సోలంకీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోలంకీలు
c. 960–1243
రాజధానిఅంహిల్ వాడా (నేటి పాటణ్, గుజరాత్
మతం
శైవమతం, జైనమతం
ప్రభుత్వంరాజరికం
• 940-
మూలరాజు
• 
భీమదేవుడు - 1
• -1096
కరణదేవుడు - 1
• 1096-1143
సిద్ధరాజ జయసింహ
• 1143-1172
కుమారపాలుడు
• 1172-1243
బాల మూలరాజు
చరిత్ర 
• స్థాపన
c. 960
• పతనం
1243
Preceded by
Succeeded by
చావడా వంశం
వాఘేలాలు
కచ్ రాష్ట్రం

భారతదేశంలోని, గుజరాత్ ప్రాంతాన్ని సా.శ. 950-1300 మధ్యకాలంలో పరిపాలించిన ఒక రాజవంశం, సోలంకీలు. వీరిని గుజరాత్ చాళుక్యులుగా, సోలంకీ రాజపుత్రులుగా కూడా పిలుస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ను ఆక్రమించినపుడు, ఈ రాజవంశం అంతరించింది. వీరి కులదేవం, ప్రభాసతీర్థం వద్దనున్న సోమనాధుడు. .[1]

సోలంకీ/చాళుక్య అనే తెగ 36 రాజపుత్ర తెగలలో ఒకరు.[2]

పరిపాలనాకాలం

[మార్చు]

వీరి పరిపాలనాకాలంలో గుజరాత్ హిందూమహాసముద్రం ద్వారా సాగిన వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. అప్పటి రాజధాని అంహిలవాడ (నేటి పాటణ్), 100000 జనాభాతో, ఆనాటి భారతీయ పెద్ద నగరాలలో ఒకటి. వీరి కాలంలోనే, సుప్రసిద్ధ సోమనాధ్ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ సా.శ.1026లో కొల్లగొట్టాడు. సా.శ. 1243 అనంతరం, సోలంకీలు గుజరాత్ ప్రాంతంపైన నియంత్రణ కోల్పోయారు. వీరి సామంతులైన వాఘేలాలు, స్వతంత్రించారు. ఈ వాఘేలాలు దేవగిరిని పాలించిన యాదవులకు సామంతులైనారు.

మూలరాజు

[మార్చు]

సా.శ. 940-41 కాలంలో మూలరాజు అనహిలపటకం రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు.[1]

భీమదేవ - 1

[మార్చు]
భీమదేవ- 1 నిర్మించిన మొధేరా సూర్యదేవాలయం

మూలరాజు అనంతరం భీమదేవుడు-1 రాజ్యానికి వచ్చాడు. మొధేరాలోని సూర్యదేవాలయాన్ని, నిర్మింపజేశాడు. ఈతని భార్య, ఉదయమతీ దేవి రాణి కీ వావ్ (రాణిగారి బావి) ని నిర్మింపజేసింది.

కరణదేవ - 1

[మార్చు]

భీమదేవుని అనంతరం వచ్చిన రాజు, కరణదేవుడు - 1. ఈతడు భిల్లులను ఓడించి, కర్ణావతి (నేటి అహ్మదాబాద్) నగరాన్ని నిర్మించాడు. కరణదేవ - మీనలదేవి ల కొడుకు, సిద్ధరాజ జయసిన్హ్

సిద్ధరాజ జయసిన్హ్

[మార్చు]

సిద్ధరాజ జయసిన్హ్ అర్థశతాబ్దంపైగా పాలించడమే కాక, మాళవ రాజ్యాన్ని ఆక్రమించి సామ్రాజ్యంగా మార్చాడు. సిద్ధాపూర్ వద్దన ఈతడు కట్టించిన రుద్రమహాకాల ఆలయం, ఆనాటి శిల్పకళలని చూపుతుంది. [1]

కుమారపాల

[మార్చు]

సిద్ధరాజు అనంతరం వచ్చిన కుమారపాలుడు సా.శ. 1143 నుండి 1174 వరకూ, 31 సంవత్సరాలు పాలించాడు. సోమనాధ్ ఆలయాన్ని పునర్నిర్మించాడు.

బాల మూలరాజు

[మార్చు]

అనంతరం, బాల మూలరాజు ఘోరీ మహమ్మద్ దాడులని తిప్పికొట్టగలిగాడు.

అనంతరం

[మార్చు]

సోలంకీల పాలన అంతమైన పిదప, వాఘేలాలు గుజరాత్ ప్రాంతాన్ని 76 సంవత్సరాలు పాలించారు. వారిలో చివరివాడైన కరణదేవుని, సా.శ. 1297లో అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి., ఆ ప్రాంతాన్ని ఢిల్లీ ఏలుబడిలోని తీసుకుని వచ్చాడు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 28-29. ISBN 978-9-38060-734-4.
  2. https://books.google.co.in/books/about/36_Royal_Races_Agnivansha_Bais_Rajputs_B.html?id=JqUxngEACAAJ