Jump to content

అమ్జద్ హైదరాబాదీ

వికీపీడియా నుండి
అమ్జద్ హైదరాబాదీ
పుట్టిన తేదీ, స్థలంఅమ్జద్ హుస్సేన్
(1888-01-01)1888 జనవరి 1
హైదరాబాదు, తెలంగాణ
మరణం1961 జనవరి 31(1961-01-31) (వయసు 73)
హైదరాబాదు, తెలంగాణ
వృత్తిఉర్దూ, పర్షియన్ రుబాయి కవి
కాలంనిజాం
రచనా రంగంరుబాయి
విషయంమానవత్వం, తాత్వికత

అమ్జద్ హైదరాబాదీ (అమ్జద్ హుస్సేన్, 1 జనవరి 1888- 31 జనవరి 1961), తెలంగాణకు చెందిన ఉర్దూ, పర్షియన్ రుబాయి కవి. ఉర్దూ కవిత్వంలో అతడిని హకీమ్-అల్-షువారా అని కూడా అంటారు.[1] ఇతని కలంపేరు అమ్జద్ హైదరాబాదీ.

జననం

[మార్చు]

అమ్జద్ హైదరాబాదీ 1888, జనవరి 1న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు దక్కన్‌లోని ఒక చిన్న కుటుంబంలో జన్మించాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

హైదరాబాదు నిజాం పాలనకాలంలో 1908, సెప్టెంబరు 28న మూసీ నదికి వరదలు వచ్చాయి. చింతచెట్టు కొమ్మలకు వేలాడుతూ ప్రాణాలు దక్కించుకున్న 150 మందిలో అమ్జద్ ఒకడు. 1908లో మూసీ నది వరదలో తన కుటుంబం (అమ్జద్ తల్లి, భార్య, కుమార్తె) కొట్టుకుపోగా, అతని కుటుంబంలో అతను మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. తరువాత తన బాధను అనుభవాన్ని వివరిస్తూ "ఖయామత్-ఎ-సోఘ్రా" (ది మైనర్ డూమ్స్‌డే) అనే పద్యం రాశాడు. అమ్జద్ రాసిన రుబాయిలో ఎక్కువభాగం అతని కుటుంబాన్ని కోల్పోయిన నిరాశ ప్రతిబింబిస్తుంది.[2] ఆ విషాద సంఘటన 100వ వార్షికోత్సవం జ్ఞాపకార్థంగా, సత్యనారాయణ డానిష్ ఆ పద్యాన్ని చదివాడు.[2][3]

అమ్జద్ రాసిన కవితలను వివిధ దేశాలలోని జరిగిన ఖవ్వాలీ కార్యక్రమాలలో వార్సీ బ్రదర్స్ కు చెందిన భారతీయ ఖవ్వాలి సంగీత బృందం క్రమం తప్పకుండా పఠించేవారు.[4]

అమ్జద్ హైదరాబాదీ ఉర్దూ పుస్తకాలు 

[మార్చు]
  • రుబయత్ అమ్జద్ హైదరాబాదీ
  • అదాబి ఇజ్లాస్ వో ముషేరా

అమ్జద్ హైదరాబాదీపై పుస్తకాలు

[మార్చు]
  • హకీమ్ అల్ షురా అమ్జద్ హైదరాబాదీ[5]
  • మాస్టర్ పీసేస్ ఆఫ్ ఉర్దూ రుబాయత్ (రచన:కెసి కందా)[6]

మరణం

[మార్చు]

ఇతడు 1961, జనవరి 31న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Nawab Bahadur Yar Jang – BAHADUR YAR JANG ACADEMY" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2011-02-01. Retrieved 2021-08-19.
  2. 2.0 2.1 http://www.twocircles.net/2008sep28/hyderabad_marks_100th_anniversary_great_musi_floods.html
  3. "Hyderabad observes 100th anniversary of Musi flood". www.rediff.com. Retrieved 2021-08-19.
  4. "आ आ इधर आ, फिर माँग, फिर माँग (क़व्वाली) - aa aa idhar aa, phir maa.Ng, phir maa.Ng (qavvaalii) / गैर फिल्म-(Non-Film)". lyricsindia.net. Retrieved 2021-08-19.
  5. "Amjad Hyderabadi – BAHADUR YAR JANG ACADEMY" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-19. Retrieved 2021-08-19.
  6. Kanda, K. C. (1996-01-01). Urdu Rubaiyat (in ఇంగ్లీష్). Sterling Publishers Pvt., Limited. ISBN 978-81-207-1827-2.