Jump to content

కృతిక జయకుమార్

వికీపీడియా నుండి
కృతిక జయకుమార్
కృతిక జయకుమార్
జననం
కృతిక

ఏప్రిల్ 30, 1997
వృత్తినటి, శాస్త్రీయ నృత్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • జయకుమార్ బిఆర్ (తండ్రి)
  • పద్మిని జయకుమార్ (తల్లి)

కృతిక జయకుమార్ దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి, శాస్త్రీయ నృత్యకారిణి.[1] 2014లో వచ్చిన దృశ్యం సినిమాలోని అంజు పాత్రతో సినిమారంగంలోకి ప్రవేశించింది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

కృతిక 1997, ఏప్రిల్ 30న బిఆర్ జయకుమార్, పద్మిని దంపతులకు కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన కృతిక, మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది.

కళారంగం

[మార్చు]

ఏడేళ్ల వయస్సు నుండే భరతనాట్యం చేయడం ప్రారంభించిన కృతిక, బెంగుళూరులో గురు శ్రీ మిథున్ శ్యామ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది.

సినిమారంగం

[మార్చు]

కృతిక తిరువనంతపురంలో ఒక ప్రదర్శన ఇచ్చినపుడు, మలయాళ చిత్ర దర్శకుడు బాల కిరియాత్ చూసి సినిమారంగంలోకి రావాలని సూచించాడు. ఆ తరువాత ఆడిషన్ ద్వారా మలయాళ చిత్రం దృశ్యం తెలుగు రీమేక్ దృశ్యం సినిమాలో వెంకటేష్ కుమార్తె పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రం నటిగా మంచి గుర్తింపును ఇచ్చింది.[2]

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2014 దృశ్యం అంజు తెలుగు
2015 బాక్సర్ లక్ష్మీ కన్నడ
2015 వినవయ్య రామయ్య[3] జానకి తెలుగు
2016 రోజులు మారాయి ఆద్య
2016 ఇంట్లో దెయ్యం నాకేం భయం[4] ఇందుమతి
2019 కవచ[5] రేవతి కన్నడ
TBA సంతన దేవన్ తమిళం నిర్మాణం

మూలాలు

[మార్చు]
  1. The Times of India, Entertainment (25 March 2019). "My dream of acting with Shivarajkumar is fulfilled: Kruthika Jayakumar" (in ఇంగ్లీష్). Archived from the original on 11 మే 2019. Retrieved 30 January 2020.
  2. Rajendra, Ranjani (10 July 2014). "Films by chance". The Hindu. Archived from the original on 11 May 2015. Retrieved 30 January 2020.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (19 June 2015). "వినవయ్యా రామయ్య". www.andhrajyothy.com. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.
  4. "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
  5. The New Indian Express, Entertainment (1 April 2019). "I want to make a lasting impression with my roles: Kruthika Jayakumar". Archived from the original on 1 ఏప్రిల్ 2019. Retrieved 30 January 2020.

ఇతర లంకెలు

[మార్చు]