1813
Jump to navigation
Jump to search
1813 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1810 1811 1812 - 1813 - 1814 1815 1816 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 24:లండన్లో ఫిలార్మోనిక్ సొసైటీని స్థాపించారు. తరువాత ఇదే రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీగా మారింది.
- జనవరి 28: జేన్ ఆస్టిన్ రాసిన ప్రైడ్ అండ్ ప్రిజుడిస్ను తన పేరు లేకుండా ప్రచురించింది.
- మార్చి 4: ఫ్రెంచి సైన్యం బెర్లిన్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో రష్యా సేనలు యుద్ధం చెయ్యకుండానే నగరాన్ని ఆక్రమించాయి
- మార్చి 28: 1813-14 నాటి మాల్టా ప్లేగు మహమ్మారి ఏజిప్టు నుండి వ్యాపించడం మొదలైంది
- జూలై 21: బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ చట్టము 1813 కి రాజముద్ర పడింది. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మతప్రచారం చేసుకోవచ్చని ఈ చట్టం అనుమతించింది.
- సెప్టెంబరు 10: ఆలివర్ హజార్డ్ పెర్రీ నేతృత్వంలోని అమెరికన్ స్క్వాడ్రను బ్రిటిషు స్క్వాడ్రన్ను ఓడించింది.
- అక్టోబరు 4: హేస్టింగ్సు భారత గవర్నరు జనరల్ అయ్యాడు. (విరమణ. 1823)
- అక్టోబరు 16-19: లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ సంకీర్ణ సైన్యాల చేతిలో ఓడిపోయాడు. యుద్ధంలో పాల్గొన్న 6 లక్షల మంది సైనికుల్లో 60 వేల మంది మరణించడమో, గాయపడ్డమో జరిగింది. ఈ యుద్ధం తరువాత నెపోలియన్ పక్షాన ఉన్న అనేక జర్మను రాజ్యాలు సంకీర్ణ సైన్యాల వైపుకు మారిపోయాయి.
- తేదీ తెలియదు: షాజహాన్పూర్ జిల్లాను ఏర్పరచారు.
- తేదీ తెలియదు: ఆరవ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠాధిపత్యం స్వీకరించాడు.
జననాలు
[మార్చు]- జనవరి 19: హెన్రీ బెస్సిమర్, ఇంగ్లీషు ఇంజనీరు (మ. 1898)
- ఏప్రిల్ 16: స్వాతి తిరునాళ్, కేరళ లోని తిరువాన్కూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (మ.1846)
- జూలై 12: క్లాడ్ బెర్నార్డ్, ఫ్రెంచ్ జీవ శాస్త్రజ్ఞుడు (మ.1878)
- డిసెంబరు 29: అలెగ్జాండర్ పార్క్స్, రసాయన శాస్త్రవేత్త, పార్కెసీన్ అనే పేరుతో తొలి ప్లాస్టిక్ ను తయారు చేసాడు (మ. 1890)
మరణాలు
[మార్చు]- ఏప్రిల్ 10: జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్, ఇటాలియన్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. (జ. 1736)