ఇషికారి నది
43°28′49″N 141°52′10″E / 43.48028°N 141.86944°E
ఇషికారి నది (ఇషికారి-గవా) | |
石狩川 | |
నది | |
ఇషికారి నది
| |
పేరు వ్యుత్పత్తి: "Winding (River)" in Ainu | |
దేశం | జపాన్ |
---|---|
రాష్ట్రం | హోక్కయిడో |
Source | ఇషికారి పర్వతం |
Mouth | జపాన్ సముద్రం |
- ఎత్తు | 0 m (0 ft) |
పొడవు | 268 km (167 mi) |
పరివాహక ప్రాంతం | 14,330 km2 (5,533 sq mi) |
Discharge | |
- సరాసరి | 468 m3/s (16,527 cu ft/s) |
ఇషికారి నది (石狩川 Ishikari-gawa) జపాన్ దేశపు అతి పొడవైన నదులలో మూడవది. హోక్కయిడో దీవిలో అతి పొడవైన ఈ నది 268 కి.మీ. దూరం ప్రవహిస్తుంది.[1] ఈ నది యొక్క పరీవాహక ప్రాంతం 14,330 చదరపు కి.మీ. విస్తీర్ణంతో జపాన్ దేశంలో రెండవ అతిపెద్ద నదీపరీవాహకప్రాంతంగా ఉంది.[1] సంవత్సరానికి 14.8 ఘనపు కిలోమీటర్ల నదీ జలాలను డిశ్చార్జ్ చేస్తున్న ఈ నది జపాన్‌లో ప్రథమ స్థానంలో ఉంది.
ఉనికి
[మార్చు]హోక్కయిడో దీవి మధ్యభాగంలో గల దైసెట్సుజాన్ అగ్నిపర్వత సముదాయంలోని ఇషికారి పర్వతం (1980 మీటర్ల ఎత్తు) వద్ద పుట్టి అసాహికవా (Asahikawa), టకికవా (Takikawa), సప్పోరో (Sapporo) మొదలగు నగరాల గుండా ప్రవహిస్తూ జపాన్ సముద్రంలో కలుస్తుంది. సుమారు 40,000 సంవత్సరాల క్రితం ఈ నది తూర్పున వున్న టోమాకొమై (Tomakomai) వద్ద పసిఫిక్ మహా సముద్రంలో కలిసేది. అయితే షికోజు (Shikotsu) అగ్ని పర్వతాల నుండి వెదజల్లబడిన లావా, ఈ నదీ ప్రవాహా మార్గానికి అడ్డుపడటం వలన, ఈ నదీ ప్రవాహం పశ్చిమదిశలో వున్న జపాన్ సముద్రంలోనికి మళ్ళించబడింది.
ఉపనదీ వ్యవస్థ
[మార్చు]ఇషికారి నదికి గల ఉపనదులలో షిబెజు, ఉర్యు, సోరాచి, టోయోహిరా నదులు ప్రధానమైనవి.
- షిబెజు నది (Chubetsu) : 78 కి.మీ. పొడవున ప్రవహించే ఈ ఉపనదిపై షిబెజు వద్ద ఒక ఆనకట్ట (Dam) ను నిర్మించారు. ఈ నది అసాహికవా నగరం వద్ద ఇషికారి నదిలో కలుస్తుంది.
- ఉర్యు నది (Uryu) : ఈ ఉపనదిపై రెండు డామ్ లు నిర్మించారు. సెకనుకు 30.7 ఘనపు మీటర్లు చొప్పున ఈ ఉపనదీ జలాలు డిశ్చార్జ్ అవుతున్నాయి. ఇది ఉర్యు పట్టణం వద్ద ఇషికారి నదిలో కలుస్తుంది.
- సోరాచి నది (Sorachi) : ఈ ఉపనదీ జలాలు సెకనుకు 60.7 ఘనపు మీటర్లు రేటుతో డిశ్చార్జ్ అవుతున్నాయి.ఈ ఉపనది టకిగవా (Takigawa) వద్ద ఇషికారి నదిలో కలుస్తుంది.
- టోయోహిరా నది (Toyohira) : 72.5 కి.మీ. దూరం ప్రవహింఛి జపాన్ సముద్రంలో కలియడానికి ముందుగా సప్పోరో నగరం వద్ద ఇషికారి నదిలో సంగమిస్తుంది. ఈ ఉపనది ప్రధానంగా సప్పోరా నగరానికి మంచినీటిని సరఫరా చేస్తుంది.
- చిటోసె నది (Chitose) : షికోజు సరస్సు (Shikotsu Lake) నుంచి పుట్టిన ఈ ఉపనది ఇబెట్సు (Ebetsu) నగరం మధ్య గుండా ప్రవహిస్తూ ఇషికారి నదిలో కలుస్తుంది.
- యుబారి నది (Yubari) : ఈ నది ఇబెట్సు నగర పొలిమేరలలో ఇషికారి నదిలో కలుస్తుంది.
ఉపనది పేరు | పొడవు (కి.మీ.) | ఉపనదీ పరీవాహక ప్రాంత విస్తీర్ణం (చ.కి.మీ.) |
---|---|---|
షిబెజు నది (Chubetsu) | 78 | 1,063 |
ఉర్యు నది (Uryu) | …. | 1,673 |
సోరాచి నది (Sorachi) | …. | 2,618 |
టోయోహిరా నది (Toyohira) | 72.5 | 959 |
చిటోసె నది (Chitose) | 108 | 1,244 |
యుబారి నది (Yubari) | 136 | 1,464 |
నదీతీర పట్టణాలు
[మార్చు]ఇషికారి నది తీరంలో నెలకొన్న పట్టణ/నగర ప్రాంతాలు
- కామికవా (Kamikawa) :
- ఐబెట్సు (Aibetsu) :
- అసాహికవా (Asahikawa) : హోక్కయిడో దీవిలో రెండవ అతి పెద్ద నగరం.
- ఫుకగవా (Fukagawa) : ఈ ప్రాంతం వరి పంట పొలాలకు, ఆపిల్, చెర్రీ పళ్ళ తోటలకు ప్రసిద్ధి.
- టకికవా (Takikawa) : ఈ నగరం ఇషికారి నదికి సోరాచి నదీ సంగమ ప్రాంతంలో ఉంది.
- ఇబెట్సు (Ebetsu) :
- సప్పోరో (Sapporo) : హోక్కయిడో దీవిలో అతి పెద్ద నగరం. ఈ నగరంలో ప్రవహించిన తరువాత ఈ నది ఇషికారి అఖాతంలో (జపాన్ సముద్రం) కలిసిపోతుంది.
నదీ జలప్రవాహం-వరదలు
[మార్చు]స్థానిక భాష ఐను (Ainu) లో ఈ నది పేరుకు మెలికలు తిరగడం అనే అర్ధం ఉంది. ఈ అర్ధానికి తగినట్లుగానే ఈ నది ఒకప్పుడు మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూ నదీ వక్రతలు (Meanders) ఏర్పరిచేది. అందువల్ల జపాన్‌లో అతి పొడవైన నది 'సినానో'కు సమానమైన దూరంతో ప్రవహించేది. అయితే కాలక్రమంలో భారీ నిర్మాణాల కారణంగా ఈ నదీ ప్రవాహ దూరం 100 కిలోమీటర్ల మేరకు కుదించబడింది. ఫలితంగా ఈ నది ఇషికారి మైదానంలో అనేక ఆక్స్‌బౌ సరస్సులను (Oxbow Lakes) ఏర్పరిచింది.
సాధారణంగా ఇషికారి నదికి సంవత్సరంలో రెండుసార్లు వరదలు వస్తాయి. ఈ నదికి వర్షపాతం వలన వేసవికాలంలోను, కరిగిన మంచు వల్ల వసంతకాలంలోను వరదలు సంభవిస్తాయి.
- వేసవి వరదలు: టైఫూన్‌ల కారణంగా వేసవికాలంలో ఆకస్మికంగా కురిసే కుండపోత వర్షాల వల్ల ఈ నదికి వరదలు సంభవిస్తాయి. వేసవిలో వచ్చే ఈ ఆకస్మిక వరదలు కొద్ది కాలం మాత్రమే ఉన్నప్పటికి ఉదృతంగా వుంటాయి. ఈ వరదలలో ఇసుక, గ్రావెల్‌లు కొట్టుకొనివస్తాయి.
- వసంతకాలపు వరదలు: హోక్కయిడో దీవిలో శీతాకాలంలో భారీగా పేరుకుపోయిన మంచు వసంతకాలంలో కరగడం ప్రారంభం అవుతుంది. కరుగుతున్న మంచు కారణంగా ఇషికారి నదిలో క్రమేణా నీటి ప్రవాహం పెరిగి వసంతకాలంలో వరదలకు దారితీస్తాయి. ఈ రకమైన వరదలు నిదానంగానే వచ్చినప్పటికీ ఎక్కువకాలం వుంటాయి. కరుగుతున్న మంచు నేల ఉపరితలాన్ని క్రమక్షయం చేయడం వల్ల వరద నీటితో పాటు సిల్ట్ (Silt) ఎక్కువగా కొట్టుకొనివస్తుంది. ఈ రకమైన వరదలలో ప్రవాహ నీటి డిశ్చార్జ్ చాలా ఎక్కువగా వుంటుంది. సాధారణ పరిస్థితిలో ఈ నదిలో సగటు నీటి ప్రవాహం 520 ఘనపు మీటర్లు/సెకెన్ చొప్పున విడుదలవుతుంటే వరదల సమయంలో ఇది గరిష్ఠంగా 4,482 ఘనపు మీటర్లు/సెకెన్ వరకు ఉదృతంగా వుంటుంది.[1]
చిత్రమాలిక
[మార్చు]-
ఇషికారి పర్వతం
-
శీతాకాలంలో మంచుతో ఆవరించబడిన ఇషికారి నది (సప్పోరోలో తీసిన చిత్రం)
-
ఇషికారి నది (షింటోసుకవా నుండి తీసిన చిత్రం)
-
అసాహికవా నగరం వద్ద షిబెజు ఉపనది
-
చిటోసె ఉపనది
-
యుబారి ఉపనది
వెలుపలి లింకులు
[మార్చు]- Ishikari-gawa - Britannica
- "Table Major Rivers in Japan". Ministry of Land, Infrastructure. Transport and Tourism, Japan. Retrieved 3 December 2017.
- Oya, Masahiyo. Applied Geomorphology for Mitigation of Natural Hazards (2001 ed.). Kluwer Academic Publishers. ISBN 0-7923-6719-7.