Jump to content

అమెరికా అంతర్యుద్ధం

వికీపీడియా నుండి
అంతర్యుద్ధ దృశ్యాలు

అమెరికా అంతర్యుద్ధం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఐక్యత కోసం 1861 నుంచి 1865 దాకా సాగిన ఒక పౌర యుద్ధం. 1860 లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన అమెరికాలో ఉన్న అన్ని ప్రాంతాలలో బానిసత్వాన్ని రద్దు చేయాలని భావించాడు. రిపబ్లికన్లు ఉత్తర ప్రాంతంలో ప్రాభల్యం ఉన్నవారు కాబట్టి ఆ రాష్ట్రాలు దీనికి అంగీకరించారు. కానీ జనవరి 1861 లో అమెరికాలో అప్పటిదాకా ఉన్న 34 రాష్ట్రాల్లో దక్షిణ ప్రాంతంలోని బానిసత్వాన్ని తప్పుగా భావించని ఏడు రాష్ట్రాలు తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకుని కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గా ఏర్పడ్డాయి. అవి ఏప్రిల్ 1861న ఆ రాష్ట్రాలు అమెరికా కోటను ముట్టడించాయి. చివరికి గెలవలేక 1865 లో తమ సేనలతో సహా లొంగిపోయాయి.

ఈ యుద్ధం యొక్క మూలాలు అప్పటి అమెరికాలో అమల్లో ఉన్న బానిసత్వంలో ఉన్నాయి. కాన్ఫెడరసీ అనబడే దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాభల్యాన్ని పదకొండు రాష్ట్రాల దాకా విస్తరించుకున్నాయి. దౌత్యపరంగా మరేదేశాలు దీనిని అధికారికంగా గుర్తించలేదు. బానిసత్వం అమల్లో ఉన్నప్పటికీ సరిహద్దులోని కొన్ని రాష్ట్రాలు దానిని రద్దు చేయడాన్ని సమర్ధిస్తూ కేంద్రప్రభుత్వానికి తమ మద్ధతు ప్రకటించాయి.

సుమారు నాలుగేళ్ళపాటు జరిగిన ఈ సుదీర్ఘ యుద్ధంలో సుమారు 750,000 మంది సైనికులు మరణించారు. ఈ యుద్ధ ఫలితంగా దక్షిణ ప్రాంతంలో ఉండే ప్రాథమిక సౌకర్యాలన్నీ ధ్వంసమయ్యాయి. కాన్ఫడరసీ కూలిపోయింది. దేశమంతటా బానిసత్వం రద్దు చేయబడింది. దేశం పునర్నిర్మాణం ప్రారంభమైంది. దేశ సార్వభౌమత్వం పెంచేందుకు కేంద్రప్రభుత్వం పటిష్ఠం కావడం ఆరంభమైంది. బానిసత్వం నుండి బయటిపడ్డ వారికి కొన్ని హక్కులు ఏర్పరచబడ్డాయి.

చరిత్ర

[మార్చు]

1860 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల నాయకుడు అబ్రహం లింకన్ ఆధ్వర్యంలో అమెరికాలోని అన్ని భూభాగాల్లోనూ బానిసత్వం రద్దు చేయాలని తీర్మానించారు. ఈ పరిణామం కొన్ని దక్షిణాది రాష్ట్రాలకు రుచించలేదు. వారు బానిసత్వాన్ని నిర్మూలించడం అంటే రాజ్యాంగం హక్కుల ఉల్లంఘనగా భావించారు. ఉత్తరాదిన ప్రాభల్యంలో ఉన్న రిపబ్లికన్లు ఎన్నికల్లో ముందంజ వేసి లింకన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ లింకన్ ప్రమాణ స్వీకారానికి మునుపే ప్రత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన ఏడు రాష్ట్రాలు ఒక జట్టు గా (కాన్ఫెడరసీ) ఏర్పడ్డాయి. వాటిలో ఆరు రాష్ట్రాల జనాభాలో బానిసల జనాభా 48.8 శాతం.[1]

మూలాలు

[మార్చు]