Jump to content

హనుమకొండ

అక్షాంశ రేఖాంశాలు: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
వికీపీడియా నుండి
హన్మకొండ
వరంగల్ పరిసరాలు
హన్మకొండ విహంగ వీక్షణం
హన్మకొండ విహంగ వీక్షణం
హన్మకొండ is located in Telangana
హన్మకొండ
హన్మకొండ
తెలంగాణలో హన్మకొండ స్థానం, భారతదేశం
హన్మకొండ is located in India
హన్మకొండ
హన్మకొండ
హన్మకొండ (India)
Coordinates: 18°01′00″N 79°38′00″E / 18.0167°N 79.6333°E / 18.0167; 79.6333
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహన్మకొండ
నగరంహన్మకొండ
Government
 • Typeనగరపాలక సంస్థ
భాష
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
506002
ప్రాంతీయ ఫోన్ కోడ్+91–870]]
Vehicle registrationTS–03
హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది

హన్మకొండ లేదా హనుమకొండ, తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలానికి చెందిన నగరం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు.[2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489

గ్రామ చరిత్ర

[మార్చు]

చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి అనుముకొండ అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది హనుమకొండగా మారింది. కాకతీయ సామ్రాజ్యం ఏర్పడక ముందు హనుమకొండ రాజధానిగా చేసుకొని పోరంకి పుంతలాదేవి పాలించారు.సైన్యాధ్యక్షుడుగా పోరంకి అంకమరాజు పనిచేశాడు.వీరి ఖడ్గం ఈనాటికీ హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో భద్రంగా ఉంది.పూర్వకాలంలో ఈ ప్రాంతం జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన వేయి స్తంభాల గుడి, పద్మాక్షి దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, సిద్ధి భైరవ దేవాలయం ఉన్నాయి.[4]

హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా విషయంలో మాత్రం పల్లెలకంటే గొప్పగా పండుగలను జరుపుకుంటారు.

కేసీఆర్‌ భవన్‌

[మార్చు]

హనుమకొండ పట్టణంలోని శాయంపేట క్రాస్‌రోడ్డు వద్ద మడివేలు మాచీదేవుడు కల్చరల్‌ ఎడ్యుకేషన్‌ సోషల్‌ కాంప్లెక్స్‌ (కేసీఆర్‌ భవన్‌) నిర్మించబడుతోంది. ఈ భవన్‌ మొదటి అంతస్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 2018లో 1.95 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పైఅంతస్తు కోసం అదనంగా 1.30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ప్రతిపాదనలను అందజేయగా, వాటిని పరిశీలించిన ప్రభుత్వం స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ రెండోదఫాగా 1.30 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు 2023 జనవరి 11న ఉత్తర్వులు జారీ అయ్యాయి.[5]

అభివృద్ధి పనులు

[మార్చు]
  • 5.20 కోట్ల రూపాయలతో నిర్మించిన మాడల్‌ వైకుంఠధామం, సైన్స్‌ పార్‌లను, తెలంగాణ స్టేట్‌ సైన్స్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో 8.50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ భవనాన్ని 2023, మే 5న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు. 181.45 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాడు.[6][7]
  • 2023 అక్టోబరు 6న మంత్రి కేటీఆర్ హనుమకొండలో పర్యటించి, బంధం చెరువు వద్ద 26.13 కోట్ల రూపాయలతో నిర్మించిన 15 ఎంఎల్‌డీ సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, 13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, 30 లక్షలతో అభివృద్ధి చేసిన నిట్‌ జంక్షన్‌లను ప్రారంభించాడు.[8][9] స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కార్యాలయం ఆవరణలో 100 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఐటీ టవర్‌, 70 కోట్ల రూపాయలతో హనుమకొండ ఆర్టీసీ బస్‌స్టాండ్‌ ఆధునీకరణ, 10 కోట్ల రూపాయలతో ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్‌, 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌ్‌సతోపాటు 900 కోట్ల రూపాలయలతో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశాడు.[10]

గ్రామ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-23.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (9 September 2018). "సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం". అరవింద్ ఆర్య పకిడే. Archived from the original on 13 September 2018. Retrieved 13 September 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  5. telugu, NT News (2023-01-12). "కేసీఆర్‌ భవన్‌కు రూ.1.30 కోట్లు". www.ntnews.com. Archived from the original on 2023-01-14. Retrieved 2023-01-17.
  6. ABN (2023-05-05). "నేడు కేటీఆర్‌ రాక". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-05. Retrieved 2023-05-05.
  7. telugu, NT News (2023-05-05). "Minister KTR | హుస్నాబాద్‌ చేరుకున్న మంత్రి కేటీఆర్‌.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు". www.ntnews.com. Archived from the original on 2023-05-05. Retrieved 2023-05-05.
  8. "శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు". EENADU. 2023-10-06. Archived from the original on 2023-10-06. Retrieved 2023-11-20.
  9. ABN (2023-10-06). "నగరంలో ప్రగతి పండుగ". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-11-20. Retrieved 2023-11-20.
  10. telugu, NT News (2023-10-07). "బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌ జోష్‌". www.ntnews.com. Archived from the original on 2023-10-07. Retrieved 2023-11-20.
  11. Andhrajyothy (23 May 2021). "ఉప'కుల'పతులు". www.andhrajyothy.com. Archived from the original on 28 May 2021. Retrieved 28 May 2021.

వెలుపలి లింకులు

[మార్చు]