Jump to content

ఉప్పల గోపాలరావు

వికీపీడియా నుండి
ఉప్పల గోపాలరావు
జననంఉప్పల గోపాలరావు
1936, మార్చి 1
గుంటూరు జిల్లా పొన్నూరుమండలం బ్రాహ్మణ కోడూరు గ్రామం
వృత్తిసంఘసేవకుడు, సామాజిక కార్యకర్త, రచయిత
మతంహిందూ
భార్య / భర్తసరోజినీదేవి

ఉప్పల గోపాలరావు ఒక సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు. ప్రజా ఆలోచనా వేదిక వ్యవస్థాపకుడు. సంఘసేవకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఉప్పల గోపాలరావు గుంటూరు జిల్లా పొన్నూరుమండలం బ్రాహ్మణ కోడూరు గ్రామంలో 1936, మార్చి 1న జన్మించాడు. ఇతడు ఇంటర్‌మీడియట్ వరకు చదువుకున్నాడు. కొన్నాళ్ళు రెవెన్యూశాఖలో పనిచేశాడు. తరువాత నల్లగొండజిల్లా మిర్యాలగూడ పట్టణంలో రైస్ మిల్లు ప్రారంభించి అక్కడ స్థిరపడ్డాడు. ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నాడు.

ఇతడు చిన్ననాటి నుండే వ్యవసాయ కార్మిక సంఘాలతో, రైతు సంఘాలతో, విద్యార్థి సంఘాలతో, హేతువాద సంఘాలతో సంబంధాలు కలిగి ఉండి ఆయా ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రజా ఆలోచనావేదికను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో చైతన్యాన్ని పెంపొందించాడు. వయోవృద్ధులకోసం సీనియర్ సిటజన్ సంఘాలను స్థాపించి వారిలో ఇంకా జీవించాలనే ఆశలను రేకెత్తించే కార్యక్రమాలను చేపట్టాడు.

సంస్థలు

[మార్చు]

ఇతడు స్థాపించిన కొన్ని సామాజిక సంస్థలు:

  • ప్రజా ఆలోచనా వేదిక (1976)
  • భాగ్యనగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ (1996)
  • ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్స్ (FESCO) (2002)
  • సోషియల్ ఆడిట్ కౌన్సిల్ ఆన్ ఇన్ఫర్మేషన్ రైట్ (SACIR) (2005)
  • యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ (U-FERWAS) (2007)
  • గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ (2007)
  • తెలంగాణా యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ (2016)
  • ఎల్డర్లీ ఓల్డ్ (80 సం. & ఆ పైన) సిటిజన్స్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ (2020)

ప్రజా ఆలోచనా వేదిక

[మార్చు]

ఉప్పల గోపాలరావు 1976లో హైదరాబాదుకు మకాం మార్చినప్పుడు తన ఆశయాలకు కార్యరూపం దాల్చడానికి ప్రజా ఆలోచనా వేదిక అనే సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ "ప్రజలు - పార్టీలు - ప్రభుత్వాలు - సామాజిక భవిష్యత్తు", "ప్రజలు - పాలన - రాజకీయాలు", "పోలీసులు - ప్రజలు", "ఫ్లాట్స్‌లో నివాస సంస్కృతి", "ట్రాఫిక్ సమస్యలు", "ఆర్టీసీ ప్రయాణీకుల సమస్యలు", "సమాజం - సాహిత్యం", "సమాజంపై మీడియా ప్రభావం, పాత్ర", "రాజ్యం - రాజ్యాంగం - చట్టబద్ధమైన పాలన", "పెద్ద నోట్ల రద్దు - నగదు రహిత లావాదేవీలు", "సుపరిపాలన - సమాచార హక్కు - ప్రజల పాత్ర" మొదలైన అనేక విషయాలపై వందల సంఖ్యలో సదస్సులు, సమావేశాలు, చర్చాగోష్టులు ఏర్పాటు చేసింది. లవణం, జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ హరగోపాల్, చొక్కారావు, రోశయ్య, కాసాని నారాయణ, మండవ వెంకటేశ్వర రావు, కాళోజీ, వేములపల్లి శ్రీకృష్ణ, హెచ్.జె.దొర, గజ్జెల మల్లారెడ్డి, జ్వాలాముఖి, వావిలాల గోపాలకృష్ణయ్య, బి. సుభాషణ్ రెడ్డి, కత్తి పద్మారావు, వాడ్రేవు చినవీరభద్రుడు, మాడభూషి శ్రీధర్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ప్రసంగాలను ఏర్పాటు చేసింది. ఈ వేదిక దాసరి అనసూయమ్మ పేరుతో ఒక అవార్డును ఏర్పాటు చేసి సంఘసేవలో కృషి చేస్తున్న స్త్రీలకు ప్రదానం చేస్తూవుంది. ఈ అవార్డును స్వీకరించిన వారిలో మల్లాది సుబ్బమ్మ, ఎన్.సులోచన, ఉషగిరి లక్ష్మమ్మ, మోటూరు ఉదయం మొదలైనవారు ఉన్నారు.[1]

రచనలు

[మార్చు]
  1. నా మాటల మూట[2]
  2. ఒక సామాజిక స్పృహగల కార్యకర్త ఆలోచనలు, అభిప్రాయాలు, కార్యక్రమాలు[1]
  3. ఆలోచన - ఆవేదన [3]
  4. ఓ అక్రమార్జనా! [4]
అముద్రిత రచనలు
  1. ఓ ఉన్నవాడా
  2. నేను పిచ్చివాడిని కాను
  3. ఓ టైమా
  4. నాకు తట్టిందీ ఆలోచన
  5. డబ్బు పిచ్చి
  6. ప్రజలు - పార్టీలు - ప్రభుత్వాలు
  7. ఓ మధ్యతరగతి మనిషి
  8. భయం
  9. విప్లవం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "ఒక సామాజిక స్పృహగల కార్యకర్త ఆలోచనలు, అభిప్రాయాలు, కార్యక్రమాలు" (PDF). లోహియాటుడే. Retrieved 9 October 2023.
  2. వెబ్ మాస్టర్. "నా మాటల మూట" (PDF). లోహియాటుడే. Retrieved 9 October 2023.
  3. వెబ్ మాస్టర్. "ఆలోచన-ఆవేదన" (PDF). లోహియాటుడే. Retrieved 9 October 2023.
  4. వెబ్ మాస్టర్. "ఓ అక్రమార్జనా!" (PDF). లోహియాటుడే. Retrieved 9 October 2023.