Jump to content

నమక్కల్

అక్షాంశ రేఖాంశాలు: 11°13′N 78°10′E / 11.217°N 78.167°E / 11.217; 78.167
వికీపీడియా నుండి
Namakkal
Namagiri
Namakkal Bus stand and fort
Namakkal Bus stand and fort
Nickname(s): 
Egg City, Poultry Town, Transport Town
Namakkal is located in Tamil Nadu
Namakkal
Namakkal
Coordinates: 11°13′N 78°10′E / 11.217°N 78.167°E / 11.217; 78.167
CountryIndia
StateTamil Nadu
DistrictNamakkal
CityNamakkal
Named forNamakkal Rock in the middle of the town
Government
 • TypeMunicipality
 • BodyNamakkal district
 • Rank78(2001), 93(2011) In state
Elevation
218 మీ (715 అ.)
జనాభా
 (2011)[1]
 • Total55,145
Time zoneUTC+5:30 (IST)
PIN
6370-01, (02, 03 ... 6370-12)
Telephone code91 - 04286
Vehicle registrationTN-28(North), TN-88(South)
Official languageTamil

నమక్కల్, ఇది భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, నమక్కల్ జిల్లా లోని పట్టణం. నమక్కల్ జిల్లా ప్రధాన కార్యాలయం, ప్రత్యేక తరగతి పురపాలకసంఘ కేంద్రం. ప్రత్యేకంగా పర్యావరణ నిర్వహణ, నీటి సరఫరా, ఘన వ్యర్థాలు, మురుగు నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళిక, వీధిదీపాల నిర్వహణ, ఇతర సామాజిక సేవల నిర్వహణ కారణంగా ఇది ఆసియాలో మొదటి ఐఎస్ఒ 14001-2004 దృవపత్రం పొందిన పురపాలక పట్టణ కేంద్రం.[2] గుడ్ల ఉత్పత్తి, రవాణా కారణంగా నమక్కల్‌ను గుడ్ల ఉత్పత్తి నగరంగా అని పిలుస్తారు. [3]

చరిత్ర

[మార్చు]
నమక్కల్ కోట

నమక్కల్ సాశ.7వ శతాబ్దానికి చెందిన సూచనలతో కూడిన చారిత్రాత్మక పట్టణం. నమక్కల్ అనే పేరు నామగిరి నుండి ఉద్భవించింది. ఇది పట్టణ మధ్యలో ఉన్న ఒకే శిల నిర్మాణం పేరు. 65 మీటర్ల ఎత్తు, ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ చుట్టుకొలత ఉన్న అపారమైన శిల. ఈ బృహత్తర శిల మీద నమక్కల్ కోట నిర్మింంచారు. సా.శ 16వ శతాబ్దంలో నమక్కల్‌ ప్రాంతం కొంగునాడు అనే చిన్న రాజ్యపరిపాలనలో ఒక భాగం. సంగం యుగంలో, నమక్కల్ ప్రాంతం చేరస్ పాలించిన చారిత్రక కొంగునాడు ప్రాంతంలో భాగంగా ఏర్పడింది. బ్రిటిష్ వారి నుండి తప్పించుకోవడానికి టిప్పు సుల్తాన్ కొంతకాలం ఈ కోటలో దాక్కున్నాడని నమ్ముతారు. ఈ కోటను టిప్పుసుల్తాన్ నిర్మించలేదు. కానీ కొద్ది కాలం పాటు ఆక్రమించాడు. ఆ తర్వాత ఈ కోటను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు.

జనాభా శాస్త్రం

[మార్చు]
మతాలు ప్రకారం జనాభా
మతం శాతం (%)
హిందూ
  
88.98%
ముస్లిం
  
9.29%
క్రిష్టియన్లు
  
1.48%
సిఖ్
  
0.01%
బౌద్ధులు
  
0.0%
జైనులు
  
0.01%
ఇతరులు
  
0.23%
మతం పాటించనివారు
  
0.01%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,నమక్కల్ పట్టణం 55,145 జనాభాను కలిగి ఉంది. ప్రతి 1,000 [4] పురుషులకు 1,015 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ. మొత్తం జనాభాలో 5,002 మంది ఆరేళ్లలోపు వారు ఉన్నారు. వారిలో2,609 మంది పురుషులు ఉండగా, 2,393 మంది మహిళలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు వారు 13.7% మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు వారు 5%మంది ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 82.52%, ఇది జాతీయ సగటు 72.99% కంటే ఎక్కువ.[4] పట్టణంలోమొత్తం 15008 గృహాలు ఉన్నాయి.

పట్టణ జనాభా మొత్తంలో 21,572 మంది కార్మికులు ఉన్నారు, వారిలో 133 మంది రైతులు, 264 మంది ప్రధాన వ్యవసాయ కార్మికులు, 562 మంది గృహ పరిశ్రమలు వారు, 19,646 మంది ఇతర కార్మికులు, 967 సన్నకారు కార్మికులు, 22 ఉపాంత సాగుదారులు, 24 మంది సన్నకారు వ్యవసాయ కార్మికులు, 151 మంది ఉపాంత కార్మికులు ఉన్నారు. [1]

2011 మతపరమైన జనాభాలెక్కల ప్రకారం, నమక్కల్‌లో 88.98% హిందువులు, 9.29% ముస్లింలు,1.48% ,క్రైస్తవులు, 0.01% సిక్కులు, 0.0% బౌద్ధులు, 0.01% జైనులు, 0.23% మంది ఇతర మతాలను అనుసరించే వారు,లేదా అనుసరించని వారు ఉన్నారు. [5]

పర్యాటక

[మార్చు]

నమక్కల్ ఆంజనేయర్ ఆలయం

[మార్చు]
నమక్కల్ ఆంజనేయర్ ఆలయం

నమక్కల్ ఆంజనేయర్ ఆలయం నమక్కల్‌లో ఉంది. ఇది హిందూ దేవుడు హనుమంతునికి అంకితం చేయబడిన ఆలయం.ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆంజనేయర్ విగ్రహం 18 అ. (5.5 మీ.) ఎత్తు కలిగి ఉంది. భారతదేశం లోని పురాతన దేవాలయాలలో హనుమంతుని ఎత్తైన విగ్రహాలలో ఇది ఒకటిగా నిలిచింది. ఆంజనేయర్ విగ్రహం ఒకేరాతితో చెక్కారు.సా.శ. 5వ శతాబ్దం నాటిది. గర్భగుడిపై పైకప్పు లేదు. ఆంజనేయరు తన నడుముపై కత్తిని ధరించి, సాలిగ్రామంతో చేసిన దండను పట్టుకున్న ప్రత్యేకమైన ప్రతిమను కలిగి ఉన్నాడు.[6] ఈ ఆలయం దేశంలోని ఇతర ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. [7]

నామగిరి లక్ష్మీ నరసిమార్ స్వామి దేవాలయం

[మార్చు]

నామగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విష్ణువు శ్రీ నరసింహ స్వామి రూపంలో ఉన్న ఆలయం. ఈ ఆలయాన్ని సా.శ.8వ శతాబ్దంలో పాండ్య రాజులు శిలల వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించారని నమ్ముతారు.నాళాయిర దివ్య ప్రబంధాలలో ఈ ఆలయం ప్రస్తావన లేదు. అందువలన 108 దేవాలయాల దివ్య దేశం నమోదు వరుస జాబితా చేరలేదు. శ్రీ వైఖానస అహమం ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లలో (తమిళ మాసం "పంగుని") నరసింహస్వామి ఆలయానికి వార్షిక కోత్సవం జరుపుతారు.

నమక్కల్ కోట

[మార్చు]

నమక్కల్ కోట అనేది నమక్కల్‌ పట్టణంలో ఉన్న ఒక చారిత్రాత్మక కోట.ఇది రాతి కోట.ఒకే రాయితో ఏర్పడిన రాతి శిఖరంపై ఉంది. ఇటుక, రాతిలో ఉన్న అవశేషాలు సా.శ. 9వ శతాబ్దంలో చోళులచే కోటను ముట్టడించడానికి జరిగిన వాగ్వివాదాలు ఇప్పటికీ కలిగి ఉన్నాయి. [8] 17వ శతాబ్దంలో కొంగు వెల్లలార్ల కాలంలో కోట తిరిగి పుననిర్మించారు. [9] ఈ కోట ఒకే రాయితో 75 మీ. (246 అ.) పొడవు ఉన్న కొండపైన ఉంది.కోట లోపల ఒక దేవాలయం, మసీదు ఉన్నాయి. ఈ రెండూ పట్టణం లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలు. ఆధునిక కాలంలో, ఈ కోట తమిళనాడు ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. రంగనాథస్వామి దేవాలయం కోట పక్కనే ఉన్న మరొక రాతి దేవాలయం. రంగనాథస్వామి గుహ దేవాలయాన్ని పల్లవులు నిర్మించారని నమ్ముతారు. [10] [11]

రవాణా

[మార్చు]

త్రోవ

[మార్చు]

నమక్కల్ పట్టణంనుండి సేలం, ఈరోడ్, తిరుచ్చి, కరూర్, కోయంబత్తూర్, చెన్నై, మధురై, దిండిగల్ వంటి తమిళనాడు లోని నగరాలకు బస్సులు నడుస్తాయి. నమక్కల్ జాతీయ రహదారి 44 ద్వారా భారతదేశం లోని ఇతర ప్రాంతాలకు రవాణా అనుసంధానం ఉంది [12] ట్రిచీ లేదా మదురై నుండి బస్సులు సేలం, బెంగుళూరు చేరుకోవడానికి నమక్కల్ గుండావెళతాయి.

రైల్వే

[మార్చు]

సేలం నుండి నమక్కల్ మీదుగా కరూర్ వరకు కొత్తబ్రాడ్-గేజ్ రైలు మార్గం 25 మే 2013 [13] దాని సేవను ప్రారంభించింది. సేలం, కరూర్, చెన్నై సెంట్రల్, బెంగుళూరు, దిండిగల్, పళని, మధురై, తిరునల్వేలి, నాగర్‌కోయిల్, పొల్లాచ్చి, పాలక్కాడ్ నుండి ప్రతి రోజూ రైళ్లు ఉన్నాయి.

విమానాశ్రయాలు

[మార్చు]

సమీప విమానాశ్రయాలు సేలం విమానాశ్రయం (52కిమీ), కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (153కిమీ), తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం (85కిమీ) దూరంలో ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Census Info 2011 Final population totals - Namakkal". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original on 24 September 2015. Retrieved 26 January 2014.
  2. Saravanan, S. p (2016-07-01). "Namakkal municipality to implement Rs. 190.40 crore water scheme". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-11-24.
  3. M Sabari (7 May 2017). "Tamil Nadu's Namakkal mired in slump due to year-round water shortage". New Indian Express. Retrieved 21 July 2020.
  4. 4.0 4.1 "Census Info 2011 Final population totals". Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2013. Retrieved 26 January 2014.
  5. "Population By Religious Community - Tamil Nadu" (XLS). Office of The Registrar General and Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 13 September 2015.
  6. Monkeys, Motorcycles, and Misadventures. Leadstart Publishing PvtLtd. 2015. p. 65. ISBN 9789352013777.
  7. Hindu Gods and Goddesses. Smriti Books. 2005. ISBN 9788187967729.
  8. "Namakkal District, Govt of Tamil Nadu". TN.nic.in. Archived from the original on 28 September 2011. Retrieved 19 April 2017.
  9. "Tamil Nadu Government Portal". Namakkal District Administration. 2016-05-09.
  10. ":::TTDC - Places".
  11. "Domain Default page". Archived from the original on 2020-10-19. Retrieved 2023-02-02.
  12. "Reliance Energy, NHAI join hands to pave way for highway development". New Delhi: The Financial Express. 2006-01-31. Retrieved 14 April 2012.
  13. Renganathan, L. (26 May 2013). "New passenger train chugs into grand reception at Karur junction". The Hindu. Chennai, India.

వెలుపలి లంకెలు

[మార్చు]