లక్ష్మీపతి (నటుడు)
Appearance
లక్ష్మీపతి | |
---|---|
జననం | లక్ష్మీపతి |
వృత్తి | నటుడు, వ్యాఖ్యాత |
క్రియాశీల సంవత్సరాలు | 2000 - 2008 |
బంధువులు | శోభన్ (సోదరుడు) శోభన్ కుమారులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ |
లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.
నటుడిగా
[మార్చు]లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. తరువాత అల్లరి, కితకితలు లాంటి సినిమాలో హాస్య పాత్రలు పోషించాడు.
సినిమాలు
[మార్చు]- బాబీ
- అల్లరి
- మురారి
- నీ స్నేహం
- తొట్టిగ్యాంగ్
- జూనియర్స్
- అమ్మాయిలు అబ్బాయిలు
- విజయం (2003)
- విలన్ (2003)
- చార్మినార్
- కళ్యాణ రాముడు
- విలన్
- పెదబాబు
- దొంగ - దొంగది
- అదిరిందయ్యా చంద్రం (2005)
- ఆంధ్రుడు
- నువ్వంటే నాకిష్టం
- ప్రేమికులు
- రిలాక్స్
- అదిరిందయ్యా చంద్రం
- ఎవడి గోల వాడిది
- సోగ్గాడు
- నీ నవ్వే చాలు
- డేంజర్
- అందాల రాముడు
- మహారధి
- కితకితలు
- అన్నవరం
- లక్ష్మీ కళ్యాణం
- అత్తిలి సత్తిబాబు LKG
- వియ్యాలవారి కయ్యాలు
- మంగతాయారు టిఫిన్ సెంటర్
- సుందరకాండ
- అందమైన మనసులో
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
మరణం
[మార్చు]ఆయన స్నానాల గదిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కిందపడిపోయి మరణించాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతని భౌతిక కాయాన్ని గుర్తించారు. [2]
మూలాలు
[మార్చు]- ↑ "Lakshmipati Kalpana Rai are no more". indiaglitz.com. Archived from the original on 3 డిసెంబరు 2015. Retrieved 19 August 2016.
- ↑ "Veteran comedian Lakshmipati life history and film career". www.nettv4u.com. Archived from the original on 22 ఆగస్టు 2016. Retrieved 19 August 2016.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో లక్ష్మీపతి పేజీ