ఱంపం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఱంపము (ఆంగ్లం: Saw) వడ్రంగి వారు కలపను కోయడానికి ఉపయోగిస్తారు. కోసిన ముక్కల్ని అతికించి కావలసిన సామాన్లను తయారుచేస్తారు. ఇది చేతి పరికరంగా వాడతారు. పెద్ద పెద్ద దుంగలను కోయడానికి పెద్ద రంపాలు యంత్రాల సాయంతో కోస్తారు.
ఱంపం తయారీ
[మార్చు]అన్ని రంపాలకు ఒకవైపు లేదా రెండు వైపులా పళ్ళు ఉంటాయి. చిన్నవాటిని ఒక వైపు, పెద్దవాటిని రెండు వైపులా పట్టుకోడానికి పిడిని కలిగివుంటాయి.
ఉపయోగాలు
[మార్చు]శస్త్రచికిత్స లో శరీర భాగాలు తొలగించవలసిన అవసరం వస్తే అందుకోసం ప్రత్యేకమైన రంపాలున్నాయి. ఉదాహరణకు ఏదైనా ప్రమాదంలో శరీర భాగాలు బాగా నలిగిపోయినప్పుడు వాటిని తొలగించడం తప్పనిసరి అవుతుంది. వీటికి మామూలు రంపాల కన్నా ఎక్కువ పదును ఉంటుంది. దీని వల్ల వైద్యులు ఎక్కువ శ్రమ లేకుండా తమ పని నిర్వర్తించుకోగలుగుతారు.