పెద్దాడ కామేశ్వరమ్మ
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పెద్దాడ కామేశ్వరమ్మ భారత స్వాతంత్ర్య సమరయోధురాలు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె రాజమహేంద్రవరంలో 1907 మే 15న పెద్దాడ వెంకట సుబ్బమ్మ, సుందరశివరావు దంపతులకు జన్మించింది. ఆమె భర్త ప్రొఫెసర్ బి.కుప్పుస్వామి. ఆమె ఉపాధ్యాయినిగా తన ఉద్యోగాన్ని వదలి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1931 మార్చి 31 నుండి ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించింది.[2] పెద్దాపురం తోటలో నాయకుల సమావేశాన్ని రహస్యంగా నిర్వహించింది. పోలీసులు విపరీతంగా లాఠీలతో కొట్టారు. మైసూరు మ్యునిసిపల్ కౌన్సిల్ లో తొలి మహిళా కార్పొరేటరుగా పనిచేస్తూ పాకీ పనివారికి సంఘాన్ని పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి కాంగ్రెస్ అధ్యక్షులు, తొలి ఎ.ఐ.సి.సి సభ్యురాలు.[3]
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తెలుగు వారి సాహసము, త్యాగము, ఆత్మార్పణం ఎంతో పేరు పొందాయి. గాంధీ మహాత్ముడు కూడా తెలుగు వారిని ఈ విషయంలో ఎంతో మెచ్చుకున్నారు. తెలుగు మహిళలు కూడా ఆయన పిలుపును అందుకుని ఎంతో కృషిచేశారు. అటువంటి ధన్యులలో ఒకరు పెద్దాడ కామేశ్వరమ్మ గారు. ఇంగ్లీషు కోర్టులు, విద్యాలయాలు, ఉద్యోగాలు వదిలి స్వతంత్ర పోరాటంలో పాల్గొనండి - అని గాంధీ గారు పిలవగానే ఎంతో మంది రంగములోకి దిగారు. అటువంటి వారిలో కామేశ్వరమ్మ ఒకరు. ఆమె సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకుంది. డిగ్రీ చదివింది. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనింది. జైలు శిక్షను అనుభవించింది. నాయకులంతా జైళ్ళలో ఉన్నప్పుడు పెద్దాపురంలో వన సంతర్పణం చేసి అక్క డ సత్యాగ్రహ ప్రచారము చేసింది. పోలీసులచేత లాఠీ దెబ్బలు తింది. తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కార్యనిర్వాహక సంఘములో చాలా కాలం సభ్యురాలుగా ఉంది. స్వతంత్రము కోసం పోరాడిన మహిళలలో మచ్చు తునకగా చెప్పుకోదగ్గ వ్యక్తి కామేశ్వరమ్మ గారు. ఆమె 1979 జూలై 29న మరణించింది.