Jump to content

1688

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

1688 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1685 1686 1687 - 1688 - 1689 1690 1691
దశాబ్దాలు: 1660లు 1670లు - 1680లు - 1690లు 1700లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు

చెన్నై మునిసిపల్ కార్పొరేషను భవనం
  • మే 17: అయుత్తాయ రాజు నరై అరెస్టు ఒక తిరుగుబాటుకు దారితీసింది.
  • జూన్ 5: కాన్స్టాంటైన్ ఫాల్కన్ అరెస్టు; తరువాత అతన్ని శిరచ్ఛేదం చేస్తారు.
  • జూన్ 10: లండన్లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్లో ఇంగ్లాండ్ జేమ్స్ II, అతని కాథలిక్ భార్య మేరీ ఆఫ్ మోడెనాలకు కుమారుడు, వారసుడు జేమ్స్ ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ స్టూవర్ట్ (తరువాత ఓల్డ్ ప్రెటెండర్ అని పిలుస్తారు) పుట్టాడు. ఆ శిశువును కాథలిక్ విశ్వాసంలోకి బాప్తిస్మం తీసుకున్నప్పుడు, కాథలిక్ రాజవంశం పట్ల ప్రజలకున్న ఆగ్రహం పెరుగుతుంది.
  • జూన్ 24: సియామీల దాడుల తరువాత, చెవాలియర్ డి బ్యూరెగార్డ్ నేతృత్వంలోని ఫ్రెంచ్ దళాలు మెర్గుయి వద్ద తమ స్థావరాన్ని విడిచిపెట్టాయి. ఇది చివరికి వారు దేశం నుండి వైదొలగడానికి దారితీసింది.
  • సెప్టెంబరు 29: మద్రాసు మునిసిపల్ కార్పొరేషను ఏర్పాటైంది.
  • నవంబర్ 15: ఇంగ్లాండులో గ్లోరియస్ విప్లవం ప్రారంభమైంది: 15,000 కిరాయి సైనికుల బహుళజాతి శక్తితో ఆరెంజ్ విలియం ఇంగ్లండ్లోని టోర్బే వద్దకు చేరాడు. తనకు బ్రిటీష్ కిరీటం అక్కర్లేదని, తాను ప్రొటెస్టాంటిజాన్ని కాపాడటానికీ, ఆంగ్ల స్వేచ్ఛను కాపాడటానికీ మాత్రమే వచ్చానని చెప్పి, లండన్ పై దాడికి కవాతు ప్రారంభించాడు .
  • నవంబర్ 19: న్యాయాధికారులు నగరం నుండి పారిపోయిన తరువాత ఆరెంజ్ విలియం ఎక్సెటర్‌ను వశం చేసుకున్నాడు.
  • నవంబర్ 26: ఆరెంజ్ విలియం ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టినట్లు విన్న లూయిస్ XIV నెదర్లాండ్స్‌పై యుద్ధం ప్రకటించాడు. కానీ అతను నెదర్లాండ్స్‌పై దాడి చేయకుండా, పవిత్ర రోమన్ సామ్రాజ్యపు ఆయువుపట్టుపై 1,00,000 మంది సైనికులతో దాడి చేసాడు. ఐరోపా, అమెరికాలో తొమ్మిది సంవత్సరాల యుద్ధం ప్రారంభమవుతుంది.
  • డిసెంబర్ 18: ఆరెంజ్ విలియం లండన్లోకి ప్రవేశించాడు.

జననాలు

  • మే 21: అలెగ్జాండర్ పోప్ పద్దెనిమిదవ-శతాబ్దానికి చెందిన ఆంగ్ల కవి, తన వ్యంగ్య పద్యాలకు, తన హోమెర్ అనువాదాలకు మంచి గుర్తింపు పొందాడు. (మ.1744)

మరణాలు

పురస్కారాలు