Jump to content

మక్తల్ శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
మక్తల్
—  శాసనసభ నియోజకవర్గం  —
మక్తల్ is located in Telangana
మక్తల్
మక్తల్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా రద్దయిన అమరచింత నియోజకవర్గం నుంచి నర్వ, ఆత్మకూరు మండలాలు ఇందులో కలిశాయి. ఇది వరకు ఈ నియోజకవర్గంలో ఉన్న నారాయణపేట మండలం, దామరగిద్ద మండలంలోని కొన్ని గ్రామాలు కొత్తగా ఏర్పాటైన నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో కలిశాయి.[1] ఈ శాసనసభ నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.[2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,54,236.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగష్టు నాటికి): 2,10,524.[3]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 15.42%, 1.75%.

నియోజకవర్గ భౌగోళిక సమాచారం

[మార్చు]

మహబూబ్‌నగర్ జిల్లాలో పశ్చిమాన త్రికోణాకారంలో ఉన్న మక్తల్ నియోజకవర్గం పశ్చిమాన కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉంది. ఉత్తరాన నారాయణపేట నియోజకవర్గం సరిహద్దుగా ఉండగా, దక్షిణాన కర్ణాటకతో పాటు గద్వాల నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. తూర్పువైపున దేవరకద్ర నియోజకవర్గం ఉంది. హైదరాబాదు - రాయచూరు ప్రధానరహదారి ఈ నియోజకవర్గంలో మక్తల్, మాగనూరు మండలాల గుండా వెళుతుంది.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]

[4]

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952[5] టి.శాంతాబాయి కాంగ్రెస్ పార్టీ వి.పి.రెడ్డి యు.ఎస్.సి.ఎఫ్
బసప్ప కాంగ్రెస్ పార్టీ లింగప్ప ఎస్.సి.ఎఫ్
1957[6][7] బన్నప్ప స్వతంత్ర అభ్యర్థి ఆర్.సి.రావు కాంగ్రెస్ పార్టీ
బసప్ప కాంగ్రెస్ పార్టీ తమ్మిన్న స్వతంత్ర అభ్యర్థి
1962 కళ్యాణ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ బి.ఏ.రావు స్వతంత్ర అభ్యర్థి
1967 కళ్యాణ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ సీతారామారావు స్వతంత్ర అభర్థి
1972 కళ్యాణ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక -
1978 నరసింహులు నాయుడు ఇందిరా కాంగ్రెస్ చిట్టెం నర్సిరెడ్డి జనతా పార్టీ
1983 నరసింహులు నాయుడు కాంగ్రెస్ పార్టీ వై.వై.రెడ్డి జనతా పాటీ
1985 చిట్టెం నర్సిరెడ్డి జనతా పార్టీ నరసింహులు నాయుడు కాంగ్రెస్ పార్టీ
1989 చిట్టెం నర్సిరెడ్డి జనతా దళ్ నరసింహులు నాయుడు కాంగ్రెస్ పార్టీ
1994 ఎల్కోటి ఎల్లారెడ్డి తె.దే.పా నాగూరావు నామాజీ భారతీయ జనతా పార్టీ
1999 ఎల్కోటి ఎల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాగూరావు నామాజీ భారతీయ జనతా పార్టీ
2005 ఉపఎన్నిక చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2009 దయాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎల్కోటి ఎల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2018 చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ జలంధర్ రెడ్డి స్వతంత్ర
2023[8] వాకిటి శ్రీహరి కాంగ్రెస్ చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్

1999 ఎన్నికలు

[మార్చు]

1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లారెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం నర్సిరెడ్డిపై 12563 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[9] ఎల్లారెడ్డి 55404 ఓట్లు సాధించగా, చిట్టెం నర్సిరెడ్డి 42841 ఓట్లు పొందినాడు.

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం నర్సిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాగూరావు నామాజిపై 2356 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందినాడు. నర్సిరెడ్డి 55375 ఓట్లు సాధించగా, నాగూరావు నామాజి 53019 ఓట్లు పొందినాడు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండటంతో ఈ స్థానంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. నలుగులు అభ్యర్థులు పోటీచేయగా ప్రధానపోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్యనే సాగింది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు కలిపి మొత్తం ఓట్లలో 95% పైగా సాధించారు. మిగిలిన రెండు అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
113966
చిట్టెం నర్సిరెడ్డి*
  
55375
నాగూరావు నామాజీ*
  
53019
ఇతరులు*
  
4.88%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
2004 ఎన్నికలలో వివిధ పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 చిట్టెం నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ 55375
2 నాగూరావు నామాజీ భారతీయ జనతా పార్టీ 53019
3 కె.భోజప్పగౌడ్ పిపిఓఐ 3432
4 జె.సూర్యనారాయణ ఇండిపెండెంట్ 2140

ఉప ఎన్నికలు

[మార్చు]

2005 ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాడు నారాయణ పేట పట్టణంలో నక్సలైట్ల దాడితో చిట్టెం నర్సిరెడ్డి మృతి చెందడంతో ఏర్పడిన ఖాళీ వల్ల 2005 డిసెంబరులో జరిగిన ఉపఎన్నికలో ఈ స్థానం నుంచి నర్సిరెడ్డి కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి 40,079 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించాడు.[10] ఈ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిలి కూడా బరిలో ఉండకపోవడం మెజారిటీ భారీగా లభించడమే కాకుండా ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ పొత్తుతో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎం.శ్రీధర్ గౌడ్ పోటీ చేశాడు. భారతీయ జనతా పార్టీ తరఫున జి.నింగిరెడ్డి, ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకున్న మనపార్టీ తరఫున శ్రీహరి లోక్‌సత్తా పార్టీ తరఫున కె.రాజమల్లేష్ పోటీలోక్ దిగారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు ఆశించి పొత్తులో భాగంగా ఈ స్థానం తెరాసకు వెళ్ళడంతో దయాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. ప్రధానపోటీ దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ రెబెల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా పోటీచేసిన దయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహనరావుపై 5701 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[11]

నియోజకవర్గపు ప్రముఖులు

[మార్చు]
ఎల్కోటి ఎల్లారెడ్డి
మక్తల్ శాసనసభ్యుడిగా రెండు సార్లు విజయం సాధించిన ఎల్కోటి ఎల్లారెడ్డి ఈ ప్రాంతపు తెలుగుదేశం పార్టీ నాయకుడు. 1997-99 కాలంలో చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో మంత్రిపదవిని కూడా నిర్వహించాడు. 2004లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.విఠల్ రావు చేతిలో ఓడిపోయాడు. నియోజకవర్గాల పునర్విభజనలో నారాయణపేట నియోజకవర్గం కొత్తగా ఏర్పడటంతో ఇదివరకు మక్తల్ సెగ్మెంటులోని మండలాలు నారాయణపేట శాసనసభ స్థానంలో కలియడంతో 2009 శాసనసభ ఎన్నికలలో ఎల్లారెడ్డి నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందినాడు.
చిట్టెం నర్సిరెడ్డి
స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు అయిన చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎన్నికైనాడు. తొలిసారిగా 1985లో జనతా పార్టీ తరఫున, 1989లో జనతాదళ్ తరఫున ఎన్నికవగా, 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించాడు. 2005 ఆగష్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం నాడు నారాయణపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే సమయంలో నక్సలైట్లు దాడి చేయడంతో ఆయనతో పాటు మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.[12] ఆ తరువాత జరిగిన ఉపఎన్నికలలో అతని కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలుపొందినాడు. ప్రస్తుతం గద్వాల శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా ఉన్న డి.కె.అరుణ నర్సిరెడ్డి కూతురు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సాక్షి దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 12, తేది 11-09-2008.
  2. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  4. Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. మక్తల్ , ఆత్మకూరు నియోజకవర్గాలకు కలిపి ద్విసభ్య నియోజకవర్గము
  6. ద్విసభ్య నియోజకవర్గము
  7. Eenadu (17 November 2023). "స్వతంత్రులుగా సత్తా చాటారు". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  8. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  9. Eenadu (11 November 2023). "విలక్షణ తీర్పుల వేదిక మక్తల్‌". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
  10. "హిందూ పత్రిక తేది 14-12-2005". Archived from the original on 2009-06-18. Retrieved 2008-10-03.
  11. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  12. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 10, తేది 15-08-2008

వెలుపలి లంకెలు

[మార్చు]