యార్లగడ్డ రాఘవేంద్రరావు
Appearance
యార్లగడ్డ రాఘవేంద్రరావు తెలుగు కవి, రచయిత[1], ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్. అతను రాసిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వం ప్రముఖ 34వ ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2021’కు ఎంపికయ్యింది.[2] యార్లగడ్డ కలం నుంచి వచ్చిన ఆరో సంపుటి ‘పచ్చి కడుపు వాసన’.[3] అతను రాసిన "ముంతపొగ" పుస్తకానికి 2001 లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.
జీవిత విశేషాలు
[మార్చు]భారతదేశంలోని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు గారు సీనియర్ జర్నలిస్టు. 13 ఏళ్లుగా ఓ పత్రిక జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా అతను వ్యవహరిస్తున్నాడు.[4]
కథలు
[మార్చు]కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
ఎడారి కోయిల | ఆంధ్రప్రభ | వారం | 1985-12-25 |
ఆశోపహత | ఆంధ్రప్రభ | వారం | 1987-09-09 |
వంశీ రాధేయం | ఆంధ్రప్రభ | వారం | 1989-11-08 |
వంశీరాధేయం | ఉదయం | వారం | 1989-08-25 |
రాలిన స్వప్నం | చతుర | మాసం | 1991-06-01 |
రారాకన్నా | విపుల | మాసం | 2006-05-01 |
మూలాలు
[మార్చు]- ↑ "యార్లగడ్డ రాఘవేంద్రరావు - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-23.
- ↑ ABN (2021-11-07). "యార్లగడ్డ రాఘవేంద్రరావు 'పచ్చికడుపు వాసన' పుస్తకావిష్కరణ". Andhrajyothy Telugu News. Retrieved 2024-10-23.
- ↑ Praneel (2022-02-15). "ఉమ్మడిశెట్టి సత్యాదేవి అవార్డు సాధించిన 'పచ్చి కడుపు వాసన'!" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-23.
- ↑ "'పచ్చి కడుపు వాసన'కు 'ఉమ్మడిశెట్టి సత్యాదేవి' అవార్డు | Ummadisetti Satya Devi Award For Poet Yarlagadda Raghavendra Rao | Sakshi". www.sakshi.com. Retrieved 2024-10-23.