రామచంద్ర భరద్వాజ్
స్వరూపం
రామచంద్ర భరద్వాజ్ 1914 - 1917 మధ్య గదర్ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసాడు. ఇతన్ని పండిట్ రామచంద్ర అని అంటారు. అతను, హిందూస్థాన్ గదర్ పత్రిక వ్యవస్థాపక సంపాదకులలో ఒకడు. ఇండో-జర్మన్ కుట్రలో కీలకమైన నాయకుడు. 1914 లో లాలా హర్ దయాళ్ స్విట్జర్లాండ్ వెళ్ళిన తర్వాత, రామచంద్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. జరిగిన కోమగట మారు సంఘటన నేపథ్యంలో, ఫిబ్రవరిలో చెయ్యాలని తలపెట్టిన తిరుగుబాటు కోసం భగవాన్ సింగ్, మౌల్వీ మొహమ్మద్ బర్కతుల్లాతో కలిసి పసిఫిక్ తీరంలో దక్షిణాసియా కమ్యూనిటీ మద్దతును సమీకరించడంలో కీలకపాత్ర పోషించారు. రామచంద్ర బ్రిటిషు వారి ఏజెంటని భావించిన తోటి కుట్రదారు రామ్ సింగ్, హిందూ -జర్మన్ కుట్ర విచారణ చివరి రోజైన 1918 ఏప్రిల్ 24 న రామచంద్రను హత్య చేసాడు.
మూలాలు
[మార్చు]- స్వేచ్ఛా ప్రతిధ్వనులు: కాలిఫోర్నియాలో దక్షిణ ఆసియా మార్గదర్శకులు 1899-1965 . కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ. బాన్‌క్రాఫ్ట్ లైబ్రరీ.
- స్వేచ్ఛ కోసం భారత్ చేసిన పోరాటంలో పత్రికల పాత్ర. భారత జాతీయ కాంగ్రెస్ . 22 నవంబర్ 2007 న యాక్సెస్ చేయబడింది.
- తిరుగులేని ధైర్యం యొక్క సాగా. ఇవ్నిందర్ పాల్ సింగ్ . ది ట్రిబ్యూన్, ఇండియా. 22 నవంబర్ 2007 న యాక్సెస్ చేయబడింది.
- గదర్ మెమోరియల్ సెంటర్, శాన్ ఫ్రాన్సిస్కో