వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 1
స్వరూపం
- భారతీయ తపాలా బీమా దినం.
- 1929: తెలుగు భాషాభిమాని, సాహితీకారుడు, కవి జువ్వాడి గౌతమరావు జననం (మ.2012).
- 1945: భారతీయ సాంకేతిక నిపుణుడు బొజ్జి రాజారాం జననం.
- 1956: తెలుగు సినిమా హాస్య నటుడు కన్నెగంటి బ్రహ్మానందం జననం.
- 1971: భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా జననం.
- 1977: భారతీయ తీరరక్షక దళం ఏర్పాటయింది.
- 1986: భారత దౌత్యవేత్త, రాజకీయవేత్త, రచయిత ఆల్వా మిర్థాల్ మరణం (జ.1902).
- 2003: అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా దుర్ఘటనలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణం (జ.1962). (చిత్రంలో)