వికీపీడియా:రచ్చబండ
రచ్చబండ | వార్తలు | పాలసీలు | సాంకేతికము | ప్రతిపాదనలు | ఆలోచనలు | పత్రికా సంబంధాలు | ఇతరత్రా.. |
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
|
(సహాయం ఎలా కోరాలో చూడండి)
|
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన (2024-25), తెవికీ ప్రచారం
హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరగనుంది. ప్రతిసంవత్సరం చేసినట్లుగానే తెలుగు వికీపీడియా సభ్యులు బుక్ ఫెయిర్ లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించనున్నారు. అయితే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఈ ప్రచారం కొంత విస్తృతంగా నిర్వహించాలని, ఇంకా తెవికీ లక్ష వ్యాసాలు, వికీసోర్స్ 20000 వ్యాసాల మైలురాళ్లను దాటిన సందర్భంలో అభినందన కార్యక్రమం బుక్ ఫెయిర్ కేంద్ర వేదిక మీద నిర్వహించాలని ఉద్దేశ్యంతో సముదాయం నిర్ణయించినట్లుగా ఫౌండేషన్ నుంచి ఆర్ధిక సహకారం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము. ఈ ప్రాజెక్ట్ పేజి పరిశీలించి అక్కడ మీ సహకారాన్ని నమోదు చేయవలసినదిగా విన్నపం. (మెటాపేజీ)ఇక్కడ చూడవచ్చు. ధన్యవాదాలు.
V.J.Suseela (చర్చ) 07:24, 2 డిసెంబరు 2024 (UTC) (తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్)
ఈ సంవత్సరం 2024 డిసెంబర్, 19 నుండి 29 వరకు జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించే కార్యక్రమం గురించి ఇంతకుముందే (2 డిసెంబరు 2024న) సముదాయానికి తెలియచేయడం జరిగింది. దీంట్లో భాగంగా తెలుగు వికీపీడియా లక్ష వ్యాసాలు మైలు రాయి అధిగమించడం ఇంకా ఇతర ప్రాజెక్టుల ప్రచారం గురించి ఒక 45 నిముషాల పాటు (మనకు అంతే అవకాశం ఉంటుంది) సభను 26.12.2024 తేదీన సాయంత్రం 5.00 నుండి 5.45 వరకు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి మీ అందరి సహకారం కోరుతున్నాము.
పాల్గొనదలచిన వారు 15.12.2024 తేదీ లోపల ఇక్కడ సంతకం చేసి పాల్గొనగల రోజులు పేర్కొనవలసినది.
ధన్యవాదాలు. --V.J.Suseela (చర్చ) 09:44, 11 డిసెంబరు 2024 (UTC)
ధన్యవాదాలు మేడం
చాలా మంచి ఆలోచన RATHOD SRAVAN (చర్చ) 07:45, 2 డిసెంబరు 2024 (UTC)
తెవికీ 21వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
తెలుగు వికీమీడియా యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో వికీమీడియా ఫౌండేషన్, సిఐఎస్-ఎ2కె ల సహకారంతో 2025 ఫిబ్రవరి 14, 15, 16 తేదీలలో తిరుపతి లో తెవికీ పండగ-2025 (తెలుగు వికీపీడియా 21వ వార్షికోత్సవం) జరగబోతుంది. తెవికీ 21వ వార్షికోత్సవానికి హాజరయ్యే వారికి స్కాలర్‌షిప్ పొందే మంచి అవకాశం. ఈ పేజీ లో దరఖాస్తు ఫారానికి లింకు ఇవ్వబడింది. ఈ దరఖాస్తు 10 రోజుల పాటు (అంటే డిసెంబరు 13, 2024 దాకా) అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తి ఉన్న సభ్యులందరూ (కమిటీ మెంబర్స్ తో సహా) అప్లై చేసుకోగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:35, 3 డిసెంబరు 2024 (UTC) (తెవికీ పండగ-2025-కమ్యూనికేషన్ & స్కాలర్ షిప్ కమిటీ నుండి)
Please help translate to your language
Dear Wikimedians,
We are excited to Initiate the discussions about India’s potential bid to host Wikimania 2027, the annual international conference of the Wikimedia movement. This is a call to the community to express interest and share ideas for organizing this flagship event in India.
Having a consortium of a good number of country groups, recognised affiliates, thematic groups or regional leaders primarily from Asia for this purpose will ultimately strengthen our proposal from the region. This is the first step in a collaborative journey. We invite all interested community members to contribute to the discussion, share your thoughts, and help shape the vision for hosting Wikimania 2027 in India.
Your participation will ensure this effort reflects the strength and diversity of the Indian Wikimedia community. Please join the conversation on Meta page and help make this vision a reality!
Regards,
Wikimedians of Kerala User Group and Odia Wikimedians User Group
This message was sent with MediaWiki message delivery (చర్చ) by Gnoeee (talk) 15:14, 4 డిసెంబరు 2024 (UTC)
A2K Monthly Report – November 2024
Dear Wikimedians,
We’re excited to bring you the November edition of the CIS-A2K newsletter, highlighting our impactful initiatives and accomplishments over the past month. This issue offers a comprehensive recap of our events, collaborative projects, and community engagement efforts. It also provides a glimpse into the exciting plans we have lined up for the coming month. Stay connected with our vibrant community as we celebrate the progress we’ve made together!
- In the Limelight
- Tulu Wikisource
- Dispatches from A2K
- Monthly Recap
- Learning hours Call
- Dandari-Gussadi Festival Documentation, Commons Education Project: Adilabad
- Executive Directors meeting at Oslo
- Coming Soon - Upcoming Activities
- Indic Wikimedia Hackathon 2024
- Learning Hours
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Warm regards, CIS-A2K Team MediaWiki message delivery (చర్చ) 16:46, 10 డిసెంబరు 2024 (UTC)
వ్యాసాలలో అసందర్భ తికమక పదాలు
కొత్త వ్యాసాలు సృష్టింపు నాకు తెలిసినంతవరకు తెవికీలో మూడు రకాలుగా జరుగుతుంది. మొదటిది తెవికీ అనువాద యంత్రం ద్వారా, ఆంగ్ల వ్యాసాలనుండి విజువల్ ఎడిటరులో పాఠ్యం కాపీచేసి, దానిని గూగుల్ ట్రాన్సులేట్ లో పేస్ట్ చేసి, అనువాదం అయిన పాఠ్యం మరలా కాపీ చేసి, వ్యాసంలో పేస్ట్ చేయటం రెండోపద్దతి అయితే, ఇక మూడవ పద్దతి పుస్తకాలలో, లేదా ఏదేని దినపత్రికలలలో సేకరించిన సమాచారం ద్వారా వ్యాసాలు సృష్టించటం.
నేను వ్యాసాలలో సవరణలు చేసేటప్పుడు కొన్ని వ్యాసాలలో అక్కడ వాక్యానికి తగిన పదాలు కాకుండా, అసందర్భ పదాలు, అర్ధం లేని తికమక పదాలు కొన్నిటిని గమనించాను. అయితే వాటిన్నిటిని నేను సరియైన పదాలకు సవరించాననుకోండి. అలాగే మరికొన్ని వ్యాసాలలో ఈ దిగువ వివరించిన పదాలు లేదా ఇతరత్రా పదాలు ఉండవచ్చు. ఈ పదాలు పూర్తిగా అనువాదయంత్రంద్వారా వచ్చినవా లేదా గూగుల్ ట్రాన్సులేట్ ద్వారా వచ్చినవా, లేదా ఏ వ్యాసాలలో వచ్చినవి అనే విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. రెండు విషయాలు చెప్పగలను.ఇవి ఎక్కువుగా పట్టికలలో వచ్చినవి. అలాగే ఏ ఆంగ్ల పదానికి ఈ తికమక పదాలు వచ్చినవి అనేది వివరించగలను. ఇంకొక సందర్భంలో ఆ పదాలు సరియైనవే కావచ్చు, కానీ అక్కడ ఆ వ్యాసంలో ఆ వాక్య సందర్భానికి తగిన సరియైన పదం ఉండాలి.
ఆంగ్లపదం | అనువాద పదం | ఉండాలిసిన పదం | వివరం |
---|---|---|---|
Adoor | తలుపు | ఆదూర్ | కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఒక పట్టణం |
Praful Patel | డస్ట్ పటేల్ | ప్రఫుల్ పటేల్ | రాజకీయ నాయకుడు |
Showaless K Shilla | ప్రదర్శన లేని కె షిల్లా | షోవేలెస్ కె షిల్లా | ఒక రాజ్యసభ సభ్యుడు |
Jagadambi Mandal | జగదాంబి మండలం | జగదాంబి మండల్ | ఒక రాజ్యసభ సభ్యుడు (పేరు సందర్భంలో మండల్ అని ఉండాలి) |
votes swing | ఓట్లు ఊపుతాయి | ఓట్స్ స్వింగ్ లేదా స్వింగ్ ఓట్స్ | ఇలాంటి సందర్భంలో అలా రాస్తేనే బాగుంటుంది |
Disqua (Disqualified) | డిస్క్వల్ | అనర్హత లేదా అనర్హుడు | |
Dissolved | కరిగిపోయింది | రద్దుఅయింది లేదా రద్దైంది | |
Incumbent | నిటారుగా | పదవిలో ఉన్న వ్యక్తి లేదా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా ప్రస్తుతం | |
Acting | నటన | తాత్కాలిక లేదా తాత్కాలికం, ఆక్టింగ్ | అనువదించిన పదం సరియైనదే కావచ్చు.అక్కడ సందర్భాన్ని బట్టి రాయాలి |
14th ,15th | 14వ, 15వ | 14వ తేదీ, 15వ తేదీ | |
Akola | చేసాడు | అకోలా | ఇది ఒక జిల్లా |
Raigad | కిరణాలు | రాయిగఢ్ | ఇది ఒక జిల్లా |
Beed | మంచం | బీడ్ | ఇది ఒక జిల్లా |
Latur | సోమరితనం | లాతూర్ | ఇది ఒక జిల్లా |
రోమన్ అంకెలు వరస సంఖ్యలుగా ఉన్నచోట I , నేను గాను V , వి గానూ అనువదిస్తుంది. | |||
res (సింపుల్ గా రాసారు) | రెస్ | రాజీనామా అని ఉండాలి | resignation సందర్బంలో అలా రాసారు |
bye (సింపుల్ గా రాసారు) | బై | ఉప ఎన్నిక అని ఉండాలి | bye election సందర్భంలో అలా రాసారు |
నాకు తెలిసినంతవరకు దీనికి ప్రధాన కారణం వ్యాసం సృష్ట్టించిన తరువాత ఒకసారి పరిశీలనాదృష్టితో చదివి సవరించకపోవటం అని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 02:29, 14 డిసెంబరు 2024 (UTC)
- ఇలాంటివి చాల గమనించాను, రాసి పెట్టుకోలేక పోయాను. కనీసం నావ్యాసాలు పరీక్షించుదామని అనుకుంటున్నాను. ఎవరైనా ఇంతకూ ముందే వాటిని సరిదిద్దుతే వారికీ ధన్యవాదాలు . V.J.Suseela (చర్చ) 08:35, 15 డిసెంబరు 2024 (UTC)
- @Vjsuseela గారూ కనీసం ఎవరు సృష్టించిన వ్యాసాలు వారు ఒకసారి పరిశీలానాదృష్టితో చూసి సవరిస్తే ఇలాంటి పదాలు చూద్దామన్నా కనపడవు. యర్రా రామారావు (చర్చ) 08:41, 15 డిసెంబరు 2024 (UTC)
37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం
సభ్యులందరికి నమస్కారం. ఈనెల (డిసెంబర్ 2024) 19వతేదీ సాయంత్రం 4 గంటలకు 37వ హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో తెవికీ స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. (పుస్తకప్రదర్శన స్థలం - కాళోజీ కళాక్షేత్రం, NTR స్టేడియం, లోయర్ ట్యాంక్ బండ్, హైదారాబాద్). అందరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.
తెలుగు వికీమీడియాన్స్ యూజర్ గ్రూప్-- V.J.Suseela (చర్చ) 07:46, 18 డిసెంబరు 2024 (UTC)
తెలుగు సాహితి లిస్టు ఎక్కడైనా దొరుకుతుందా నేను జాతీయ దినోత్సవం