ఉస్మానాబాద్
ఉస్మానాబాద్ | |
---|---|
ఉస్మానాబాద్ | |
Coordinates: 18°19′10″N 76°04′25″E / 18.31944°N 76.07361°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
ప్రాంతం | మరాఠ్వాడా |
జిల్లా | ఉస్మానాబాద్ |
Named for | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ |
జనాభా (2011)[1] | |
• Total | 1,12,085 |
భాషలు | |
• అధికారిక | మరాఠీ |
Time zone | UTC+05:30 (IST) |
PIN | 413501(City) |
Telephone code | (+91) 2472 |
Vehicle registration | MH-25 |
ఉస్మానాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని ఉస్మానాబాద్ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాలోని తుల్జాపూర్ లో కల తుల్జాభవానీ మాత భారతదేశమంతటా ప్రసిద్ధి చెందింది. జిల్లా విస్తీర్ణం 7512.4 చదరపు కి.మీలు అందులో 241.4 చ.కి.మీల మేరకు పట్టణప్రాంతాలు ఉన్నాయి. 2001 జనగణన ప్రకారం జిల్లా మొత్తం జనాభా 14,86,586. అందులో 15.69% పట్టణాలలో నివసిస్తున్నారు [1]
ఉనికి
[మార్చు]ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం దక్షిణభాగంలో ఉంది. దక్కన్ పీఠభూమిలో భాగమైన ఈ జిల్లా సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తున ఉంది. మంజీరా , తెర్నా నదులు జిల్లాగుండా కొంతభాగం ప్రవహిస్తున్నాయి. జిల్లా మరాఠ్వాడా ప్రాంతానికి తూర్పున 17.35 నుండి 18.40 డిగ్రీల ఉత్తర రేఖాంశాలు , 75.16 నుండి 76.40 డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
శీతోష్ణస్థితి
[మార్చు]వర్షాకాలం జూన్ మధ్యనుండి ప్రారంభమై సెప్టెంబరు నెల చివరివరకు కొనసాగుతుంది. అక్టోబరు , నవంబరు నెలల్లో వాతావరణం తేమగాను, నవంబరు మధ్యనుండి జనవరి వరకు చల్లగా, పొడిగా ఉంటుంది. ఫిబ్రవరి నుండి జూన్ వరకు పొడిగా ఉండి, ఉష్ణోగ్రత పెరుగుతూపోతుంది. వేసవిలో ఉస్మానాబాద్ జిల్లాలో మరాఠ్వాడా ప్రాంతంలోని ఇతర జిల్లాలతో పోల్చితే ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సాలీనా సగటు వర్షపాతం 730 మిమీలు.
తాలూకాలు
[మార్చు]ఉస్మానాబాద్ జిల్లాలో ఎనిమిది తాలూకాలు ఉన్నాయి. అవి
పరందా చారిత్రక స్థలము. ఇక్కడి పరందా కోట ప్రసిద్ధి చెందినది. మంజీరా నది ఒడ్డున ఉన్న కల్లంబ్ జిల్లాలో ప్రముఖ వ్యాపారకేంద్రము. కల్లంబ్ నుండి 20 కిలోమీటర్ల దూరములో ఉన్న యెర్మలలో యేదేశ్వరి దేవి ఆలయం ఉంది.
తుల్జాపూరు ప్రముఖ తాలూకా కేంద్రం. ఇది షోలాపూర్ నుండి 30 కి.మీలు, ఉస్మానాబాద్ నుండి 25 కి.మీలు , హైదరాబాదు రహదారిపై ఉన్న నల్‌దుర్గ నుండి 40 కి.మీల దూరములో ఉంది. తుల్జాపూర్ తుల్జా భవానీ మందిరం వల్ల ప్రసిద్ధికెక్కింది. తుల్జాభవానీ ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని ఇచ్చిందని చెబుతారు. శివాజీ కొడుకు శంభాజీ ఈ ఆలయాన్ని పునర్ణిర్మించాడు.
ఒమెర్గా ఉస్మానాబాద్ జిల్లాలో అత్యంత జనసాంద్రత కలిగిన తాలూకా.
మూలాలు
[మార్చు]- ↑ "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). censusindia.gov.in.