Jump to content

వీధి

వికీపీడియా నుండి
జర్మనీలోని ఒక వీధి.

వీధి అనేది, నలుగురూ నడిచే దారి. కొన్ని ఇళ్ళ సముదాయానికి సంబంధించిన వారు, ఒక చోటి నుండి మరొక చోటికి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న ఖాళీ స్థళమే వీధి. సంక్షిప్తంగా చెప్పాలంటే, వివిధ నిర్మాణాల మధ్య ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటుచేసిన ప్రదేశాల్ని వీధులు అంటారు. వీధులు లేక పోతే గ్రామముగాని, పట్టణముగాని, నగరం గాని అస్తవ్యస్తముగా ఉండి నివాస యోగ్యము కాదు. అందుకనే, వీధులు (Streets) పెద్ద నగరాల ప్రణాలికలో ఒక ముఖ్యమైన భాగము. ఇవి ఏ ఒక్కరికి చెందినవి కావు. వీధులు ముఖ్యంగా ఇల్లు, పార్కులు, దుకాణాలు మొదలైన వాటి మధ్య ఉంటాయి. వాహన రద్దీ ఎక్కువగా ఉన్న వీధులలోనడిచేవారి కోసం ప్రత్యేకంగా నడక దారి వేరుగా ఉంటుంది. రహదారి ఒక ఊరినుండి మరొక ఊరికి, ముఖ్యంగా రవాణాకు సంబంధించింది. వీధి పరస్పర ప్రయోజనం కోసం ఒక నగరంలో ఏర్పరుచుకున్న అంతర్భాగ సౌకర్యం.[1][2]

వీధి పేరు

[మార్చు]

ఊళ్ళొ వీధి ఒక్కటే ఉంటే పేరుతో పెద్ద పనిలేదు. ఒకటి కంటే ఎక్కువయినప్పుడు, ఒక్కొక్క వీధికి ఒక ప్రత్యేక పేరు పెట్టవలసిన అవసరం ఏర్పడింది. ఈ వీధుల పేర్లు అందరికిఇ తెలిసిన పేర్లు, దేవుళ్ళ పేర్లు, గుళ్ళ పేర్లు, దేశభక్తుల పేర్లు, చివరకు ఆ ఊరి పెద్ద రైడీ పేరు కూడా పెడుతూ ఉంటారు.

కూడలి

[మార్చు]

మూడు కాని అంతకుమించి వీధులు కలిస్తే కూడలి అవుతుంది. ఈ కూడళ్ళకు అందరికి తెలిసిన పేర్లు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. కూడళ్ళ పేర్లు చిరునామాలల్లో చాలా ముఖ్యమైనవి.

తిరువీధి

[మార్చు]

ఒక ఊరిలో హిందూ దేవాలయాలలోని ప్రధాన దేవుడు/దేవతలను కొన్ని దినాలలో లేదా ఉత్సవాలలో ఆ ఊరిలోని కొన్ని వీధులలో ఊరేగిస్తారు. దీనిని తిరువీధి అంటారు. దీని మూలంగా దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోలేని వారికి ఇంటి వద్దనే ఈ అవకాశం లభిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Dictionary.
  2. "Ask Yahoo!". Archived from the original on 2005-11-26. Retrieved 2008-01-24.