మడోన్నా
మడోన్నా | |
---|---|
జననం | మడోన్నా లూయిస్ సికోన్ 1958 ఆగస్టు 16 బే సిటీ, మిచిగాన్, యు.ఎస్. |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1979 – ప్రస్తుతం |
| |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ప్రముఖ పాప్ సింగర్ |
Works |
|
జీవిత భాగస్వామి | సీన్ పెన్
(m. 1985; div. 1989)గై రిచీ
(m. 2000; div. 2008) |
భాగస్వామి | Carlos Leon (1995–1997) |
పిల్లలు | 6 |
బంధువులు | క్రిస్టోఫర్ సికోన్ (సోదరుడు) |
సంగీత ప్రస్థానం | |
మూలం | New York City, U.S. |
సంగీత శైలి |
|
లేబుళ్ళు |
|
సంతకం | |
మడోన్నా లూయిస్ సికోన్ (ఆంగ్లం:Madonna Louise Ciccone; 1958 ఆగస్టు 16) అమెరికన్ గాయని, పాటల రచయిత, నటి.[1] క్వీన్ ఆఫ్ పాప్గా పిలువబడే మడోన్నా సంగీత నిర్మాణం, పాటల రచన, దృశ్య ప్రదర్శనలతో తన బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందింది. సామాజిక, రాజకీయ, లైంగిక, మతపరమైన ఇతివృత్తాలతో ఆమె రచనలు వివాదం, విమర్శకుల ప్రశంసలు రెండింటినీ కలిగిఉంటాయి.[2]
ఆల్బమ్స్, బిజినెస్ వెంచర్స్, రియల్ ఎస్టేట్, తన పేరిట అమ్ముడయ్యే వస్తువులు, ప్రకటనలు.. వెరసి ఆమె మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఎదిగింది. దీనికి తెలివైన పెట్టుబడి నిర్ణయాలూ సహకరించాయి.[3]
2000లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ మడోన్నాను ఎప్పటికప్పుడు గొప్ప మహిళా కళాకారిణిగా పేర్కొంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఆల్బమ్ అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన మహిళా కళాకారిణి.[4] 2007 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బిల్‌బోర్డ్ మ్యాగజైన్ రెండు కూడా అత్యధికంగా సంపాదిస్తున్న గాయకురాలుగా మడోన్నాను పేర్కొన్నాయి.[5] ఫోర్బ్స్ మడోన్నా నికర విలువ $80 మిలియన్లు అని తేల్చింది. మడోన్నా కన్ఫెషన్స్ టూర్ $200 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]మడోన్నా లూయిస్ సికోన్ 1958 ఆగస్టు 16న బే సిటీ, మిచిగాన్‌లో కాథలిక్ తల్లిదండ్రులు మడోన్నా లూయిస్ (నీ ఫోర్టిన్), సిల్వియో ఆంథోనీ (టోనీ) సికోన్‌లకు జన్మించింది. ఆమె పూర్వీకులు ఇటాలియన్ వలసదారులు కాగా ఆమె తల్లి ఫ్రెంచ్-కెనడియన్ సంతతికి చెందినది. ఆమె కుటుంబ సభ్యులు మడోన్నాను లిటిల్ నానీ అని ముద్దుగా పిలుచుకుంటారు. మడోన్నా ఐదేళ్ల ప్రాయంలో ఆమె తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది.
మడోన్నాకు ఇద్దరు అన్నలు ఆంథోనీ, మార్టిన్; ముగ్గురు తమ్ముళ్లు పౌలా, క్రిస్టోఫర్, మెలానీలతో మడోన్నా డెట్రాయిట్ శివారు ప్రాంతాలైన పోంటియాక్, అవాన్ టౌన్‌షిప్‌లో పెరిగింది.[7] 1966లో టోనీ హౌస్ కీపర్ జోన్ గుస్టాఫ్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, జెన్నిఫర్, మారియో. మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు తన తండ్రిపై మడోన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వారి బంధాన్ని దెబ్బతీసింది.
మూలాలు
[మార్చు]- ↑ "Madonna Biography". Rock and Roll Hall of Fame. 2008. Archived from the original on March 29, 2010. Retrieved April 15, 2015.
- ↑ McGregor, Jock (2008). "Madonna: Icon of Postmodernity" (PDF). L'Abri. pp. 1–8. Archived from the original (PDF) on 2010-12-07. Retrieved March 29, 2021.
- ↑ "Greater revenue .. Madonna - Sakshi". web.archive.org. 2023-03-05. Archived from the original on 2023-03-05. Retrieved 2023-03-05.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ http://www.guinnessworldrecords.com/content_pages/record.asp?recordid=55387 Guinnessworldrecords.com
- ↑ In Pictures: The Richest 20 Women In Entertainment, Forbes magazine
- ↑ Waddell, Ray. "Stones' Bigger Bang Is Top-Grossing Tour Of 2006", [[Billboard (magazine)|]], 14 December 2006
- ↑ "The Child Who Became a Star: Madonna Timeline". The Daily Telegraph. July 26, 2006. Archived from the original on January 10, 2022. Retrieved June 9, 2008.
- Pages using embedded infobox templates with the title parameter
- Pages using infobox person with unknown parameters
- 1958 జననాలు
- అమెరికన్ వ్యాపారవేత్తలు
- అమెరికన్ గాయకులు
- అమెరికన్ కాస్మెటిక్స్ వ్యాపారులు
- అమెరికన్ ఫ్యాషన్ వ్యాపారవేత్తలు
- అమెరికన్ సినిమా నటీమణులు
- అమెరికన్ పాప్ గిటారిస్టులు
- అమెరికన్ పాప్ రాక్ గాయకులు
- అమెరికన్ మహిళా చలనచిత్ర దర్శకులు
- బ్రిట్ అవార్డు విజేతలు
- డ్యాన్స్-పాప్ సంగీతకారులు
- స్త్రీవాద సంగీతకారులు
- గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న సంగీతకారులు
- గ్రామీ అవార్డు విజేతలు
- అమెరికన్ LGBT హక్కుల కార్యకర్తలు
- సజీవులు
- సెక్స్-పాజిటివ్ ఫెమినిస్టులు
- మహిళా మానవతావాదులు
- వరల్డ్ మ్యూజిక్ అవార్డ్స్ విజేతలు
- ప్రపంచ రికార్డు హోల్డర్లు