షామూ
షామూ సీవరల్డ్ (అమెరికా లో ఓర్లాండో, ఫ్లారిడా, సేన్ డియగో, కాలిఫోర్నియా, సేన్ ఆంటోనియా లలో ఉన్న పెద్ద పెద్ద సముద్ర జంతువులు ప్రదర్శనలిచ్చే మైరైన్ మమ్మల్ పార్క్) లో ఓర్కాలు ఇచ్చే ప్రదర్శన. రెండో మూడో ఓర్కాలు సుమారు 5500 మంది పట్టే స్టేడియంలో ప్రదర్శనలు ఇస్తాయి. ఒకొక్క ప్రదర్శన 20 నిమిషాలు ఉండి రోజుకు ఆరు షో ల దాకా ఉంటాయి. ఒర్కాలు సహజ ప్రవర్తనను ఇక్కడ చూపిస్తాయి. ప్రదర్శనలో అవి తోకతో నీళ్ళు కొట్టేటప్పుడు కనీసము ముందు 14 వరుసలు తడుస్తాయి.
"షామూ" అనే పదం "షి-నామూ" అనగా "నామూ మిత్రుడు" అన్న వాడుకనుండి వచ్చింది. ఆ పేరు మొట్టమొదట పట్టుకొన్న ఓర్కాకు పెట్టారు.[1] ఎందుకంటే ఆ ఓర్కాను అంతకుముందున్న "నామూ" అనే ఓర్కాకు తోడుగా ఉంటుందని సియాటిల్ పబ్లిక్ ఆక్వేరియంలో ప్రవేశపెట్టారు. కాని అవి ఒకదానితో ఒకటి సర్దుకుపోలేదు గనుక షామూను శాన్ డీగో నీటిపార్కుకు అమ్మేశారు.[2] షామూ బహుశా 1961లో పుట్టి ఉండవచ్చును. దీనిని 1965లో పట్టుకొన్నారు.[2]. ఇది అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చింది. 1971 ఆగస్టు 23న మరణించింది.
ప్రస్తుతం "షామూ", "నామూ", "రామూ" అనే పేర్లు సీ వరల్డ్ పార్కులలో నిర్వహించే ఓర్కా ప్రదర్శనలకన్నింటికీ ట్రేడ్ మార్కు పేర్లుగా వాడుతున్నారు.[3]
ప్రస్తుతం షామూ ప్రదర్శనలు 5,500 మంది కూర్చునే షామూ స్టేడియంలో చూపుతారు. రోజుకు 7 సార్లు, ఒకోమారు 20 నిముషాలు నడిచే ఈ ప్రదర్శనలు చూపరులను బాగా ఆకట్టుకొంటాయి. మొదటి 14 వరుసలలో కూర్చున్న ప్రేక్షకులు తడిచిపోవడానికి సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు ప్రకటిస్తారు. సంగీతం, లైటులు, కెమెరాలు వంటి అధునాతన క్రొత్త క్రొత్త హంగులతో ప్రస్తుతం ఇదే షోను ప్రదర్శిస్తున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Shamu Stadium Evolves over the Years" 2006 May SeaWorld Press Release Archived 2007-10-28 at the Wayback Machine Accessed 2008 May 17.
- ↑ 2.0 2.1 "SeaWorld Investigation: Secrets Below the Surface". KGTV San Diego. Archived from the original on 2008-10-06. Retrieved 2008-05-05.
- ↑ "Ask Shamu: Frequently Asked Questions". SeaWorld/Busch Gardens. Archived from the original on 2013-10-03. Retrieved 2008-05-05.
బయటి లింకులు
[మార్చు]- Shamu.com – Shamu's official site