దేశాల జాబితా – ISO 3166-1 కోడ్
ఐఎస్ఒ 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం. ఇది ప్రామాణీకరణలో ఒక భాగం. వివిధ దేశాలకు, ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్‌లు ఇవ్వబడుతాయి.ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO 3166-1) కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ ద్వారా 1974లో మొదటిసారి ప్రచురించింది. ప్రతి దేశానికి లేదా భూభాగానికి ISO మూడు విధాలైన కోడ్ లను నిర్వచిస్తుంది.
ISO 3166-1 విధానంలో పేజీ సృష్టించేనాటికి (2007 సెప్టెంబరు) మొత్తం 244 దేశాలకు లేదా భూభాగాలకు కోడ్‌లు ఇవ్వబడ్డాయి. ISO 3166 వారి కంట్రీ కోడ్ మెయింటెనెన్స్ ఏజెన్సీ వారి సమాచారం ప్రకారం ఏదైనా దేశం లేదా భూభాగం ఐక్య రాజ్య సమితి పరిభాష బులెటిన్ (Terminology Bulletin) లో గాని లేదా వారి గణాంక విభాగంలో గాని స్థానం కలిగి ఉన్నట్లయితే, ఆ దేశానికి లేదా ప్రాంతానికి ISO 3166 కోడ్ ఇవ్వబడుతుంది. ఏదైనా ఒక దేశం లేదా ప్రాంతం అధికారిక నామం మారినట్లయితే దానికి క్రొత్త కోడ్ ఇవ్వబడుతుంది.
కోడ్ పొందటానికి కావలసిన కనీసార్హతలు
[మార్చు]- ఐక్య రాజ్య సమితి సభ్య దేశం అయి ఉండాలి - లేదా
- ఏదైనా ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీలో సభ్యత్వం కలిగి ఉండాలి - లేదా
- అంతర్జాతీయ న్యాయ స్థానంలో సభ్యత్వం కలిగి ఉండాలి.
మొదటి కోడ్
[మార్చు]- మొదటిది ఐఎస్ఒ 3166-1 ఆల్ఫా-2 విధానం. ఇది రెండు అక్షరాల కోడ్. దీనిని చాలా అంశాలలో వినియోగిస్తారు. వాటిలో ఒకటి (కొద్ది దేశాల విషయంలో తప్పించి) ఆయా దేశాలకు చెందిన ఇంటర్నెట్ అగ్ర-స్థాయి డొమైన్ , దేశం కోడ్ టాప్-లెవల్ డొమైన్లకు పెట్టే పేరు. ఉదాహరణకు ఇండియాకు 'in' జపాన్ కు 'jp' అనే అక్షరాలు.
రెండవ కోడ్
[మార్చు]- ఐఎస్ఒ 3166-1 ఆల్ఫా-3: ఇది మూడు 'అక్షరాల' కోడ్ విధానం. ఐఎస్ఒ 3166-1 లో నిర్వచించబడిన మూడు అక్షరాల దేశ సంకేతాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఒ) చే ప్రచురించబడిన ఐఎస్ఒ 3166 ప్రమాణికంలో ఒక భాగం, దేశాలు, ఆధారిత భూభాగాలు, భౌగోళిక ప్రత్యేక ప్రాంతాలను సూచించడానికి వాడతారు.
మూడవ కోడ్
[మార్చు]- ఐఎస్ఒ 3166-1 సంఖ్య, మూడు 'అంకెల' కోడ్ విధానం.ఇది ఐక్య రాజ్య సమితి గణాంక విభాగం వారి నిర్వచనాన్ని అనుసరించి, ఇంగ్లీషు భాష అక్షరాలు (లాటిన్ వర్ణమాల) వాడని, లేదా వాడడానికి కుదరని చోట్ల ఇది ఎక్కువ ఉపయోగకరం.
కోడ్ పొందిన దేశాలు
[మార్చు]కోడ్ వివరాలు ప్రచురించిన సమాచార పత్రికలు
[మార్చు]ISO 3166-1 కోడ్‌లలో మార్పులు వారి సమాచార పత్రికలో తెలియజేయబడుతాయి. ఇప్పటివరకు 12 పత్రికలు అలా వెలువడినాయి. (1977లో స్టాండర్డ్ విడుదలైన తరువాత):
- ప్రచురితం 1998-02-05: పేరు మార్పు -- సమోవా, లభించే చోటు English , French
- ప్రచురితం 1999-10-01: పేరు మార్పు -- ఆక్రమిత పాలస్తీనా భూభాగం, లభించే చోటు English , French
- ప్రచురితం 2002-02-01: ఆల్ఫా-3 కోడ్ ఎలిమెంట్ మార్పు రొమేనియా, లభించే చోటు English , French
- ప్రచురితం 2002-05-20: వివిధ దేశాల కోడ్‌లకు మార్పులు, లభించే చోటు English and French
- ప్రచురితం 2002-05-20: పేరు, కోడ్ మార్పులు --> తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె), లభించే చోటు English , French
- ప్రచురితం 2002-11-15: పేరు, కోడ్ మార్పులు --> టిమోర్-లెస్టె, లభించే చోటు English , French
- ప్రచురితం 2002-11-15: అధికారిక పేరు మార్పు కొమొరోస్, లభించే చోటు English , French
- ప్రచురితం 2003-07-23: తొలగింపు యుగోస్లేవియా, క్రొత్తగా చేర్పు సెర్బియా & మాంటినిగ్రో, లభించే చోటు English , French
- ప్రచురితం 2004-02-13: క్రొత్త పేరు ఆలాండ్ దీవులు, లభించే చోటు English , French
- ప్రచురితం 2004-04-26: పేరు మార్పు -- ఆఫ్ఘనిస్తాన్ , ఆలాండ్ దీవులు, లభించే చోటు English , French
- ప్రచురితం 2006-03-29: క్రొత్తగా చేర్చినవి గ్వెర్నిసీ, ఐల్ ఆఫ్ మాన్, జెర్సీ బాలివిక్, లభించే చోటు English , French
- ప్రచురితం 2006-09-26: తొలగింపు సెర్బియా & మాంటినిగ్రో, క్రొత్తగా చేర్చినవి సెర్బియా, మాంటినిగ్రో, లభించే చోటు English , French
మూలాలు
[మార్చు]- Information on reserved codes taken from "Reserved code elements under ISO 3166-1" published by Secretariat of ISO/TC 46, ISO 3166 Maintenance Agency, 2001-02-13, available on request from ISO 3166/MA.
ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు
[మార్చు]- ఐఎస్ఒ 3166-2
- ఐఎస్ఒ 3166-3
- ఒసి పిఫా, ఐఎస్ఒ 3166 కంట్రీ కోడ్‌ల పోలిక
- ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్టాండర్డ్
బయటి లింకులు
[మార్చు]- ISO 3166/MA Archived 2004-09-23 at the Wayback Machine – ISO 3166 Maintenance Agency at the International Organization for Standardization – includes up-to-date lists of two-letter codes.
- United Nations Statistics Division – Standard Country or Area Codes for Statistical Use – includes three-letter and numeric codes.
- CIA World Factbook – Cross-Reference List of Country Data Codes Archived 2020-11-13 at the Wayback Machine (public domain)
- a list of ISO 3166-1 codes (including three-letter and numeric codes), and includes information about changes that have been made over the years.
- an xml document containing country codes and country names in 7 languages.