వానిందు హసరంగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వానిండు హసరంగా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పిన్నడువాగే వానిండు హసరంగా డి సిల్వా
పుట్టిన తేదీ (1997-07-29) 1997 జూలై 29 (వయసు 27)
గాలే, శ్రీలంక
మారుపేరువనియా, వౌనిండు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండరు
బంధువులుChaturanga de Silva (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 151)2020 డిసెంబరు 26 - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2021 ఏప్రిల్ 21 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 180)2017 జూలై 2 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 జూలై 9 - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 80)2019 సెప్టెంబరు 1 - న్యూజీలాండ్ తో
చివరి T20I2023 ఏప్రిల్ 8 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015/16–presentకొలంబో క్రికెట్ క్లబ్
2017/18Sylhet Sixers
2020/21-2021Jaffna Kings (స్క్వాడ్ నం. 49)
2021/22–presentరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 49)
2020/21Deccan Gladiators (స్క్వాడ్ నం. 49)
2022-presentB-Love Kandy (స్క్వాడ్ నం. 49)
2023Desert Vipers (స్క్వాడ్ నం. 49)
2023-presentWashington Freedom
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 ఫక్లా
మ్యాచ్‌లు 4 44 55 41
చేసిన పరుగులు 196 768 503 2,495
బ్యాటింగు సగటు 28.00 24.00 13.59 40.90
100లు/50లు 0/1 0/4 0/1 3/18
అత్యుత్తమ స్కోరు 59 80* 71 120
వేసిన బంతులు 674 2,099 1,186 4,332
వికెట్లు 4 67 91 84
బౌలింగు సగటు 100.75 28.85 15.11 30.44
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 3 0 5
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 1
అత్యుత్తమ బౌలింగు 4/171 6/24 4/9 8/26
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 14/– 20/– 44/–
మూలం: Cricinfo, 25 June 2023

పిన్నడువాగే వానిండు హసరంగా డి సిల్వా, శ్రీలంకకు చెందిన క్రికెటర్. శ్రీలంక క్రికెట్ జట్టు తరపున వైట్ బాల్ క్రికెట్‌లో బౌలింగ్ ఆల్ రౌండర్‌గా ఆడాడు.[1] రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ గా ఆడాడు. వైట్-బాల్ క్రికెట్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్‌లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడుతున్న హసరంగ 2017 జూలైలో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[1] ఇతని అన్నయ్య చతురంగ డి సిల్వా కూడా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[2] టోర్నమెంట్ 2021 ఎడిషన్‌లో టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంక తరపున మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించి, వన్డే అరంగేట్రంలో హ్యాట్రిక్ సాధించిన మొదటి శ్రీలంక ఆటగాడిగా హసరంగా చరిత్ర సృష్టించాడు.

జననం

[మార్చు]

పిన్నడువాగే వానిండు హసరంగా డి సిల్వా 1997, జూలై 29న శ్రీలంకలోని గాలేలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

వనిందు హసరంగా డి సిల్వా గాలెలోని రిచ్‌మండ్ కళాశాలలో చదువుకున్నాడు. అక్కడే ఇతడు క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2016లో బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో శ్రీలంక అండర్ 19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[3]

దేశీయ, ఫ్రాంచైజీ కెరీర్

[మార్చు]

ఏఐఏ ప్రీమియర్ లిమిటెడ్ ఓవర్ టోర్నమెంట్‌లో 2015 నవంబరు 30న హసరంగా లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[4] 2015 డిసెంబరులో 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[5] 2016 అండర్-19 ప్రపంచ కప్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఇందులో టోర్నమెంట్ క్వార్టర్-ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 3/34తో మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ ప్రదర్శనతో పాటు శ్రీలంక సెమీ-ఫైనల్ దశకు చేరుకోవడంలో సహాయపడింది.[6][7]

2016 ఫిబ్రవరి 26న 2015–16 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో శ్రీలంక పోర్ట్స్ అథారిటీ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8]

2017–18 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2017 నవంబరు 11న సిల్హెట్ సిక్సర్స్ కోసం ట్వంటీ20 అరంగేట్రం క్రికెట్ లోకి చేశాడు.[9]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

జింబాబ్వేతో సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో హసరంగ ఎంపికయ్యాడు.[10]2017 జూలై 2న జింబాబ్వేపై శ్రీలంక తరపున వన్డే క్రికెటల్ లోకి అరంగేట్రం చేసాడుజ[11] అరంగేట్రం మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో మూడు వరుస బంతుల్లో చివరి మూడు జింబాబ్వే వికెట్లు పడగొట్టాడు. వన్డేలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన బౌలర్‌గా నిలిచాడు.[12] బంగ్లాదేశ్ తైజుల్ ఇస్లాం, దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబడా తర్వాత వన్డే చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన మూడో అరంగేట్రం.[13] వన్డే చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి లెగ్ స్పిన్నర్‌గా కూడా నిలిచాడు.[14]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Wanidu Hasaranga". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  2. "Chaturanga de Silva". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  3. Sri Lanka Under 19 World Cup Squad – Player Profiles, Sri Lanka Cricket
  4. "AIA Premier Limited Over Tournament, Group A: Sri Lanka Ports Authority Cricket Club v Tamil Union Cricket and Athletic Club at Colombo (CCC), Nov 30, 2015". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  5. "SL include Charana Nanayakkara in U-19 World Cup squad". ESPNCricinfo. 23 December 2015. Retrieved 2023-08-24.
  6. "SL thump England to book semi-final berth". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  7. "Full Scorecard of England U19 vs S'Lanka U19 Quarter-Final 2015/16 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  8. "AIA Premier League Tournament, Plate Championship: Sri Lanka Ports Authority Cricket Club v Bloomfield Cricket and Athletic Club at Panagoda, Feb 26-28, 2016". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  9. "10th match (N), Bangladesh Premier League at Dhaka, Nov 11 2017". ESPN Cricinfo. Retrieved 11 November 2017.
  10. "Chandimal left out for first two Zimbabwe ODIs". ESPN Cricinfo. 27 June 2017. Retrieved 2023-08-24.
  11. "Zimbabwe tour of Sri Lanka, 2nd ODI: Sri Lanka v Zimbabwe at Galle, Jul 2, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  12. "Sri Lanka vs Zimbabwe, 2nd ODI: Wanidu Hasaranga becomes youngest player to take hat-trick on debut". Indian Express. 2 July 2017. Retrieved 2023-08-24.
  13. "Hasaranga hat-trick, Sandakan four; Zimbabwe 155". ESPN Cricinfo. Retrieved 2 July 2017.
  14. "Pitch, crosswind challenges for teams in Hambantota". ESPN Cricinfo. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు

[మార్చు]