Jump to content

సైతాను వచనాలు

వికీపీడియా నుండి
బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్‌లో తిషాని దోషి (ది ప్లెజర్ సీకర్స్ రచయిత), సల్మాన్ రష్దీ (సాతానిక్ వెర్సెస్, మిడ్నైట్ చిల్డ్రన్, గ్రిమస్, హారౌన్ అండ్ ది సీ ఆఫ్ స్టోరీస్, ది ఎన్చాన్ట్రెస్ ఆఫ్ ఫ్లోరెన్స్)

ఖురాన్, హదిస్ లో చేర్చడానికి నిరాకరించబడినవని ఇస్లాం విమర్శకులు భావించే కొన్ని వచనాలకి Satanic Verses (సైతాను వచనాలు) అని పేరు పెట్టారు. ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించేటప్పుడు తాను కొత్త మతాన్ని సృష్ఠిస్తున్నట్టు చెప్పుకోలేదు. అబ్రహాం (ఇబ్రహీం), మోషే (మూసా), యేసు క్రీస్తు (ఈసా) వంటి పూర్వపు ప్రవక్తల బోధనలనే బలపరిచాడు. ఖురాన్ వచనాలను ముహమ్మద్ సహచరులు రచించగా హదిస్ లని పెర్షియన్, అరబ్ చరిత్రకారులు ముహమ్మద్ ప్రవక్త చనిపోయిన తరువాత సంకలనం చెయ్యడం జరిగింది. ఖురాన్, హదిస్ ప్రవచనాలలో పొంతన లేనివి, ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఖురాన్, హదిస్ ల నుంచి తొలిగించడం కూడా జరిగింది. ఉదాహరణ: ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. ఈ దేవతల పేర్లు అల్లాత్, ఉజ్జా, మనాత్ [ఆధారం చూపాలి]. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు సల్మాన్ రష్దీ అనే రచయితను హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడం జరిగింది. ముస్లింలు ఏకేశ్వరోపాసకులు. వారు అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతారు. అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం. బైబిల్ లో తొక్కి పెట్టబడిన గ్రంథములు (Apocryphal books) ఉన్నట్టే ఖురాన్ లో కూడా నిరాకరించిన ప్రవచనాలున్నాయని పూర్వపు ముస్లిం చరిత్ర కారులు వ్రాసిన నిజాల్ని నేటి ముస్లిం పండితులు నమ్మడం లేదు[ఆధారం చూపాలి]. ఆ ప్రవచనాలు సైతాను ప్రవచనాలు (Satanic Verses) అని ముస్లిం పండితుల వాదన. ఈ వచనాలను మొదట సేకరించినది ముస్లిం చరిత్రకారులైన అల్-వకీదీ, ఇబ్న్ సా'ద్, అత్-తబారి, ఇబ్న్ ఇషాక్ [ఆధారం చూపాలి]. వీరి చారిత్రక రచనల ఆధారంగా "ది శటానిక్ వర్సెస్" అనే నవల వ్రాసి ఖురాన్ లోనివని భావింపబడిన అసంగత విషయాలను బయట పెట్టినందుకు ఆ నవల రచయత సల్మాన్ రష్దీని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడంతో పాటు అతని నవలని అనేక ఇస్లామిక్ దేశాలలో నిషేధించడం జరిగింది.

పరిశీలకుల వివరణ

ఇతర మతాలకి చెందిన ఇస్లాం పరిశోధకులు ఇస్లాం మత పరిణామంలో పూర్వపు మక్కాలోని విగ్రహారాధకుల నమ్మకాల ప్రభావాలు కూడా కలిసాయని అంగీకరిస్తున్నారు[ఆధారం చూపాలి]. విల్లియం మాంట్ గోమరీ వాట్ (William Montgomery Watt), ఆల్ఫ్రెడ్ గిల్లామ్ (Alfred Guillaume) ఇలా వివరణలు ఇస్తున్నారు "ముస్లింలు తమ మత గ్రంథాన్ని తామే వక్రీకరించి వ్రాయడం లేదా తమ ప్రవక్తని తామే అప్రతిష్ట పరచడం నమ్మశక్యం కాదు అన్న విషయం ఆధారంగా కూడా నిజాల్ని పరిశీలించాలి. ఆ సైతాను వచనాలని ఖురాన్ లో భాగాలుగా ముహమ్మదే ప్రవచించి ఉంటాడు. ఆ కథని ముస్లింలు కనిపెట్టడం లేదా ఇతర మతస్తులు ముస్లింల పై రుద్దడం ఊహలో కూడా జరిగే పని కాదు".[1] ఈ వివరణని అంగీకరించని వారు కూడా ఉన్నారు. ఎందుకంటే తొలితరం ముస్లిం సమాజంలోని ముసిమేతరులు ఆడ దేవతల కథని అంగీకరించారు, దానిని ముస్లింలే అంగీకరించారనే కట్టుకథ బయలుదేరింది. వారు ఆ కథని అశుభ సందేశంగా భావించలేదు[ఆధారం చూపాలి].

ఇస్లాం సంప్రదాయపు సృష్టికర్తలు కావాలని ఖురాన్ మొత్తాన్ని అప్రతిష్ఠ పరిచే అంతరార్థాల్ని చేర్చడం జరగదనే విశ్వాసంతోనే తొలినాటి ముస్లింలు ఈ కథని నమ్మేవారని ఫ్రెంచ్ చరిత్రకారుడు మాక్సిమ్ రోడిన్సన్ (Maxime Rodinson) అన్నారు. ఇస్లాం ఆవిర్భవించిన తొలినాళ్ళలో ముస్లిమేతరులు ఇస్లాంలో ప్రవేశించిన ప్రారంభలో వారు మొదట వారు మక్కా పాగన్ దేవతలని తమ దేవతలుగా భావించే వారు కానీ, చాలా కాలం వరకు ఆ దేవతలని పూర్తిగా తిరస్కరించ లేకపోయారు. కాల క్రమంలోనే వారు తమ పాత సంప్రదాయాల్ని వదిలి పెట్టి వాటిని పాగన్ సంప్రదాయాలుగా పరిగణించారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Watt, Muhammad at Mecca