Jump to content

ఎక్కిరాల భరద్వాజ

వికీపీడియా నుండి
ఎక్కిరాల భరద్వాజ
జననం(1938-10-30)1938 అక్టోబరు 30
బాపట్ల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నిర్యాణము1989 ఏప్రిల్ 12(1989-04-12) (వయసు 50)
జాతీయతభారతీయుడు
గురువుషిర్డీ సాయిబాబా
వృత్తిరచయిత

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ (అక్టోబర్ 30, 1938 - ఏప్రిల్ 12, 1989) ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. విశేషించి ఆంధ్రదేశానికి షిరిడీ సాయిబాబా మాహాత్యమును పరిచయము చేసి, గురు శుశ్రూష సంప్రదాయము పట్ల సరైన అవగాహనను ఇచ్చిన వ్యక్తిగా భరద్వాజ ప్రసిద్ధుడు. దత్త సంప్రదాయమును ప్రచారం చేసారు. షిరిడీకి వచ్చే భక్తులలో అధికులు దక్షిణాది వారంటే అందులో భరద్వాజ గారి కృషి చాలా ఉంది.

జననం

[మార్చు]

ఎక్కిరాల భరద్వాజ 1938, అక్టోబర్ 30బాపట్లలో జన్మించారు. ఐ.ఎ.ఎస్.గా కొంత కాలం పనిచేసి ఆ తరువాత ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు. తన 36వ సంవత్సరాన అలివేలు మంగమ్మగారితో వివాహం జరిగింది. సాయిబాబా అను పక్ష పత్రికను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో కుల, మత, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా షిర్డీ సాయిబాబాను గూర్చి విస్తారంగా, విశేషంగా ప్రచారం చేస్తూ సత్సంగములను ఏర్పాటు చెయ్యటమే కాకుండా ఎన్నెన్నో సాయి మందిరాల నిర్మాణానికి ప్రేరణగా నిలిచారు.[1]

ఈయన ఆంగ్లసాహిత్యంలో ఉన్నత విద్య చదివారు. ఐ.ఏ.ఎస్. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. షిరిడీలో సమాధి మందిరం వద్ద కలిగిన కొన్ని ఆధ్యాత్మికానుభవాల తరువాత ఐ.ఎ.ఎస్. బాధ్యతలను వదలి ఆంగ్లభాష అధ్యాపకునిగా చేరారు. ఎక్కిరాల భరద్వాజ ఎన్నో ఆద్యాతిక మరియూ సాయితత్వ పుస్తకాలు వ్రాసినారు.

సిద్ధి చెందే సమయం (నిర్యాణం)

[మార్చు]

ఆచార్య ఎక్కిరాల భరద్వాజ 1989, ఏప్రిల్ 12న మహాసమాధి చెందారు. ఈయన సమాధి ఒంగోలు లోని సాయిమందిరంలో ఉన్నది !

నిత్యమూ వేలాదిభక్తులు ఈయన సమాధిని దర్శించుకుంటూ ఉంటారు !

ఒంగోలులోని శ్రీ మాస్టర్ యూనివర్శల్ సాయి ట్రస్టు, ఆచార్య భరధ్వాజ శాంతి ఫౌండేషన్ లు ఈయన రచనలను, సందేశాన్ని ప్రచారం చేస్తున్నది.[2]

రచనలు[3]

[మార్చు]
  • శ్రీ గురుచరిత్ర
  • శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
  • శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి
  • శ్రీ సాయి లీలామృతము
  • ఏది నిజం?
  • మతమెందుకు?
  • పురుషసూక్త రహస్యం
  • శ్రీ పాకలపాటి గురువు
  • అవధూత శ్రీ చీరాల స్వామి
  • హజరత్ తాజుద్దీన్ బాబా చరిత్ర
  • స్వామి సనర్ధ (అక్కల్ కోట స్వామి)
  • అవధూత చివటం అమ్మ
  • అవధూత శ్రీ రాఖాడీ బాబా
  • అవధూత శ్రీ పూండీ స్వామి
  • అవధుత శ్రీ శేషాద్రి స్వామి
  • పరిప్రశ్న
  • బుద్ధ ధ్యాన హృదయం

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-04-07. Retrieved 2020-04-07.
  2. "SAI SADGURU VANI". saisadguruvani.org. Archived from the original on 16 నవంబరు 2013. Retrieved 7 ఏప్రిల్ 2020.
  3. "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Archived from the original on 2018-08-14. Retrieved 2020-04-07.

బయటి లింకులు

[మార్చు]