మసనోబు ఫుకుఒక
మసనోబు ఫుకోయోక | |
---|---|
జననం | |
మరణం | 2008 ఆగస్టు 16 | (వయసు 95)
జాతీయత | జపనీయుడు |
విద్య | వృక్షశరీరధర్మశాస్త్రం |
వృత్తి | వ్యవసాయ శాస్త్రవేత్త, రైతు, రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సహజ వ్యవసాయం, జీవన తాత్త్వికత |
గుర్తించదగిన సేవలు | The One-Straw Revolution |
పురస్కారాలు | రామన్ మెగాసెసె, దేశీకొట్టం అవార్డు, ఎర్త్ కౌన్సిల్ అవార్డు |
మసనోబు ఫుకుఒక ( 1913 ఫిబ్రవరి 2 — 2008 ఆగస్టు 16) జపాన్కు చెందిన ప్రముఖ తత్వవేత్త. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు.[1]
ఫుకుఒక మైక్రో బయాలజీలో శిక్షణ పొంది పంటల తెగుళ్ళ నిపుణుడయ్యాడు. కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నపుడే మానవ విజ్ఞానానికి పరిమితులున్నాయని గ్రహించి ప్రకృతిని సాధ్యమైనంతవరకూ అనుసరిస్తూ దక్షిణ జపాన్ లోని షికోకు దీవిలోని పల్లెలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఎవరికీ తీసిపోని దిగుబడులు సాధించాడు. వన్ స్ట్రా రివల్యూషన్, ద రోడ్ బ్యాక్ టు నేచర్, ద నాచురల్ వే ఆఫ్ ఫామింగ్ ఆయన రాసిన పుస్తకాలను ఆంగ్లానువాదాలు.
బాల్యం ఉద్యోగ జీవితం
[మార్చు]సహజ వ్యవసాయం
[మార్చు]మట్టి విత్తన బంతులు
[మార్చు]అవార్డులు రివార్డులు
[మార్చు]తాత్వికత
[మార్చు]స్వతహాగా శాస్త్రవేత్త, చాలా చిన్న వయసులో ఒక సంక్లిష్టమైన మానసిక స్థితిలో తాత్వికచింతన వైపు మరలుతాడు. అదే అతని జీవితాన్ని మార్చిన కాలం. ప్రకృతికి ఎవరి అవసరమూ లేదని మనం నిమిత్తులమని గ్రహించిన ఆ క్షణమే ఆయన లక్ష్యాలు మారిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచాక తన ఊరు చేరుకొని అక్కడ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి తానే ఒక అప్రకటిత ప్రయోగ దీపికగా మారాడు . మానవాళికి ఏమీ తెలియదన్న ఒక్క విషయమే అయన నిరూపించదలుచుకున్న పరమ సత్యం. లెక్కలేనంతమంది అతను కనిపెట్టిన విషయాల గురించి తెలుసుకోవడానికి అతని దగ్గరికి వస్తారు, పరిశీలిస్తారు, పరిశోధిస్తారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మొండి సూదుల వంటివి అవి వేటికి అవే సమస్య ప్రయత్నిస్తాయి కానీ కారణాన్ని అన్వేషించలేవు అంటాడు. మసనోబు ఒక విశాల ప్రకృతి నేత్రంతో ఈ లోకాన్ని దర్శిస్తాడు, అందుకోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. ఒక గడ్డి పరక కూడా విప్లవానికి నాంది కాగలదని, పునాది కాగలదని నిరూపిస్తాడు.
జీవన చిత్రం
[మార్చు]- 1913-ఎహిమ్ కౌంటీలో జన్మించారు
- 1931-సాంగ్షాన్ మిడిల్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు
- 1933-గిఫు ఉన్నత వ్యవసాయ, వ్యవసాయ శాఖ నుండి పట్టభద్రుడయ్యాడు
- 1934-యోకోహామా కస్టమ్స్ యొక్క మొక్కల తనిఖీ విభాగంలో పనిచేశారు
- 1937-వ్యవసాయంలో పని చేయడానికి కొద్దిసేపటికే గ్రామానికి తిరిగి వచ్చారు
- 1939-కొచ్చి కౌంటీ అగ్రికల్చరల్ టెస్ట్ ఫీల్డ్ (ఇప్పుడు కొచ్చి కౌంటీ అగ్రికల్చరల్ టెక్నాలజీ సెంటర్) లో పనిచేశారు.
- 1947-వ్యవసాయంలో పని చేయడానికి మరోసారి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చిన అతను సహజ వ్యవసాయ చట్టం అధ్యయనంపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు.
- 1975-ప్రచురించబడిన "సహజ వ్యవసాయ చట్టం · ఒక విప్లవం"
- 1988- విస్లా భారతి విశ్వవిద్యాలయంలో లామోన్ మాగేసెట్ అవార్డు, దేశికోట్టం అవార్డును గెలుచుకున్న ప్రజా సేవా పురస్కారాలు.
- 1997-మొదటి ఎర్త్ కౌన్సిల్ అవార్డును గెలుచున్నారు.
- అతను 2008 ఆగస్టు 16 ఉదయం మరణించాడు.
రచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Gammage, Bill (2005). "'…far more happier than we Europeans': Aborigines and farmers" (PDF). kcl.ac.uk/artshums/ahri/centres/menzies/research/Publications/lp.aspx London Papers in Australian Studies (formerly Working Papers in Australian Studies). 12. London: Menzies Centre for Australian Studies. King's College: 1–27. ISSN 1746-1774. OCLC: 137333394. Archived from the original (PDF) on 1 ఫిబ్రవరి 2014. Retrieved 29 December 2012.
ఇతర లింకులు
[మార్చు]- Greening The Desert: Applying natural farming techniques in Africa, interview with Masanobu Fukuoka
- Masanobu Fukuoka and Natural Farming, Gandhi Foundation
- Masanobu Fukuoka: Japanese Organic Farmer, Mother Earth News magazine
- Nature - Nature knows best, Life Positive
- Farmer philosopher Masanobu Fukuoka, part 1, 2, 3; Japan Economic Forum