Jump to content

నంది ఎల్లయ్య

వికీపీడియా నుండి
నంది ఎల్లయ్య
నంది ఎల్లయ్య


మాజీ ఎం.పి
పదవీ కాలం
1977-84, 1989-98, 2014-2019
ముందు మంద జగన్నాథ్
తరువాత పి.రాములు
నియోజకవర్గం సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం (1977-84, 1989-98)
నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం (2014-19)

వ్యక్తిగత వివరాలు

జననం (1942-07-01)1942 జూలై 1
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మరణం 2020 ఆగస్టు 8(2020-08-08) (వయసు 78)
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

నంది ఎల్లయ్య (జూలై 1, 1942 - ఆగస్టు 8, 2020) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు (6వ, 7వ, 9వ, 10వ, 11వ లోక్‌సభ), నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం ఒకసారి (2014-2019 వరకు) ఎంపీగా పనిచేశాడు.[1][2]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఎల్లయ్య 1942, జూలై 1న హైదరాబాదులోని ముషీరాబాదులో జన్మించాడు. మెట్రిక్యులేషన్ పూర్తిచేశాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

ఈయన 6సార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి 6వ (1977-80), 7వ (1980-84), 9వ (1989-91), 10వ (1991-96), 11వ (1996-98) లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథ్ను ఓడించి 16 వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[3][4] 1979-84, 1989-97 వరకు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[5] టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేశాడు.[6]

మరణం

[మార్చు]

2020, జూలై 29న అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ లో చేరిన నంది ఎల్లయ్య కరోనా వ్యాధితో 2020, ఆగస్టు 8 శనివారం ఉదయం 10.30 గంటలకు మరణించాడు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. మన తెలంగాణ, తెలంగాణ (8 August 2020). "కాంగ్రెస్ మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత". Archived from the original on 8 August 2020. Retrieved 8 August 2020.
  2. సాక్షి. "ఎంపీ నంది ఎల్లయ్య". Retrieved 11 March 2017.
  3. సాక్షి, తెలంగాణ (8 August 2020). "కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి". Sakshi. Archived from the original on 8 August 2020. Retrieved 8 August 2020.
  4. వి6 టీవి. "నాగర్ కర్నూల్ ఎంపీగా నంది ఎల్లయ్య గెలుపు." Retrieved 11 March 2017.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  5. వి6 వెలుగు, తెలంగాణ (8 August 2020). "కరోనా వ్యాధితో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి". Archived from the original on 8 August 2020. Retrieved 8 August 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. వార్త, తెలంగాణ (8 August 2020). "మాజీ ఎంపి నంది ఎల్లయ్య కన్నుమూత". Vaartha. Archived from the original on 8 August 2020. Retrieved 8 August 2020.
  7. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (8 August 2020). "కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 8 August 2020. Retrieved 8 August 2020.
  8. నమస్తే తెలంగాణ, తెలంగాణ (8 August 2020). "మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత". ntnews. Archived from the original on 8 August 2020. Retrieved 8 August 2020.