1995
Jump to navigation
Jump to search
1995 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1992 1993 1994 1995 1996 1997 1991 |
దశాబ్దాలు: | 1970లు 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: ఆస్ట్రియా, ఫిన్లాండ్, స్వీడన్లు యూరోపియన్ యూనియన్‌లో ప్రవేశించాయి.
- జనవరి 1: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
- జనవరి 9: వాలెరీ పొల్యకొవ్ రోదసిలో 366 రోజులు గడిపి రికార్డు సృష్టించాడు.
- మార్చి 22: అంతరిక్షం నుంచి వాలెరీ పొల్యకొవ్ భూమికి చేరుకున్నాడు.
- మార్చి 31: మెక్సికన్-అమెరికన్ గాయని సెలీనాను ఆమె అభిమాన సంఘం అధ్యక్షుడే కాల్చిచంపాడు.
- మే 7: ఫ్రాన్సు అధ్యక్షుడిగా జాక్వెస్ చిరాక్ ఎన్నికయ్యాడు.
- మే 7: ఐస్ హాకీ ప్రపంచ చాంపియన్‌షిప్‌ను ఫిన్లాండ్ గెలిచింది.
- ఆగష్టు 24: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 95 సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేసింది.
- సెప్టెంబర్ 1: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు పదవిని చేపట్టాడు.
- అక్టోబర్ 18: 11వ అలీన దేశాల సదస్సు కార్టజెన డి ఇండియాస్ లో ప్రారంభమైనది.
- అక్టోబర్ 24: భారతదేశం, ఇరాన్, థాయిలాండ్, ఆగ్నేయాసియా ప్రాంతాలలో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది.
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- జనవరి 1: యూజెని వింగర్, హంగేరి భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1902)
- జనవరి 7: ముర్రే రోథ్బర్డ్, ఆమెరికన్ ఆర్థికవేత్త (జ.1926)
- జనవరి 8: మధులిమాయె, భారత రాజకీయనేత.
- జనవరి 18: అడాల్ఫ్ బుటెనాంట్, జర్మనీ రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1903)
- జనవరి 19: కొండూరు వీరరాఘవాచార్యులు, తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912)
- ఫిబ్రవరి 14: యు ను, బర్మా రాజకీయనేత (జ.1907)
- ఫిబ్రవరి 25: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920)
- మార్చి 6: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)
- మార్చి 7: జార్జెస్ కోలర్, జర్మనీ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1946)
- మార్చి 7: బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1910)
- మార్చి 14: విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్, అమెరికా భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1911)
- మార్చి 29: టోని లాక్, ఇంగ్లాండు క్రికెట్ క్రీడాకారుడు (జ.1929)
- ఏప్రిల్ 10: మురార్జీ దేశాయ్, భారత మాజీ ప్రధానమంత్రి
- మే 5: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
- జూన్ 9: ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (జ.1900)
- జూలై 2: గడ్డం రాంరెడ్డి, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు. (జ.1929)
- జూలై 18: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)
- ఆగష్టు 21: సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఇండో అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1910)
- ఆగష్టు 30: ఫిచర్ బ్లాక్, అమెరిక ఆర్థికవేత్త (జ.1938)
- నవంబర్ 5: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.
- నవంబర్ 19: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908)
- నవంబర్ 19: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (జ.1920)
- నవంబర్ 26: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి. (జ.1918)
- నవంబర్ 26: ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు. (జ.1915)
- డిసెంబర్ 1: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947)
- డిసెంబర్ 22: జేమ్స్ మీడ్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
పురస్కారాలు
[మార్చు]- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : రాజ్‌కుమార్.
- జ్ఞానపీఠ పురస్కారం : ఎం.టి.వాసుదేవన్ నాయర్.
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: హొస్నీ ముబారక్.
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: మార్టిన్ పెరెల్, ఫ్రెడరిక్ రీన్స్.
- రసాయనశాస్త్రం: పాల్ జే క్రుట్జెన్, మరియో జే మోలినా, షెర్వుడ్ రౌలాండ్.
- వైద్యశాస్త్రం: ఎడ్వర్డ్ బి లూయీస్, క్రిస్టియానే నస్లీన్ ఒల్హార్డ్, ఎరిక్ ఎఫ్ వీస్‌చాస్.
- సాహిత్యం: సీమస్ హీనీ.
- శాంతి: జోసెఫ్ రాట్‌బ్లాట్, పుగ్వాష్ కాన్ఫరెన్సెస్.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ లుకాస్.