Jump to content

అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 18°56′51″N 79°05′38″E / 18.9475°N 79.094°E / 18.9475; 79.094
వికీపీడియా నుండి
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం is located in Telangana
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
తెలంగాణ లో దేవాలయ ఉనికి
భౌగోళికాంశాలు :18°56′51″N 79°05′38″E / 18.9475°N 79.094°E / 18.9475; 79.094
పేరు
ప్రధాన పేరు :అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జగిత్యాల జిల్లా
ప్రదేశం:ధర్మపురి మండలం
ఇతిహాసం
సృష్టికర్త:అక్కపెల్లి

అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలో ఉన్న ఆలయం. సా.శ. 15వ శతాబ్దంలో అక్కపెల్లి అనే వ్యక్తి ఈ ఆలయాన్ని నిర్మించడంతో, ఆయన పేరుమీద అక్కపెల్లి రాజరాజేశ్వరస్వామి దేవాలయంగా పిలువబడుతుంది.[1]

చరిత్ర

[మార్చు]

ధర్మపురి క్షేత్రానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ఉండేది. ఆ సమయంలో శ్రీరామభద్రస్వామి ఈ ప్రాంతానికి వచ్చి అక్కడి గ్రామస్తులకు తాత్కాలికంగా విడిదిని ఏర్పాటుచేశాడనీ, ఇక్కడ స్థిరపడిన బ్రాహ్మణులు ఆయన కోరికమేరకు రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ సమీపంలో బావిలో దొరికిన శాసనం ద్వారా తెలిసిందని చరిత్రకారులు చెబుతున్నారు.

సా.శ. 15వ శతాబ్దంలో అక్కపెల్లి అనే దాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. కొంతకాలం తరువాత శివలింగం (సాలగ్రామ) రూపంలోని రాజరాజేశ్వరస్వామిని ప్రతిష్ఠించారు.

ఉత్సవాలు

[మార్చు]

శివరాత్రి

[మార్చు]

మహాశివరాత్రి సందర్భంగా ఉదయం రుద్రాభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు గోధూళి సుముహూర్తంలో స్వామివారికి కల్యాణోత్సవం, మరుసటిరోజు రథోత్సవం, అన్నపూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచి ఎడ్లబండ్లు, ఇతర వాహనాల్లో భక్తులు వస్తారు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, రాజన్న సిరిసిల్ల జిల్లా (4 March 2019). "అడవిలో ఆది దేవుడు". Archived from the original on 4 March 2019. Retrieved 6 March 2019.