థాయి, ఈ స్థాయికి విజ్ఞాన సర్వస్వ వ్యాసాన్ని విస్తరించడానికి అయ్యే కృషి అర్థంచేసుకోవచ్చు.
ఇక అతిముఖ్యమైన (Importance-Top) గురించి చెప్పుకోవాలంటే, వికీప్రాజెక్టు నిర్వాహకులు ఆయా ప్రాజెక్టులకు అత్యంత ముఖ్యమైన వ్యాసాల నుంచి అంతగా ప్రాధాన్యత కాని వ్యాసాల వరకూ గుర్తిస్తూంటారు. ఉదాహరణకు వికీప్రాజెక్టు ఆసియాకు ఇండియా వ్యాసం అతిముఖ్యమైనది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంగ్ల వికీలో ఖండాల ప్రాజెక్టులకు, భారతదేశం ప్రాజెక్టుకు, ఇతర దక్షిణాసియా దేశాల ప్రాజెక్టులకు, సైన్సు ప్రాజెక్టుకు, ఇతర సంబంధిత ప్రధానమైన వికీప్రాజెక్టులకు - అత్యంత ముఖ్యమైన విశేష వ్యాసాలు అవి నాణ్యతలోనూ, ప్రాధాన్యతలోనూ అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఇప్పటివరకూ తెలుగు వికీపీడియాలో లేని అటువంటి వ్యాసాలను అనువదించడం ద్వారా అటు తెలుగు వికీపీడియాలో లేని అవసరమైన వ్యాసాలు కానీ, ఇటు ఆంగ్ల వికీపీడియాలోని అత్యున్నత నాణ్యమైన సమాచారం కానీ మనకు లభ్యమవుతుంది. వ్యక్తిగతంగా నేను ఇటువంటి వ్యాసాలు లేకపోతే తెలుగులోకి అనువదించడం (ఉదా: భారతదేశ వాతావరణం అన్నది వికీప్రాజెక్టు ఇండియా (ఆమాటకొస్తే తెలుగు వికీపీడియాకు) అత్యంత ముఖ్యమైన వ్యాసం-ఆంగ్లంలో అత్యున్నత నాణ్యత (విశేష వ్యాసం) కలిగినదీను. కాకుంటే తెలుగులో మనకి ఇప్పటిదాకా వ్యాసం లేదు. మనం సృష్టించవచ్చు), ఇప్పటికే ఏ గూగుల్-అనువాద వ్యాసాల ప్రాజెక్టో అస్తవ్యస్తంగా అనువదించివుంటే తిరగరాయడం (ఉదా: ప్రాచీన ఈజిప్టు నాగరికత ఆంగ్లంలో అత్యున్నత నాణ్యత కలిగినదీ, వికీప్రాజెక్టు ఆఫ్రికాకు అతిముఖ్యమైనది - కానీ మనకు మాత్రం గూగుల్ అనువాద వ్యాసం) వంటివి చేద్దామని ఆశిస్తున్నాను. ఇతర వికీపీడియన్లు కూడా నా ఈ స్వచ్ఛంద కృషి విషయంలో సాయం పడితే నాణ్యమైన సమాచారం లభ్యమవుతుందని ఆశ. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 06:04, 6 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కాకినాడ పుస్తక సంబరాలు - తెవికీ స్టాల్‌కు అవకాశం

[మార్చు]

అందరికీ నమస్కారం,
కాకినాడ పుస్తక సంబరాలు ఫిబ్రవరి 10 నుంచి 18 వరకూ జరుగనున్నాయి. ఈ పుస్తకాల పండుగలో తెలుగు వికీపీడియా కోసం ప్రత్యేకించి స్టాల్ ఇవ్వనున్నట్టు ఎన్టీఆర్ ట్రస్టు వారు తెలిపారు. ఇందుకు మనకు సౌజన్యం అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టు వారి కృషికి ధన్యవాదాలు. గతంలో పలుమార్లు వికీపీడియా స్టాల్స్ నిర్వహణలో పాలుపంచుకున్న ప్రణయ్ రాజ్ ఈ స్టాల్ నిర్వహణ పూర్తిగా తానే చూసుకోవడం సాధ్యపడకున్నా ఆసక్తి గల సభ్యులు ముందుకు వస్తే తాను సహకరిస్తానని తెలిపారు. నిర్వహణలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఇతర వికీపీడియన్లు తమ అందుబాటు వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:38, 8 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

2018 ఫిబ్రవరి నెలలో చేపడుతున్న కార్యకలాపాల జాబితా

[మార్చు]

అందరికీ నమస్కారం,
ఫిబ్రవరి నెలలో సీఐఎస్-ఎ2కె కార్యప్రణాళిక అమలు విషయమై చేపడుతున్న కార్యకలాపాల జాబితా సముదాయ సభ్యులు ఇక్కడ చూడవచ్చు. అలాగే జనవరి నెలలో ముందుగా ప్రస్తావించిన కార్యప్రణాళిక జాబితాలో పనుల ప్రగతి ఇక్కడ చూడవచ్చు. దయచేసి వికీపీడియన్లు పరిశీలించాల్సిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:53, 8 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఉన్న గ్రామవ్యాసాలను తిరిగి సృష్టి

[మార్చు]

గ్రామ వ్యాసాలను కొత్తగా సృష్టించేటప్పుడు అది యిదివరకు ఉన్నదా? లేదా? ఒకసారి పరిశీలించగలరు. అనుభవం లేని వాడుకరులైతే నిర్వాహకులు సరిదిద్దుతారు. కొన్నిలక్షల దిద్దుబాట్లు చేసే అనుభవమున్న వాడుకరులు దయచేసి వ్యాసాలను పరిశీలించి కొత్త వ్యాసాలు సృష్టించగలరు.--కె.వెంకటరమణచర్చ 14:25, 14 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మహిళావరణం - తెవికీలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కార్యశాలలు

[మార్చు]

ప్రాజెక్టు పేజీ: తెవికీ మహిళావరణం
అందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియాలోనూ, ఆమాట కొస్తే ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాల్లోనూ, మహిళా వాడుకరుల సంఖ్య (అలాగే మహిళల గురించిన సమాచారం) తక్కువగా ఉంది. ఆ సంఖ్య ఇతోధికంగా పెంచాలన్న ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ప్రతీ మార్చి నెలను ప్రపంచవ్యాప్తంగా వికీపీడియన్లతో పాటుగా తెలుగు వికీపీడియన్లు మహిళా చరిత్ర మాసంగా జరుపుకుంటున్నారు. గతంలో తెలుగు వికీపీడియాలో కూడా మహిళల గురించి సమాచారం పెంపొందించేందుకు ప్రయత్నాలు 2014, 2015, 2016, 2017ల్లో చేశాం. ఈ ప్రయత్నాల ద్వారా మనం మహిళల గురించి సమాచార లేమిని శక్తిమేరకు తగ్గిస్తూ వచ్చాం, ఇది సముదాయంగా తెవికీ విజయం. ఐతే మహిళా వికీపీడియన్ల సంఖ్య విషయంలోని లోటు లోటుగానే ఉంది, కాబట్టి ఈ ఏడాది మహిళా చరిత్ర మాసంలో దాని మీద దృష్టి సారించి, ప్రయత్నం చేద్దామని భావిస్తున్నాం.
తెలుగు వికీపీడియాలో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కార్యశాలలు నిర్వహించడానికి హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్టణం (సభ్యుల ఆసక్తిని, స్థానిక తోడ్పాటునీ అనుసరించి చెన్నై లేక తిరుపతి, ఖమ్మం లేక వరంగల్) వంటి నగరాల్లో కార్యశాలలు నిర్వహించాలని ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాము. ఇందుకు నాందిగా హైదరాబాదులో ఫిబ్రవరి 24, 25 (శని, ఆదివారాల్లో) తేదీల్లో రెండు రోజుల కార్యశాలను నిర్వహించనున్నాం. తెలుగు వికీపీడియాలో కృషిచేస్తున్న మహిళా వికీపీడియన్లు వాడుకరి:T.sujatha, వాడుకరి:Meena gayathri.sల సహాకారాన్ని ఈ కార్యక్రమాల నిర్వహణకు, కొనసాగింపు కార్యక్రమాల రూపకల్పనకు తీసుకుంటున్నాం. అలానే ఇతర మహిళా వికీపీడియన్లను, గతంలో మహిళల గురించిన సమాచారంపై ఆసక్తిగా పనిచేసిన వికీపీడియన్లను కూడా సంప్రదించనున్నాం. నిర్వహణలో కానీ, ఇతర కార్యకలాపాల్లో కానీ ఆసక్తి ఉన్న వికీపీడియన్లకు ఇదే ఆహ్వానం.
ఈ తెవికీ మహిళావరణం కార్యక్రమాలకు, గతానుభవాలు, ఫలితాలను కార్యక్రమాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటున్నాం.

  1. అభిరుచి కలిగిన సభ్యుల ఎంపిక - శిక్షణ అన్న పద్ధతినే వాడాలని ఆలోచన. అందుకు పాల్గొనే సభ్యులను రెండు ప్రమాణాల ఆధారంగా ఎంచుకోవాలి 1. ఇప్పటికే తెలుగు టైపింగ్ అలవాటు ఉండి, డిజిటల్ స్పేస్ లో తెలుగులో ఏవోకటి రాస్తున్నవారు 2. డిజిటల్ స్పేస్ లో నిర్మాణాత్మక ప్రయత్నాలు, కార్యకలాపాలు, వాటి ఫలితాల గురించి అవగాహన ఉండి కూడా, అటువంటి ప్రయత్నాల్లో పూర్తిగా మునిగిపోయినవారు కాకపోవడం. ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గోవడం కానీ, సహాయం చేయడం కానీ ఆసక్తి ఉన్న వికీపీడియన్లు, తమకు తెలుగు వికీపీడియాలో కృషిచేసే ఉత్సాహం ఉన్నదన్న అభిప్రాయం ఎవరిమీదన్నా కలిగితే ఈ ప్రమాణాల్లో ఏదీ లేకపోయినా తీసుకురావచ్చు. కానీ ఈ ప్రమాణాలున్న మహిళా అభ్యర్థులు మీ దృష్టిలో ఉంటే మాత్రం తప్పక ఈ కార్యక్రమం గురించి తెలియజేయగలరు.
  2. ఈ అభిరుచి, ఆసక్తి ఉండి వికీపీడియన్లు కాగలిగే సంభావ్యత ఉన్న మహిళలను హైదరాబాద్, విజయవాడ వంటి ఏదోక నగరానికి అన్ని ప్రాంతాల నుంచి తీసుకువచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం కన్నా వారున్న ప్రాంతాలకు దగ్గరలోనే నిర్వహిస్తే ఎక్కువమందికి పాల్గొనే వీలు ఉంటుందన్న ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

అలానే ఈ కార్యక్రమాల నిర్వహణలోనూ, ఈ అంశంపై కార్యక్రమాల ఏర్పాటు విషయంలోనూ మీమీ సూచనలు తెలియజేయగలరు. ప్రణాళికలో కానీ, నిర్వహణలో కానీ, తదుపరి కార్యక్రమాల రూపకల్పనలో కానీ మీరు పాల్గొనగలిగితే తప్పక ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేయండి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 04:29, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

  1. ఈ ప్రతిపాదన చాలా ప్రయోజనకరమైనది మరియు సమర్ధవంతమైనది అని భావిస్తున్నాను.దీనికి అవసరమైన సంపూర్ణసహకారం అందించడానికి నా వైపు నుండి సంసిద్ధత తెలియజేస్తున్నాను.T.sujatha (చర్చ) 05:34, 15 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  2. చాలా మంచి కార్యక్రమం. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లండి. నేను భౌతికంగా పాల్గొనలేను. తెవికీలో నమోదు చేసుకొన్న మహిళా సభ్యులకు వ్యక్తిగత ఆహ్వానం (వాడుకరికి ఈ-మైలు) పంపిస్తే బాగుంటుందేమో. నేనేమైనా చేయగలిగితే చెప్పండి. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 10:46, 23 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ కార్యక్రమం

[మార్చు]

హైదరాబాదులో 24, 25 తేదీల్లో నిర్వహించనున్న తెలుగు వికీపీడియా మహిళావరణం కార్యశాల వివరాలు ఇక్కడ చూడగలరు. సభ్యులు సూచనలు, సహకారం తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 07:54, 20 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

విశాఖపట్టణం కార్యక్రమం

[మార్చు]

విశాఖపట్టణంలో మార్చి 10, శనివారం నిర్వహించనున్న తెలుగు వికీపీడియా మహిళావరణం చిరు కార్యశాల వివరాలు ఇక్కడ చూడగలరు. పాల్గొనే సభ్యుల్లో ఒకరైన లలిత పండ్రంకి గారు, కార్యశాల నిర్వహించుకునేందుకు తమ ఇంటిని వేదికగానూ, ఆసక్తి కలిగిన, ఇప్పటికే తెలుగులో రాయడం అలవాటున్న కొందరు మహిళలను ఆహ్వానిస్తూ నిర్వహణలోనూ భాగం పంచుకుంటున్నారు. ఆవిడ సహకారంతో ముందస్తుగానే సామాజిక మాధ్యమంలో చాట్ గ్రూప్ ఏర్పరిచి, పాల్గొనేవారికి ఖాతా సృష్టించుకొమ్మని, చిన్న చిన్న మార్పులు చేయమని సూచిస్తూండడం, పాల్గొనేవారు ఉత్సాహభరితంగా అనుసరించడం జరుగుతోంది. అందుకు ఆవిడకు ముందస్తుగా ధన్యవాదాలు. కార్యక్రమం గురించి సభ్యులు సూచనలు, సహకారం తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 10:33, 7 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను వ్రాస్తున్న వ్యాసానికి కామన్స్ లో బొమ్మలు లేనిచో fair use కింద ఒకటి కన్న ఎక్కువ బొమ్మలు ఇతర వెబ్‌సైటుల నుండి ఒకే వ్యాసంలొ ఉపయోగించ వచ్చునా?అనుభవమున్న సభ్యులు సలహానివ్వగలరు.Palagiri (చర్చ) 10:44, 18 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీహక్కులు కలిగిన బొమ్మలు తక్కువ స్థాయిలో ఉపయోగించాలని నియమం ఉంది, అంటే వ్యాసంలో ఒక విషయాన్ని వ్యక్తీకరించేందుకు బొమ్మ లేకుంటే కుదరదు అన్న సందర్భంలోనే తక్కువ రిజల్యూషన్లో వాడాలి. ఒకవేళ కాపీహక్కులు ఉన్న పలు బొమ్మలు వ్యక్తీకరించే అంశాన్ని ఒకే బొమ్మ వ్యక్తీకరించగలిగిన పక్షంలో ఒకటే వాడాలి. (లేని యెడల ఒకటికి మించిన బొమ్మలు వాడవచ్చనే అర్థం వస్తోంది) ఐతే మొత్తంలో కీలకంగా గుర్తించాల్సింది మినిమల్ యూసేజ్ అన్నదాన్ని. ఇతర వివరాలకు ఇక్కడ చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 19:18, 18 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు.నేను వ్రాస్తున్న ఎఫ్.బి.సి బాయిలరు వ్యాసానికి సంబంధించి కామన్సులో బొమ్మలు లేవు. విషయ ప్రాధాన్యత దృష్ట్యా ఒకటి మించి బొమ్మలు వాడాల్సి వస్తుంది ప్రస్తుతం.ఆ తరువాత వీలుచూసుకుని autocad ద్వారా బొమ్మలు గీసి ఎక్కిస్తాను.Palagiri (చర్చ) 09:05, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పాలగిరి గారూ మీ వ్యాసాల కోసమే ఆటో క్యాడ్ ద్వారా బొమ్మలు గీస్తున్నారా? మీరు అభినందనీయులు. ఇవి మాత్రం కామన్స్ లో ఎక్కించండి. వేరే భాషల వాళ్ళు కూడా వాడుకుంటారు. --రవిచంద్ర (చర్చ) 11:48, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Palagiri గారు నేనేమైనా సహాయం చేయగలనా.. మీరు గూగుల్లో వెతికి బొమ్మ ఇస్తే నేను మళ్ళీ గీసి పంపుతాను.....--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 15:00, 19 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పాలగిరి గారూ, తెవికీ కోసం ఆటోకాడ్ వంటి ఉపకరణాలతో ఇంత కృషిచేయడం చాలా చాలా అభినందనీయం. వాడుకరి:Krishna Chaitanya Velaga దయచేసి ఈ కృషిని గమనించి, మీరు ప్రయత్నిస్తున్న Wikigraphists Bootcamp వంటివాటి రూపకల్పనలో పాలగిరి గారి భాగస్వామ్యాన్ని పరిగణించమని సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 06:46, 20 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందించి సలహాలిచ్చిన రవిచంద్ర ,పవన్ సంతోష్ గార్కి.ధన్యవాదాలు.నేనుautocard ఎక్సుపర్ట్ కాదు.నాకు 2D డ్రాయింగు మాత్రమే వచ్చు. వృత్తిరీత్యా మాకు ప్లాను,ఎలివెసన్,క్రాస్ సెక్షను వస్తే చాలు.అంతే తెలుసు.ఎఫ్.బి.సి బాయిలరు వ్యాసానికి కామన్సులోను నెట్ లోను నాకు కావాల్సిన బొమ్మలు దొరకనందున, నేనుగీసిన మూడూ బొమ్మలు ఎక్కించాను.అటోకాడ్ లో గీసి,స్క్రీన్ షాట్ తీసి ఎక్కించాను.కాని బొమ్మలు క్లారిటీగా రాలేదు.మరో పద్ధతిలో ఎక్కించ వచ్చా? తెలుపగలరు.

విశ్వనాధ్ (Viswanadh) గారికి సహాయం చెయటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. నెట్‌^లో బొమ్మలకై చూస్తున్నాను.దొరికిన తరువాత మీ సహయం తీసుకుంటాను.Palagiri (చర్చ) 12:34, 20 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

@Palagiri and Pavan santhosh.s: ఇది చాల అద్భుతమైన కృషి. Wikigraphists Bootcamp కి Palagiri లాంటి వాళ్లకు ఎంతో ఉపయోగం. గౌరవంతో, Krishna Chaitanya Velaga (talkmail) 00:37, 23 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మరియు ఓపెన్ డేటా దినోత్సవ వికీడేటా ఎడిటథాన్

[మార్చు]
Please translate the message to your language, if applicable

హలో,
2018 ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు భారతదేశానికి సంబంధించిన అంశాలపై జాతీయ స్థాయి వికీడేటా ఎడిటింగ్ కార్యక్రమమైన "ఐఎంఎల్‌డి-ఓడీడీ 2018 వికీడేటా ఇండియా ఎడిటథాన్" జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఈ ఎడిటథాన్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఓపెన్ డేటా దినోత్సవాలను పురస్కరించుకుని జరుగుతోంది.

దయచేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ తెలుసుకోండి.
ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి ఇక్కడ చూడండి.
మీరు ఈ కార్యక్రమంలో భాగంగా దిద్దుబాట్లు చేసేందుకు అంశాల జాబితా కోసం ఈ లింకు పరిశీలించండి.

మీకేదైనా సందేహాలుంటే తప్పక అడగండి. -- Titodutta using MediaWiki message delivery (చర్చ) 07:12, 21 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
(ఇది అనువదింపబడిన ప్రకటన --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:53, 23 ఫిబ్రవరి 2018 (UTC))[ప్రత్యుత్తరం]

2018 ఫిబ్రవరి 21 నుంచి మొదలు అయితే, మన తెలుగు నందు మీరయినా 23న పోస్టు చేసి తెలియజేసారు, సంతోషం. నేను వేరే చోట మీరు సూచించిన లింకులు చూసాను, కానీ చేయవలసిన పని ఏమిటో అర్థం కాలేదు. దయచేసి ఒక తెలుగు వాడుకరి ఇందుకోసం తను చేయవలసిన పని వివరములు వెంటనే తెలియజేయండి. JVRKPRASAD (చర్చ) 00:29, 24 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, ఇది జాతీయ స్థాయిలో మాతృభాషా దినోత్సవం నుంచి ఓపెన్ డేటా దినోత్సవం వరకూ జరుగుతున్న వికీడేటా ఎడిటథాన్. దీనిలో భాగంగా వికీడేటా ప్రాజెక్టులో భారతదేశానికి సంబంధించిన ఐటంలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన కాంపైన్. ఇక్కడ పేరును నమోదు చేసుకొని, భారతదేశానికి సంబంధించిన వికీడేటా ఐటంలు ఏవైనా (కొన్నిటిని మాత్రం ఇక్కడ సూచనల కోసం జాబితా వేశారు) అభివృద్ధి చేయవచ్చు. నమోదుచేసుకున్న వాడుకరుల కృషిని మదింపు వేసి, అత్యుత్తమ కృషి చేసిన వాడుకరిని ఎంపికచేస్తారు. పైన నేను అనువదించిన సందేశం లంకెలలోనూ, ఇక్కడ నేను అందించిన లంకెలలోనూ సంబంధిత లంకెలు ఉన్నాయి. దీనిపైన మరే ఇతర సమాచారం కావాలన్నా నా చర్చ పేజీలో సైతం రాయవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 18:45, 27 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక వాడుకరి చేయవలసిన పని ఏమిటో అర్థం కావడం లేదు నాకు. కనీసం ఈ పనిని చేస్తున్నవారు ఎవరైనా ఉంటే వారి కృషి ఎలా చూడాలి ? ఎవరైనా చేయవలసిన పని జాబితా ఇస్తే బావుంటుంది. అలాగే ఉదాహరణ చూపితే అర్థం అవుతుంది. మన తెలుగులో చేయవలసిన ఏమిటో ఒక జాబితా ఇస్తే వాడుకరులకు తేలికగా ఉంటుంది అని నా అభిప్రాయం. JVRKPRASAD (చర్చ) 03:22, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పోటీలో భాగంగా అక్కడ ఏయే పనులు చెయ్యాలో వివరంగా తెలీని వారి కోసం ఇది:
ఈ జాబితాలో భారతదేశానికి సంబంధించిన కొన్ని "అంశాల" నిచ్చారు. వికీపీడియాలో వ్యాసం ఎలాగో వికీడేటాలో అంశం అలాంటిది. ప్రతి అంశమూ "Q" అక్షరంతో మొదలై ఆ తరువాత కొన్ని అంకెలు కలిగి ఉంటుంది. Q1234, Q123456789 - ఇలాగ. ప్రతీ అంశానికీ ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీలో పైన ఆ అంశాన్ని వివరించే లేబులు, వివరణ, ఇతర లేబుళ్ళు అనే విశేషాలతో ఒక పట్టిక ఉంటుంది. ఆ తరువాత ఆ అంశానికి సంబంధించి వివిధ మీడియావికీ ప్రాజెక్టు పేజీల లింకులు, స్టేట్‌మెంట్లు ఉంటాయి. ఒక్కో స్టేట్‌మెంట్లో లక్షణం, దాని విలువ, దానికి సంబంధించిన మరిన్ని విశేషాలూ (మూలాలు, కొలమానాలు.. వంటివి) ఉంటాయి.
ఈ ఎడిటథాన్‌లో భాగంగా మనమేం చెయ్యాలంటే.. పై జాబితాలోని అంశాల పేజీల్లో తెలుగులో లేబులు, వివరణ, ఇతర లేబుళ్ళు లేకపోతే వాటిని చేర్చాలి. ఈ సరికే ఉన్న ఇంగ్లీషు లేబుళ్ళను మార్చకూడదు.. తెలుగు లేబుళ్ళను, వివరణలను చేర్చాలి. ఇక స్టేట్‌మెంట్ల విషయానికి వస్తే.. (ఏ భాషకైనా స్టేట్‌మెంటు ఒకటే - ఏ భాష వాళ్ళకు ఆ భాషలో కనబడుతుంది) ఉండాల్సిన స్టేట్‌మెంటు ఒకటి అక్కడ లేదని మీరు భావిస్తే దాన్ని చేర్చండి. __చదువరి (చర్చరచనలు) 08:53, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సవరణ సహయం

[మార్చు]

నేను ఇటీవల మార్పులు చూస్తున్నప్పుడు ఈ మార్పు కనిపించింది.
(తేడాలు | చరితం)..చి దైవమిచ్చిన భార్య‎; 14:58:49..(+46)..‎రవిచంద్ర (చర్చ | రచనలు)‎ (వర్గం:చలం రచనలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
ఈ హాట్ కేక్ అంటే ఏమిటో తెలియజేస్తారా? 10:26, 21 ఫిబ్రవరి 2018‎ ChillarAnand (చర్చ | రచనలు | నిరోధించు)

మీ చర్చ పేజీలో రాశాను చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:23, 23 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అభ్యర్ధన

[మార్చు]

మిత్రులందరికీ వందనం, వికీమీడియా ఫౌండేషన్ అందించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టుకోసం నేనూ అభ్యర్ధిస్తున్నాను. ఈ లింకులో మీ మద్దతు తెలియచేయగలరు. మిత్రుడు..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 06:26, 24 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

క్రీస్తు శకం సామాన్య కాలం

[మార్చు]

మన వ్యాసాల్లో ఇప్పటి వరకూ క్రీస్తు శకం, క్రీస్తుపూర్వం అనే వాడుక ఉంది. అయితే వాటి బదులుగా సామాన్య కాలం (Common Era or Current Era) సామాన్య కాలానికి ముందు (Before Common Era) గా వాడుతున్నారుగా.. వీటిపై మనం ఏం చేయాలి?.. అవే కొనసాగించాలా లేక మార్చాలా? వీటిపై మిగతా వికీ భాషల్లో ఎలా వాడుతున్నారో (ముఖ్యంగా ఆంగ్లంలో), మనం వాటినే అనుసరించాలా లేక మనకు సొంతగా మార్పు చేసుకోవచ్చా....--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 06:11, 25 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ఇదివరకే చదువరి గారు సా.శ అని వాడగా చూశాను. నేను కూడా అదే అనుసరిస్తున్నాను.--రవిచంద్ర (చర్చ) 19:02, 27 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రయోగంలో ఇప్పటికీ క్రీ.శ. ఉన్నంత అమలులో సా.శ. లేదు. జన ప్రయోగంలో ఉన్నది వ్యవహారికమని భాషాపరమైన సందేహాలులో అనుసరిస్తున్నాం, కానీ ఇది శాస్త్రపరమైన విషయం. దీనికి ప్రామాణికత ప్రధానం తప్ప వ్యవహారం కాదని నా అనుకోలు. ఐతే ప్రామాణికత అన్నది నిర్ధారణ అయిందా అన్నది ప్రశ్న. ఈ విషయంలో ఇంగ్లీష్ వికీపీడియా శైలి పేజీ క్రీ.పూ., క్రీ.శ. సంప్రదాయ రచనా విధానంలో వాడుక ఉన్నదనీ, సామాన్య కాలానికి ముందు, సామాన్య శకం అన్నది కొన్ని ప్రామాణిక రచనల్లో వాడుకగా ఉందని రాశారు. కనుక ఆంగ్ల వికీపీడియా ఈ రెండు విధానాల్లో దేనిని అనుసరించినా శైలి విషయంలో దోషం కాదని నిర్ణయించుకుంది. ఐతే వ్యాసంలో మొదట ఏ పద్ధతితో ప్రారంభిస్తే దాన్నే కొనసాగించాలనీ, ప్రత్యేకించి కొన్ని అంశాల్లో తప్పనిసరి అయితే చర్చ పేజీలో చర్చ చేసి తప్ప ఇప్పటికే వ్యాసంలో ఉన్న పద్ధతిని (రెంటిలో ఏదైనా) మార్చరాదని నియమించింది. కాబట్టి వారి పద్ధతి అనుసరించినా అనుసరించవచ్చు, లేదా సా.శ. పద్ధతికి పూర్తిగా మారిపోయినా ఫర్వాలేదు అని నా అభిప్రాయం. --పవన్ సంతోష్ (చర్చ) 19:24, 27 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరో ఒకరు అలా రాయడం మొదలెట్టారు కనుక దానిని అనుసరించడం ద్వారా అలవాటు చేయడం చేయవచ్చు. కనుక ఇప్పటి నుండి సా.శ వాడకం చేయడం అవసరం. కాకున్నా ఎప్పుదో ఒకప్పుడు అన్నిటినీ మార్చవలసి రావచ్చు..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 16:43, 28 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సామాన్య శకం (సా.శ), సామాన్య శక పూర్వం (సా.శ.పూ) వాడడం అలావాటు చేసుకుందాం. __08:00, 1 మార్చి 2018 (UTC) __చదువరి (చర్చరచనలు)
తెవికీ విజ్ఞాన సర్వస్వం అనేది సామాన్య పాఠకలోకానికి సులభ"శైలి"లో అందుబాటులో ఉండాలి కదా! పైగా తెవికీలో వాడే పదాలు (సంక్షిప్తాక్షరాలైననూ) అందరికీ అర్థమయ్యేటట్లుగా ముఖ్యంగా జనబాహుళ్యంలో వాడుకలో ఉన్నవాటినే వాడాలి కాని ఇక్కడ మనం ప్రయోగాలు చేసే అవసరం రాకూడదనుకుంటాను. కాబట్టి ఇప్పడు అమలులో ఉన్న పద్దతే సరైనది (క్రీ.శ./క్రీ.పూ). ఇది కాదు కొత్త శైలే జనబాహుళ్యంలో, పుస్తకాలలో, ప్రసార మాధ్యమాలలో (తెలుగుకు సంబంధించి మాత్రమే) అధికంగా వాడుకలో ఉన్నదని ఎవరైనా నిరూపిస్తే తప్పకుండా వాటినే వాడవచ్చు. లేదా అంతవరకు (తెలుగు ప్రసార మాధ్యమాలు, తెలుగు పుస్తకాలలో ఇలాంటి పద్దతి వచ్చేవరకు) మనం వేచిచూడాల్సిందే అంతేకాని ఇలాంటి వాటికి చర్చల ద్వారా, అభిప్రాయాల ద్వారా, ఓటింగులద్వారా లేదా ఆంగ్లవికీలో ఉన్నదీ అనీ తెవికీ పద్దతిని మార్చడం మాత్రం కారాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:18, 2 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

శైలి విషయంలో విధాన, మార్గదర్శక నిర్ణయాల చర్చలకు ఓ పేజీ

[మార్చు]

వికీపీడియా శైలి విషయంలో మనకు మార్గదర్శక పేజీ ఉంది. ఈ చర్చలు, నిర్ణయాలు దానికి సంబంధించినవి. ఐతే ఇక్కడ చర్చ, నిర్ణయాలు జరగడం, అక్కడ ప్రతిఫలించకపోవడం వల్ల నిర్వహణ వ్యవహారాలు చూసేవారికి చాలా సమస్య అవుతోంది. కాబట్టి సంబంధిత చర్చలను ముందు ఉపపేజీలోనూ ప్రచురిస్తే తద్వారా శైలి మార్గదర్శకాల్లో చేర్చుకోవచ్చన్న ఉద్దేశంతో వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు పేజీ రూపొందించాను పరిశీలించండి. ఇదివరకు శైలికి సంబంధించిన ఇతర అంశాలు (ఏకవచనం, బహువచన వివాదంతో సహా) అన్నిటిపైనా జరిగిన చర్చలు ఆ పేజీలో కాపీ చేసి ప్రచురిస్తే ఉపయుక్తంగా ఉంటుందని సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 03:26, 2 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను సా. శ. అని చాల కాలం నుండి వాడుతున్నాను. అలాగే సా. శ. పూ. అని కూడా వాడడం మంచిది అని నా అభిప్రాయం. ఈ ఆచారం ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వస్తోంది. Vemurione (చర్చ) 16:15, 4 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ వ్యక్తిగత బహుమతుల మార్పు ప్రతిపాదన

[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్-గూగుల్ భాగస్వామ్యంలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు టైగర్ రెండవ దశ ఒక వ్యాసరచన పోటీ. ప్రధానంగా ఇది సముదాయాల నడుమ పోటీ. అంటే తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ వంటి భాషా సముదాయాలు తమ తమ ప్రాంతాల నుంచి అతిఎక్కువమంది వెతుకుతున్నా సదరు వికీపీడియాల్లో లేని 1500 అంశాలను ఒక్కొక్కటిగా వ్యాసాలు సృష్టించడం దీనిలో సముదాయ పోటీ, ఈ పోటీకి కూడా బహుమతిగా ఓ 3-రోజుల శిక్షణా కార్యక్రమం వస్తుంది. ఐతే వ్యక్తిగత పోటీ కూడా ఉంది, నెలనెలా సాగే ఈ వ్యక్తిగత పోటీ విషయంలో మాత్రం బహుమతులుగా తోచినవి ఇవ్వవచ్చు (నగదు కూడా). సముదాయానికి ప్రస్తుతం కొత్త సభ్యులు వస్తున్న తరుణంలో, బహుముఖాలుగా సముదాయ సభ్యులు కృషిచేసి పలువురు కొత్తవారిని తీసుకువస్తున్న సమయంలో మనం ఈ బహుమతులను కాస్త జాగ్రత్తగా ఎంపికచేసుకోవడం మేలని వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఇందుకోసం నెలనెలా తొలి, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందినవారికి బహుమతి విలువకు తగ్గట్టు కోరుకున్న సమాచారపూర్ణమైన మాస, వారపత్రికల చందా కానీ, హిమాలయ, విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, కినిగె వంటి పుస్తకాల షాపుల గిఫ్టు కూపన్లు కానీ అందిస్తామని ఉంటే బహుమతికి మరింత సార్థకత చేకూరినట్టు అవుతుందని నా ప్రతిపాదన. (గెలుపొందిన సభ్యులకు, మరీ ముఖ్యంగా కొత్తవారికి, తాము మూలాల అభివృద్ధికి, విస్తరణకు ఈ బహుమతి పుస్తకాలను వాడుకోవచ్చన్నది సూచనప్రాయంగా ఇందులో ఇమిడివుంటుంది) దీనిపై సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తే సముదాయ ఉద్దేశాలను నిర్వాహకులకు తెలియజేయవచ్చు. తెలుగు వికీపీడియా సముదాయ సభ్యుని హోదాలో ఈ చర్చను తెవికీ మెరుగుదలకు నాకు తోచిన అంశాన్ని మీముందు ఉంచుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 19:10, 27 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆలోచన బాగుంది. ఇందులో నాకు కొన్ని సందేహాలు.
  • అతిఎక్కువమంది వెతుకుతున్నా సదరు వికీపీడియాల్లో లేని 1500 అంశాలను ఎలా నిర్ణయిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు?

బహుమతులు నగదు రూపంలో కాకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా తిరిగి వికీపీడియాలో రాయడానికి పనికొచ్చే పుస్తకాల రూపంలో ఇస్తామనడం కూడా చాలా బాగుంది. --రవిచంద్ర (చర్చ) 14:18, 28 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

జరిగిన చర్చల బట్టి వారికి అమేజాన్, ప్లిప్కార్ట్ వాళ్ళ గిప్ట్ కూపన్ ఇవ్వడం వలన కావలసినవి కొనుక్కొనే అవకాశం ఉంటుంది. మనమూ అలాగే ఇస్తే బావుంటుందేమో.. అయితే మొదట ఈ పోటీ గురించి విస్తృతమైన ప్రచారం చేయవలసి ఉంది..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 16:12, 28 ఫిబ్రవరి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ! ఈ 1500-2000 అంశాలను గూగుల్ వారి వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి జాబితా ఇస్తారు. అంటే తెలుగు వారు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల నుంచి వినియోగదారులు అత్యధికులు వెతికే అంశాల నుంచి జాబితా వేసి ఇస్తారట! ఆ జాబితా ఇదిగో ఇక్కడ ప్రచురించాను. దీనిలో ఎక్కువ ఆంగ్ల చలన చిత్రాలు ఉన్నాయి, అలాక్కాదు నాకు ప్రపంచ చరిత్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వారు ఎక్కువగా వెతికే విషయాల్లో తెలుగులో లేనివి, ఉన్నా సరిగా అభివృద్ధి కానివి కావాలని అడిగారనుకుందాం. అవీ ఇస్తారట. --పవన్ సంతోష్ (చర్చ) 06:06, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ ఆ జాబితా చూశాను. మీరన్నట్లు అందులో ఎక్కువగా నేటివ్ వ్యాసాలు లేవు. ముందుగా మనం ఎక్కువమంది వాడుకరులు తెలుగులో టైపు చేసి వెతుకుతున్నవి, తెవికీలో లేనివి అయితే బాగుంటుందేమో. ఆంగ్లచిత్రాలను తెలుగులో టైపు చేసి ఎవరైనా వెతుకుతున్నారంటారా?--రవిచంద్ర (చర్చ) 06:13, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అవును రవిచంద్ర చెప్పింది నిజం. తెలుగు ప్రాంతాలకు సంబంధించిన అంశాలు ఉంటే బాగుంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:35, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కేవలం తెలుగు ప్రాంతాలకు సంబంధించినవే అని కాదు. తెలుగు వాళ్ళు దేనికోసం తెలుగులో వెతుకుతున్నారు అని తెలుసుకోవడం మాత్రమే.--రవిచంద్ర (చర్చ) 10:52, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • రవిచంద్ర గారూ, Pranayraj Vangari గారూ, ఈ వ్యాసాలను ఏయే ప్రాంతాల నుంచి వినియోగదారులు ఏయే అంశాలను (ఆంగ్లంలో అయినా సరే) ఎక్కువగా వెతుకుతున్నారన్న అంశాన్ని, ఆ వెతికినవారు (సాధారణంగా ఆంగ్ల వికీ) వికీపీడియాలోకి వెళ్ళి ఎలా చదువుతున్నారన్న అంశాన్ని పరిగణించి గూగుల్ వారు తయారుచేసిన జాబితా అని తెలిసిందండీ. స్థానిక భాషలలో వెతికడం బాగా తక్కువ కాబట్టి వారు తెలుగులో తెలుగువారు ఏ సమాచారం వెతుకున్నారన్నది ఇవ్వలేకపోతూన్నారని కార్యక్రమ నిర్వాహకుల నుంచి తెలుసుకున్నాను. ఒకవేళ ఇచ్చినా తెలుగు వికీపీడియా వైవిధ్యానికి దోహదపడకపోవచ్చు, ఎందుకంటే ఫలానా రకం సమాచారం తెలుగు అంతర్జాలంలో దొరకదని తెలిసినప్పుడు వెతకడం కూడా ఉండదు. అంతమాత్రాన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల వారు ఆంగ్లంలో ఏం వెతుకుతున్నారో చూసి అదే రాయాల్సిన అవసరమూ లేదు. నేను ప్రతిపాదించినదేమంటే - మన భారతీయ భాషలలో విస్తారమైన పాఠకులు ఉన్న పత్రికలు ఉన్నాయి కదా. 2018 రీడర్‌షిప్ సర్వే ప్రకారం భారతీయ భాషల పాఠకులు భారీ సంఖ్యలో పెరుగుతున్నారు. ఇలా పెరగడానికి వారు పాఠకులకు అవసరమైన సమాచారం, వార్తల గురించి ఎన్నో సర్వేలు చేసి తెలుసుకుంటూంటారు. ఆ ఫలితాలను మనం ఉపయోగించుకుని - తెలుగువారికి ఎలాంటి సమాచారం కావాలో తెలుసుకోవచ్చు. అంటే ఈనాడు వాళ్ళు ఇ-నాడు (టెక్నాలజీ, సాంకేతిక ఉపకరణాలు), చదువు (జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ వగైరా), సుఖీభవ (ఆరోగ్యం, వైద్యం), వసుంధర (మహిళల గురించి) వగైరా టాబ్లాయిడ్లు చాలా ప్రయోగాల ద్వారా రూపకల్పన చేశారు కదా. మనం టెక్నాలజీ, సాంకేతిక ఉపకరణాలు, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, ఆరోగ్యం, వైద్యం, మహిళలు వంటి టాపిక్స్‌లో తెలుగు ప్రాంతాల వారు ఏయే వ్యాసాలను ఎక్కువగా వెతుకుతున్నారని అడగవచ్చు. (ఉదాహరణ మాత్రమే, ఆలోచన నచ్చితే ఇతర పెద్ద పత్రికల నుంచి మనం విశ్లేషణ చేసి టాపక్స్ ఎంపిక చేయొచ్చు) తద్వారా పత్రికలు భారీ ఎత్తున చేపట్టిన సర్వేల ఫలితంగా రూపొందిన విధానాలనే ఉపయోగించుకుని ఇప్పటికే భారీ సంఖ్యలో (ప్రధాన పత్రికల రీడర్‌షిప్ కలుపుకుంటే కోట్లు దాటుతోంది) ఉన్న తెలుగు పాఠకుల సమూహానికి అవసరమైన సమాచారం రూపొందించవచ్చు. ఈ ప్రతిపాదన ఇక్కడ మెటా-వికీలో చేశాను. అక్కడ కూడా చర్చ సాగించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 10:59, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ చర్చంతా వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ పేజీలో చేస్తే బాగుంటుంది.__చదువరి (చర్చరచనలు) 12:27, 1 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం

[మార్చు]

బహుమతులు వస్తురూపేణా, అదీ ప్రధానంగా గెలుచుకున్నవారు ఎంచుకునే పుస్తకాలు, పత్రికల చందాల రూపేణా ఉండాలన్న అంశంపై ఏకాభిప్రాయం కుదిరినట్టేనా? నేనే ప్రతిపాదించిన అంశం కాబట్టి నేనే ముగిస్తే బాగోదు. దయచేసి పై చర్చను పరిశీలించి ఫలితం ప్రకటించాల్సిందిగా సహ నిర్వాహకులను కోరుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:28, 12 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]