చర్చ:త్యాగరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


త్యాగరాజు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


కీర్తనలు

[మార్చు]

కీర్తనల సంపుటి వేరే వ్యాసములో ఉండాలని, ఆ వ్యాసాన్ని మొదలు పెట్టాను. Alamandrax 09:32, 20 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

భారతీయ సంగీతము మూస

[మార్చు]

మూసలోని అన్ని పదాలకు అర్ధము తెలియక పూర్తి చెయ్యలేకపోయాను. ఆ అనువాదం చేశాక ఆ మూస తొలగించబడుతుంది. Alamandrax 23:37, 20 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శుద్ధి

[మార్చు]

మూస అనువాదముతో పాటు, ఈ వ్యాసములోని భాగాలను సరిగా విభజంచి, బొమ్మలు సరిగ్గా అమరిస్తే, వ్యాసముయొక్క presentation బాగు పడుతుంది. Alamandrax 23:48, 20 ఫిబ్రవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

త్యాగరాజుకు తమిళం వచ్చా?

[మార్చు]

త్యాగరాజ కృతులన్నీతెలుగులోనే ఉన్నాయి. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు తమిళరాజ్యంలో చాలాకాలం నివసించాడు కాబట్టి తమిళం వచ్చే ఉంటుంది. ఎన్నో తెలుగు కీర్తనలు పాడిన త్యాగరాజు అక్కడి ప్రజల భాష తమిళం లో కొన్ని కీర్తనలు కూడా పాడి ఉంటాడా అనేది చారిత్రకులు చెప్పాలి.

పై వ్యాఖ్యను వ్యాసంలో ఉంచారు. నేను సబబుగా ఉంటుందని ఇక్కడికి తరలించాను. -- రవిచంద్ర(చర్చ) 06:52, 8 ఏప్రిల్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర(చర్చ) గారూ , అప్పట్లో తమిళ దేశం ఉందనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ? ఈ వ్యాసంలో తమిళ దేశానికి వలస వెళ్ళాడు అని రాశారు ? అప్పట్లో అందరం కలిసి ఉండే వారము కదా ? ఇప్పటి తమిళనాడులోనే 41 నూరుపాళ్లు తెలుగువారు ఉన్నప్పుడు అప్పట్లో తమిళ దేశానికి వలస పోయాడని ఎలా చెప్పగలరు ? ఈ వీడియొ లు చూడండి. https://www.youtube.com/watch?v=nqtIGlb0dAo&t=2912s https://www.youtube.com/watch?v=nqtIGlb0dAo

కె.వెంకటరమణ గారు ఇది ఓ సారి చూడండి !!!

దేవుడు (చర్చ) 13:29, 14 మే 2020 (UTC).[ప్రత్యుత్తరం]

@దేవుడు: గారూ! మీరు లేవనెత్తిన అంశంలో విషయం ఉంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు భాష ఆధారంగా రాజకీయ విభాగాలు ఉండేవి కాదు. కాబట్టి, అందుకు అనుగుణంగా "తంజావూరు పరిసర ప్రాంతానికి (ప్రస్తుతం తమిళనాడులో భాగం)" అని మార్పు చేసి, ఆధారం కావాలి మూస తొలగించాను. ఎత్తి చూపి, చర్చా పేజీలో రాసినందుకు ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 14:33, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@దేవుడు:, ఆ వాక్యం నేను రాయలేదు. పైగా దానికి ఆధారాలు లేవని వ్యాసంలో కనిపిస్తున్నది. కాబట్టి అది సమస్యాత్మక వాక్యం. నేను ఆధారాలు సేకరిస్తున్నాను. ఆధారం1 దాన్ని బట్టి త్వరలో వ్యాసాన్ని మార్పు చేయబోతున్నాను. రవిచంద్ర (చర్చ) 14:37, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంకో ఆధారం ఇక్కడ కూడా ఆయన తిరువయ్యూరులో జన్మించారని ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జన్మించారన్నది సరైన వాదన కాదేమో. రవిచంద్ర (చర్చ) 14:42, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ, ఆధారాలు లేవని నేనే కలిపాను. మీరు చేశారని నా ఉద్దేశం కాదు, రాసిన వారిని ఉద్దేశించి మాత్రమే. పవన్ సంతోష్ గారు, ధన్యవాదాలు. దేవుడు (చర్చ) 14:44, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆయనకు తమిళం వచ్చి తమిళం లో కీర్తనలు రాసి ఉంటే నేటి తమిళ వాదులు ఆయనను ఎందుకు ఆడి పోసుకుంటారు, ఈమధ్య కమల్ హాసన్ కూడా ఏవో అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడో వార్తలు వచ్చాయి[1]. దేవుడు (చర్చ) 14:59, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర: గారూ, ఇక్కడ దేవుడు గారు లేవనెత్తిన విషయం ఏమంటే - 17, 18 శతాబ్దాల్లో తమిళ దేశం, తెలుగు దేశం - ఇలా విడివిడిగా ఉండేవి కాదు కదా. ఈనాడు తమిళనాడు అన్న ప్రాంతంలోనే తంజావూరు, మధుర వంటి రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాల్లోనూ భారీ ఎత్తున తెలుగువారూ ఉండేవారు. అలాంటప్పుడు తమిళ దేశానికి వలసవెళ్ళారని ఎలా అనగలగుతాం అన్నది ఆయన సందేహం. నిజానికి @దేవుడు: గారు వేరే శీర్షిక కింద వేరే చర్చ లేవనెత్తి ఉంటే స్పష్టంగా ఉండేది. కొంత సంబంధం ఉంది కాబట్టి ఇక్కడే చర్చ చేసినట్టు ఉన్నారు. ఇక మీదట అలా చేస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 15:33, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్, @దేవుడు: క్రింది విధంగా నన్ను ఉద్దేశించి అడిగారు.

రవిచంద్ర(చర్చ) గారూ , అప్పట్లో తమిళ దేశం ఉందనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ?

ఇందులో ఆయన ఉద్దేశ్యం తమిళ దేశానికి వలస వెళ్ళాడు అనే వాక్యం ఈ వ్యాసంలో నేను రాశాను అనుకున్నారేమో. అందుకనే నేను వివరణ ఇచ్చాను. -రవిచంద్ర (చర్చ) 07:26, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అవును, @రవిచంద్ర: గారూ, కొంత అయోమయం ఏర్పడింది.

--పవన్ సంతోష్ (చర్చ) 10:54, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తమిళ దేశం ప్రస్తావన

[మార్చు]

పవన్ సంతోష్ తమిళ దేశం మళ్ళీ చేర్చబడింది లేదా పైన చర్చించినప్పటికి ముందే మనం ఇది చూడలేదేమో. ఆ పుస్తకంలో తమిళదేశం ఉన్నప్పటికీ అది పూర్తి ఆధారం కాజాలదు. పుస్తకాలు, మూలాలు, సినిమాలు ఎలా ఉన్నప్పటికీ వికీలో రాయువారు లేదా నిర్వాహకులు neutrality point of view లేదా తటస్థ దృక్కోణం అనేది తప్పకూడదు అనుకుంటున్నాను చదువరి గారు, వెంకట రమణ గారు [2] [3].

తటస్థ దృక్కోణం ప్రకారం: వికీపీడియా విషయ సంగ్రహానికి సంబంధించినవి మూడు ముఖ్యమైన విధానాలున్నాయి. అవి:

  1. తటస్థ దృక్కోణం (en:Wikipedia:Neutral point of view)
  2. ఒరిజినల్ పరిశోధన తాలూకు అసలు ప్రతి కాకూడదు (en:Wikipedia:No original research)
  3. నిర్ధారణకు అనుకూలంగా ఉండాలి. (en:Wikipedia:Verifiability) ____దేవుడు (చర్చ) 13:55, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆత్మ విచారము

[మార్చు]

భమిడిపాటి కామేశ్వర రావు గారు “త్యాగరాజ ఆత్మ విచారము” అనే పుస్తకం రాసారు. ఇందులో పుక్కిట పురాణ కథలు కనిపించవు. తత్వ, అధ్యాత్మిక విశ్లేషణ లతో త్యాగరాజ సంగీతమ్మీదొచ్చిన పుస్తకం ఇదొక్కటే. .ప్రజల మనసులకత్తుకోడం కోసం ఆయన జీవితంలోకి రాముడి లీలలూ, రక్షణలూ చొప్పించి ఆసక్తి కరంగా మలిచారు. రామ భక్తుడిగా పట్టాభిషేకం చేసేసి, చివరకి ఆయన్ని రాముడిలో లీనం చేసేసారు. ఆయన జీవితాన్ని పౌరాణిక గాధగా తీర్చి దిద్దారు.వ్యక్తిగా త్యాగరాజు ఎలా జీవించాడూ? అప్పట్లో ఉన్న యుద్ధాలూ, కల్లోలాలపై ఎలా స్పందించాడూ? ఆయన భార్యా, పిల్లలతో ఎలా గడిపాడూ?, శిష్యులకి ఎలా సంగీత బోధన చేసేవాడూ? ఇలా ఎన్నో వివరాలు ముందు తరాలకి అందకుండా పోయాయి.

త్యాగరాజు జన్మస్థలం

[మార్చు]

ఈ వ్యాసంలో త్యాగరాజు జన్మస్థలం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అని రాశారు. దానికి ఆధారాలేమీ చూపించలేదు. కాబట్టి నేను ఆధారాలతో సహా తిరగరాయబోతున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పండి. రవిచంద్ర (చర్చ) 07:28, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

జన్మస్థల వివరాలు సరిచేస్తూ తిరగరాశాను. -రవిచంద్ర (చర్చ) 10:48, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర, ఈ వ్యాసంలో అలా రాసినప్పటికి వారి ఇంటిపేరు "కాకర్ల"ను బట్టి తెలుగు రచనలను బట్టి, మూలాలు అన్వేషిస్తే వారి పూర్వీకులది ప్రకాశం జిల్లా కంబం తాలూకా , కాకర్ల గ్రామం అని భావించవచ్చని ఆంగ్ల వికీపీడియా లో ఉంది. వారు జత చేసిన మూలం https://www.thehindu.com/features/friday-review/music/retracing-roots-of-thyagaraja/article4339327.ece [4]. కానీ నేను మీరు చేసిన ఈ సవరణకు ఓ తెలుగుగా ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ఇస్తాను. ఎందుకంటే ఈ వాదన ఊహాగానంగా కూడా భావించవచ్చును. ఇంకో వాదన ప్రకారం ఆయన కడప జిల్లాకు చెందినవారని కూడా ఇంతకు ముందు విన్నా. దేవుడు (చర్చ) 14:28, 23 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు ఆధారం ఉంది కాబట్టి మీరు చెప్పినట్టుగానే ఈ వ్యాసంలో కూడా వారి పూర్వీకులు ప్రస్తుతం ఆంధ్రదేశం నుంచి తంజావూరు సమీపానికి వలస వెళ్ళారనే వాక్యాన్ని ఉంచానండీ. ఇంకా ఏమైనా ఉండాలేమో చెప్పండి. కడప జిల్లాకు చెందిన వారనడానికి ది హిందూ లాంటి వార్తా కథనమెక్కడైనా చూశారా? - రవిచంద్ర (చర్చ) 05:40, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర ది హిందూలో వచ్చినప్పటికీ ఆ మూలాన్ని ఆధారంగా పరిగణించలేము. ఎందుకంటే అది కేవలం అంచనా లేదా గెస్సింగ్ మాత్రమే. తమిళులకి అక్కడున్న తెలుగు వారిని బయటి వారీగా లెక్కగట్టి తిట్టి రాజకీయ పెత్తనం చేయాలని తెలుగువారిని నామరూపాలు లేకుండా చేయాలని అనుకుంటున్నారు అని అర్థం అవుతుంది ఇటీవల రాజకీయాలు గమనిస్తే. మనకు కుల రాజకీయాలు ఎంత ప్రభావ వంతమో తమిళనాడు లో భాష రాజకీయాలు కూడా అంతే. కావున వలస వెళ్లారు అని కాకుండా "వెళ్లారు అని భావిస్తున్నారు" లేదా "వెళ్లారు అని అంచనా వేస్తున్నారు" అని రాయడం సబబు అనిపిస్తోంది. అందుకే మీరు ముందు రాసిన దానికి నేను సమర్ధించాను. ఇక కడప జిల్లాకు చెందిన వారు అని కొన్ని సంవత్సరాల క్రితం నేను ఓ తెలుగు 24/7 వార్తా చానెల్లో చెబుతూ ఉండగా చూశాను. ఆ లంకె కోసం యూట్యూబ్ శోధన చేయాలి. ఒకవేళ నాకు కనిపిస్తే చెబుతాను. ప్రస్తుతానికి ఇవ్వన్నీ ఊహాతీతాలే అని భావించవచ్చును. వారు పుట్టిన స్థలమునే వారి స్థలముగా పరిగణిస్తే బాగుంటుంది. ఎందుకంటే కాకర్ల అనే ఇంటిపేరుని బట్టి వెతికితే కడప జిల్లా రైల్వే కోడూరు నియోజక వర్గం లోనే రెండు "కాకర్లవారిపల్లె" లు(కమ్మ పల్లెలు) ఉన్నాయి. కాకర్ల అని ఇంటి పేరు గల వారు చాలా కులాలలో ఉన్నారు. కాకర్లపూడి అనే ఇంటి పేరూ మన తెలుగు వారిలోనే ఉంది. కర్ణాటక లో కూడా కాకర్ల ఇంటి పేరు గల వారు ఉన్నారట!. కొందరు కన్నడిగులు నా ఇంటి పేరు బట్టి నేను కన్నడ వాడిని అనుకున్నారు. నేను తెలుగు అని చెప్పాను. కాకర్ల వెనుక చాలా చరిత్ర హిందూ పత్రికకు తెలియదు కాబట్టి, ప్రకాశం జిల్లాకు వెల్లారంతే. అంతెందుకు మా ఇంటి పేరు కూడా కాకర్ల నే. మేమందరము కూడా ప్రకాశం జిల్లా నుండి కడప కు వలస వచ్చామా ? ఏమో గతం గతించినది. మా ఇంటి పేరు కూడా కాకర్ల అయినప్పటికీ మేము బ్రహ్మణులము కాదు, కమ్మలము. ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావ్ కూడా బ్రాహ్మణుడు కాదు అనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రకాశంలోని కాకర్ల లో ఏ కులస్తులు ఉన్నారో తెలియదు. ఇలా చాలా అంశాలు శోధించాల్సి ఉంటుంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రత్యేక తమిళనాడు ఏర్పడింది కాబట్టి ఆ రోజులకి వలస అనే పదం కూడా సరి కాదు. అంతెందుకు మా నందలూరు లోని సౌమ్యనాథ స్వామి దేవస్థానము లో తెలుగు తమిళము రెండు భాషలలొ శాసనాలు ఉన్నాయి అంతా మాత్రనికి కడప జిల్లాకి తెలుగు వారు వలస వచ్చారు అని చెప్పలేము. ఇక్కడ తమిళులెవ్వరు లేరు. పూర్వం యుద్దాలు జరిగినప్పుడు తమిళ చోళులు బహుశా తెలుగు ప్రాంతాలను గెలిచి ఉండవచ్చును. అందువల్ల వారి భాష అయిన తమిళము ప్రజల భాష అయిన తెలుగు రెండు భాషల లోనూ శాసనాలు వేశారు అనుకుంటున్నాను. ఇక ఇదే దేవస్థానములో ప్రతాప రుద్రుడు ధ్వజ స్తంభము కట్టి స్వామి వారికి భూములు ఇచ్చాడని చరిత్ర. అంత మాత్రానికి ప్రతాప రుద్రుడు తమిళుడు అని చెప్పము. గండికోట రాజ్యంలో 66 ఇంటి పేర్లు ఉన్న కమ్మ వారు ఉండే వారని తెవికీ లోనే చదివాను. ఆ ఇంటి పేర్లలో కాకర్ల కూడా ఒకటి. కాలగమనంలో ఎన్నో జరిగి ఉండవచ్చు. తమిళదేశము అనేది కూడా సహేతుకము కాదు. అలా రాస్తే ప్రస్తుత తమిళనాడులో ఉన్న మన తెలుగు వారికి మనమే ద్రోహం చేసినట్టు. అంతెందుకు తెలుగు మాట్రిమోని లో తమిళనాడు లో అన్నీ ప్రాంతాల నుండి అన్నీ కులాలలో తెలుగు అని భాష గా ఎంచుకున్న ఎంతో మందిని చూడవచ్చును. వీరు తమిళ్ అని పెట్టుకోలేదు. ఇప్పుడు తమిళము వారిపై రుద్దబడింది అంతే. ఏదేమైనా త్యాగరాజ స్వామి మన తెలుగు వారందరికీ గర్వ కారణం. ఆయనను మా తెలుగు తల్లి గేయంలో కూడా "త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు" అని పాడి గుర్తు పెట్టుకున్నాము. ఇది నాకున్న పరిజ్ఞానం. తప్పయితే నాకు చెప్పండి. దేవుడు (చర్చ) 13:36, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, ఇతను ములకనాడు బ్రాహ్మిన్ అని ఆంగ్ల వికీపీడియా లో ఉంది. ములకనాడు ని నొక్కితే కడప అని వివరించారు. Mulukanadu has been called variously across an assorted array of inscriptions found in the region. The Brahmin community from this sect has an incessant relationship with the Telugu language and it can be deduced that the region corresponding to the origin of this sect is the middle Pennar region which is based entirely in the Cuddapah district. The area is itself known under different names during different periods of time. Dommaranandyala plates inscribed by Punyakumara mentions this region as Hiranya Rashtra. The first inscription that explicitly talks about Mulkinadu is of the Rashtrakuta king Krishna in Pushpagiri as Mulkinadu naidu maharajyam.[5] Along with Mulkinadu, various other locations in the vicinity are called Renadu, Marjavadi, Pottapinadu, Pedanadu and so on. http://mulakanadusabhachennai.org/origin.html మూలం https://en.wikipedia.org/wiki/Mulukanadu_Brahmin [5] దేవుడు (చర్చ) 15:29, 24 మే 2020 (UTC).[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, గండికోట యుద్ధం ప్రకారం 1650 వ సంవత్సరం లో యుద్దం జరిగినది, గండికోట సామ్రాజ్యం పతనం అయినది. త్యాగరాజు పుట్టింది 1767. ఈ సంధులో రెండు,మూడు తరాలు గడిచి ఉంటాయి. ఈ రెండు, మూడు తరాలు త్యాగరాజు పూర్వీకులవిగా అనుకుంటున్నా. ఈ గండికోట యుద్ధం వ్యాసం ప్రకారం "బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ నాయుణ్ణి తమిళదేశానికి తరలించారు. గండికోటలోని అరవయ్యారు ఇంటిపేర్లు గల కమ్మ వంశాలవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోయారు. వీరికే 'గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అనే పేర్లు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు, నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెట్టాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్‌పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.మూడు శతాబ్దాలు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయాలు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు." నాకు ఈ పోలికలు ఏదో విషయాన్ని బలపరుస్తున్నాయి[6]. దేవుడు (చర్చ) 16:01, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, ఈ జమ్మలమడుగు, గండికోట, పులివెందుల, కడప జిల్లా , మదనపల్లె ఇవన్నీ కలిపి ములుకునాడు, రేనాడు, మేల్ ములకునాడు అని చెప్పారు. ఎంత కమ్మ రాజ్యమయినా నాడు దేవాలయాలలో పూజాధికాలకి సద్ బ్రాహ్మణులు ఉండి ఉంటారుగా. వీరు అలా ఆ సమయంలో వెళ్ళి ఉండ వచ్చేమో. ప్రస్తుత తమిళ నాడులోని మధుర ఇతర రాజ్యాలకి ఎందుకంటే చెన్నై వరకు ఈ దాడిలో రాజ్యం కోల్పోయారు. ఇది నా భావన మాత్రమే ---- దేవుడు (చర్చ) 16:14, 24 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, ఇక్కడ ఇంకొన్ని విషయాలు కడప ములకి నాడు గురించి.[7][8]. దేవుడు (చర్చ) 01:44, 25 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర, మీ స్పందన కొరకు వేచి ఉన్నాను, ఆంగ్ల వికీపీడియా ప్రకారం త్యాగరాజు ములకినాడు బ్రాహ్మణుడు. ములకినాడు ఆంగ్ల వికీపీడియా ప్రకారం కడప ప్రాంతం. దేవుడు (చర్చ) 07:58, 27 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దేవుడు వ్యాసంలో ములకనాడు బ్రాహ్మణుడు అని ఇదివరకే ఉంది. ఇంకా దానికి మీరు చేర్చాలనుకుంటున్నారు? - రవిచంద్ర (చర్చ) 08:27, 27 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర కడపకు చెందిన వారు అనడానికి ఆధారాలు అడిగారు కదా, అది కొన్ని సం|| ల కిందట టివి లో చూసా. ప్రస్తుతానికి నాకు లంకె కనపడ లేదు. కానీ వికీపీడియాలోనే దీనిని బలపరిచే ఆధారంగా ములకనాడు గురించి వివరాలు ఆంగ్ల వికీలో ఉన్నాయి. తెలుగులో ములకనాడు వ్యాసం నేను రాస్తాను. దేవుడు (చర్చ) 03:22, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

@దేవుడు: టివి కథనాలను వికీ ఆధారంగా పరిగణించదు అనుకుంటున్నా. ఆంగ్ల వికీలో ఆధారాలను బట్టి మీరు తెలుగులో ములకనాడు వ్యాసం రాయండి. - రవిచంద్ర (చర్చ) 05:02, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@రవిచంద్ర:, నేను పైన చేసిన చర్చ కూడా టివి ఆధారంగా కాదు కానీ ఆంగ్ల వికీపీడియా https://en.wikipedia.org/wiki/Mulukanadu_Brahmin ప్రకారమే. టివిలో చూశానని మాత్రమే చెప్పాను. ములుకనాడు వ్యాసం సిద్దం చేశాను. సవరణలు సూచించండి. దేవుడు (చర్చ) 05:24, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

"శ్రీత్యాగరాజ స్వామి" కూర్పుల చరితం

[మార్చు]

శ్రీత్యాగరాజ స్వామి వ్యాసాన్ని ఈ వ్యాసంలో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 06:52, 10 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]


  • (ప్రస్తు • గత) 06:49, 10 మే 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (190 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 06:48, 10 మే 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (62 బైట్లు) (-4,628)‎ . . (త్యాగరాజు వ్యాసంలో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  • (ప్రస్తు • గత) 04:23, 4 ఫిబ్రవరి 2014‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,690 బైట్లు) (+50)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 03:37, 4 ఫిబ్రవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,640 బైట్లు) (+438)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 03:35, 4 ఫిబ్రవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,202 బైట్లు) (+137)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  • (ప్రస్తు • గత) 03:29, 4 ఫిబ్రవరి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (4,065 బైట్లు) (+4,065)‎ . . (కొత్త పేజీ: ==జననం== రీత్యాగరాజస్వామి తమిళనాడులోని తిరువ య్యారు గ్రామంలో 1...) (కృతజ్ఞత తెలుపు)


మూలాలు

[మార్చు]
  1. http://tv5news.in/2020/05/09/carnatic-musicians-demand-apology-from-kamal/
  2. https://en.wikipedia.org/wiki/Wikipedia:Neutral_point_of_view
  3. https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%A4%E0%B0%9F%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5_%E0%B0%A6%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%8B%E0%B0%A3%E0%B0%82
  4. https://www.thehindu.com/features/friday-review/music/retracing-roots-of-thyagaraja/article4339327.ece
  5. https://en.wikipedia.org/wiki/Mulukanadu_Brahmin
  6. https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95%E0%B1%8B%E0%B0%9F_%E0%B0%AF%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82
  7. https://books.google.se/books?id=ud_zjw5OLOEC&lpg=PP1&pg=PA68#v=onepage&q&f=false
  8. http://mulakanadusabhachennai.org/origin.html