తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Friday Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

OTT Friday Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

Hari Prasad S HT Telugu

31 October 2024, 17:57 IST

google News
    • OTT Friday Releases: ఓటీటీల్లోకి మరికొన్ని గంటల్లో కొన్ని సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో చూడొచ్చు. ఈ దీపావళి వీకెండ్ వీటితో మంచి టైంపాస్ అని చెప్పొచ్చు.
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న సూపర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. మిస్ కావద్దు

OTT Friday Releases: ఓటీటీల్లోకి ప్రతి శుక్రవారం లాగే ఈవారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. అయితే ఈసారి దీపావళి పండగ ఉండటంతో ఒక రోజు ముందే అంటే గురువారమే (అక్టోబర్ 31) పెద్ద సంఖ్యలో మూవీస్, వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి శుక్రవారం (నవంబర్ 1) ఓటీటీల్లోకి రాబోతున్న ఆ సినిమాలు, వెబ్ సిరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రైడే ఓటీటీ రిలీజెస్

కిష్కింధ కాండం - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

ఈ శుక్రవారం (నవంబర్ 1) ఓటీటీలోకి వస్తున్న మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కిష్కింధ కాండం. ఈ సినిమాను దింజిత్ అయ్యతన్ డైరెక్ట్ చేశాడు. ఆసిఫ్ అలీ, విజయరాఘవన్, అపర్ణ బాలమురళీలాంటి వాళ్లు నటించిన ఈ కిష్కింధ కాండం మూవీ.. కోతులు ఎక్కువగా ఉండే కల్లేపతి రిజర్వ్ ఫారెస్ట్ లో సాగుతుంది.

ఓ గన్ మిస్ అవడం అనే పాయింట్ మీద సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మలయాళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతోంది.

మిథ్య సీజన్ 2 - జీ5 ఓటీటీ

సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్య ఇప్పుడు రెండో సీజన్ తో రానుంది. ఈ సిరీస్ కూడా శుక్రవారం (నవంబర్ 1) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హుమా ఖురేషీ, అవంతికా దాసానీ, పరంబ్రతా ఛటర్జీలాంటి వాళ్లు నటించిన ఈ మిథ్య వెబ్ సిరీస్ తొలి సీజన్ సక్సెస్ అయిన నేపథ్యంలో రెండో సీజన్ పై ఆసక్తి నెలకొంది. తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.

బార్బీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ చేజ్ - నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి శుక్రవారం బార్సీ మిస్టరీస్: ది గ్రేట్ హార్స్ చేజ్ అనే కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. ఇదొక థ్రిల్లింగ్ అడ్వెంచరస్ సిరీస్. మాలిబు, బ్రూక్లిన్ అనే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తగినంత సస్పెన్స్, మిస్టరీతో మంచి ఎక్సైట్‌మెంట్ అందించే వెబ్ సిరీస్ ఇది.

ఇవే కాకుండా ఇప్పటికే అంటే ఈ వారంలో గురువారం (అక్టోబర్ 31) వరకు ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్, వెబ్ సిరీస్ లలోనూ కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి. వాటిని కూడా వీకెండ్ లో చూడొచ్చు.

తంగలాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం) - నెట్‌ఫ్లిక్స్

లబ్బర్ పందు (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా) - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

లవ్ మాక్‌టైల్ 2 (తెలుగు డబ్బింగ్ కన్నడ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ

అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ

అగాథోకాకోలాజికల్ (మలయాళ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ

అపోకలిప్స్ జడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ (ఇంగ్లీష్ సినిమా)- అమెజాన్ ప్రైమ్ వీడియో

ది వైల్డ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ క్రైమ్ యాక్షన్ మూవీ)- జియో సినిమా ఓటీటీ

తదుపరి వ్యాసం