1591
Jump to navigation
Jump to search
1591 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1588 1589 1590 - 1591 - 1592 1593 1594 |
దశాబ్దాలు: | 1570లు 1580లు - 1590లు - 1600లు 1610లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 27 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 10: ఇంగ్లీష్ వ్యాపారి జేమ్స్ లాంకాస్టర్ ఈస్ట్ ఇండీస్‌కు సముద్రయానంలో బయలుదేరాడు. [1]
- మే 15: రష్యాలో, ఇవాన్ ది టెర్రిబుల్ కుమారుడు త్సారెవిచ్ డిమిత్రి సందేహాస్పద పరిస్థితులలో, ఉగ్లిచ్ లోని ప్యాలెస్ వద్ద చనిపోయాడు. మూర్ఛ సమయంలో అతను తన గొంతును తానే కోసుకున్నాడని అధికారిక వివరణ. కానీ అతడి ప్రత్యర్థి, తరువాతి క్జాలంలో జార్ అయిన బోరిస్ గోడునోవ్ అతన్ని హత్య చేశాడని చాలామంది నమ్ముతారు.
- జూలై: గుజరాత్‌లో భూచార్ మోరి యుద్ధం : మొఘల్ సామ్రాజ్యం నవానగర్ రాష్ట్రంపై నిర్ణయాత్మక విజయం సాధించింది.
- జూలై 22: డర్ట్‌నెల్ కుటుంబం ఇంగ్లాండు, కెంట్ లోని బ్రాస్టెడ్‌లో నిర్మాణ కాంట్రాక్టర్లు పని ప్రారంభించింది. 2019 లో వ్యాపారం నిలిపివేసే వరకు వారి వ్యాపారం పదమూడు తరాల పాటు కొనసాగింది. [2]
- అక్టోబర్ 26: జాఫ్నా రాజ్యంపై పోర్చుగీస్ దాడి ప్రారంభమైంది.నార్
- అక్టోబర్ 29: పోప్ గ్రెగొరీ XIV తరువాత 230 వ పోప్గా పోప్ ఇన్నోసెంట్ IX పదవి లోకి వచ్చాడు
- హైదరాబాదు నగరంలో చార్మినారు నిర్మించారు.
- ఆంటోనియో డా పోంటే రూపొందించిన వెనిస్లోని రియాల్టో వంతెన పూర్తయింది.
జననాలు
[మార్చు]- జూన్ 16: జోసెఫ్ సోలమన్ డెల్మెడిగో, ఇటాలియన్ వైద్యుడు, గణిత శాస్త్రవేత్త, సంగీత సిద్ధాంతకర్త (మ .1655 )
- జూన్ 24: ఒట్టోమన్ సామ్రాజ్యపు సుల్తాన్ ముస్తఫా I (మ .1639 )
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 233–238. ISBN 0-304-35730-8.
- ↑ "Britain's oldest building firm collapses". BBC News. 2019-07-04. Retrieved 2019-07-04.