పరమబ్రాత ఛటర్జీ
పరమబ్రాత ఛటర్జీ | |
---|---|
జననం | పరమబ్రాత ఛటర్జీ 1980 జూన్ 27 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
బంధువులు | రుత్విక్ ఘటక్ (తాత) |
పరమబ్రాత ఛటోపాధ్యాయ (జననం: 27 జూన్, 1980) భారతీయ సినిమా, టెలివిజన్ నటుడు, దర్శకుడు.[1] చటర్జీ బెంగాలీ టెలివిజన్, చిత్రాలలో తన వృత్తిని ప్రారంభించాడు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో ఆయనకు గణనీయమైన గుర్తింపు ఉంది. విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీలతో కలిసి నటించిన కహానీ (2012) లో హిందీ రంగ ప్రవేశం చేశాడు. విద్యా బాలన్ తొలి చిత్రం భలో థెకో (2003) లో కూడా నటించాడు. ప్రపంచ సంగీతంపై ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది. చాయా మనుష్, సమంతరాల్ వంటి కొన్ని బెంగాలీ చిత్రాలకు పాడారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]మరంబ్రాత పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో 1880 జూన్ 27న సినీ విమర్శకులైన సతీనాథ్ ఛటర్జీ, ఆసిష్ చంద్ర ఘటక్ దంపతులకు జన్మించాడు. అతను ఆశిష్ చంద్ర ఘటక్ కు మనుమడు. సినిమా నిర్మాత రిత్విక్ ఘటక్ కు మేనల్లుడు. బెంగాలీ రచయిత్రి , ఉద్యమకారిణి మహా శ్వేతాదేవి అతనికి అత్త. అతను వామపక్షవాది. అతని దివంగత తల్లిని 'కామ్రేడ్' అని పిలుస్తాడు. అతను గతంలో నటి స్వస్తిక ముఖర్జీతో సంబంధంలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు[2] . అతని ప్రస్తుత స్నేహితురాలు ఇకే షౌటెన్.
విద్య
[మార్చు]అతను డోల్నా డే స్కూల్, అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చి స్కూల్, కోల్‌కతా లోణి పాత భవన్ స్కూల్ లలో విద్యాభాసం చేసాడు. ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీల కోసం జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేసాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్‌లో బ్రిస్టల్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ అండ్ టివి ప్రొడక్షన్‌లో మాస్టర్స్ పొందారు.
వృత్తి జీవితం
[మార్చు]ఛటర్జీ అనేక టెలివిజన్ ధారావాహికలు, టెలి-ఫిల్మ్‌లు, లఘు చిత్రాలు, చిత్రాలలో నటించాడు. అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం జియో కాకా, ఇందులో రితుపర్ణ సేన్‌గుప్తా, రుద్రానిల్ ఘోష్ నటించారు. అతని రెండవ దర్శకత్వంచిత్రం హవా బోడోల్. కహానీ విజయవంతం అయిన ఏడు నెలల తరువాత, 1986 లో తన తొలి లఘు చిత్రానికి అకాడమీ అవార్డును గెలుచుకున్న జెఫ్రీ డి. బ్రౌన్ చేత తన చిత్రం "సోల్డ్" కు సంతకం చేయించుకున్నాడు.[3][4]
2011 మే 30న అతను వారి స్వంత ప్రొడక్షన్ హౌస్, వర్క్‌షాప్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించడం ద్వారా సహోద్యోగి రుద్రానిల్ ఘోష్‌తో కలిసి నిర్మాత అయ్యాడు[5].
పురస్కారాలు
[మార్చు]- 2006 - బెంగాలీ ఫిల్ం జర్నలిస్టు అసోసియేషన్ పురస్కారం - విజేత
- 2012 - ఆనందలోక్ పురస్కారం - విజేత
- 2013 - జీ సినిమా అరార్డ్ - నామినేషన్
- 2013 - స్క్రీన్ అవార్డు - నామినేషన్
- 2014 - జీ బంగ్లా గౌరవ్ సమ్మాన్ పురస్కారం = విజేత
మూలాలు
[మార్చు]- ↑ "Parambrata". Calcutta, India: www.telegraphindia.com. 24 జూన్ 2008. Retrieved 12 నవంబరు 2008.
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/bengali/movies/news/Ma-and-I-shared-our-fight-for-survival-Parambrata/articleshow/37248742.cms
- ↑ K Jha, Subhas (18 సెప్టెంబరు 2012). "Parambrata headed for Hollywood". Times of India. Mumbai Mirror. Archived from the original on 21 సెప్టెంబరు 2013. Retrieved 7 నవంబరు 2012.
- ↑ Nag, Kushali (5 జనవరి 2008). "Three boys & a babe". The Telegraph. Calcutta, India. Retrieved 12 నవంబరు 2008.
- ↑ Workshop