బర్నాలా
బర్నాలా | |
---|---|
పట్టణం | |
Coordinates: 30°22′N 75°32′E / 30.37°N 75.54°E | |
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | బర్నాలా |
జనాభా (2011) | |
• Total | 1,16,449 |
భాషలు | |
Time zone | UTC+5:30 (IST) |
బర్నాలా పంజాబ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది 2006 లో ఏర్పడిన బర్నాలా జిల్లాకు ముఖ్య పట్టణం. బర్నాలా జిల్లా ఏర్పడటానికి ముందు, ఈ నగరం సంగ్రూర్ జిల్లాలో ఉండేది. ఇది భటిండా సమీపంలో ఉంది.
చరిత్ర
[మార్చు]సిక్కు చరిత్రకారుడు జియానీ ఖల్సా చరిత్రలో బర్నాలా ఏర్పాటు గురించి వివరాలను నమోదు చేశాడు. 1775 వ సంవత్సరంలో బాబా అలా సింగ్ తన సోదరుడు దునా సింగ్‌కు భదౌర్ (కింగ్ పాధర్ సైన్ ఏర్పాటు చేసాడు) ను అర్పించిన తరువాత బర్నాలా ప్రాంతానికి వచ్చాడు. అప్పటికి బర్నాలా ఏ గుర్తింపూ లేకుండా ఉండేది. దానిని తన రాజధానిగా చేసుకుని, చుట్టుపక్కల గ్రామాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అనాహద్‌గఢ్ ఇంతకు ముందే ఉండి ఉండవచ్చు; ధర్వీల దాడుల తరువాత నిర్జనమై ఉండాలి.
బర్నాలా నామకరణం గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది అభిప్రాయం, తరచూ తుఫానుల (వర్ణ అని పిలిచేవారు) వచ్చే ప్రాంతం వారన్. ఈ పేరే బర్నాలా గా మారింది. కాబట్టి బర్నాలా అనేక తుఫానుల భూమి అని అర్థం. మరొక కథనంలో, ఇక్కడ బాబా అలా సింగ్ ఒక కోటను నిర్మించినట్లు చెబుతారు. ఇందులో 'బాహులి' (మెట్లబావి) ఉంది. దాన్ని మాళ్వాయీ యాసలో 'బైన్' అని పిలుస్తారు. ఆ బైన్ వాలాయే చివరికి బర్నాలా అయింది. ఇవి భిన్నమైన కథనాలు మాత్రమే కాని బర్నాలా పేరు ఎలా ఉనికిలోకి వచ్చిందో చెప్పే చారిత్రక వివరాలు అందుబాటులో లేవు.
పూర్వపు సంస్థాన వ్యవస్థలో బర్నాలా జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. కానీ, తరువాత దీనిని పెప్సు (పాటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్) లో విలీనం చేసాక, ఉప డివిజనల్ ప్రధాన కార్యాలయ స్థాయికి దిగజారింది.
బర్నాలాకు ఆనుకొని ఉన్న హండియా గ్రామంలో, నాథ్ వాలా డేరా లో "రామేశ్వరం స్టోన్" అనే రాయి ఉంది. అది నీటిలో తేలుతూంటుంది.
జనాభా వివరాలు
[మార్చు]2011 జనగణన ప్రకారం, బర్నాలా జనాభా 1,16,449. వీరిలో పురుషులు 62,554, మహిళలు 53,895. పట్టణ అక్షరాస్యత 79.59%. [2] బర్నాలా సిక్కుల మెజారిటీ నగరం. జనాభాలో వీరి శాతం సుమారు 50.37.
పట్టణ ప్రముఖులు
[మార్చు]బర్నాలా పట్టణానికి చెందిన ప్రముఖులు
- సుర్జీత్ సింగ్ బర్నాలా: పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, తమిళనాడు గవర్నరుగా పనిచేసిన రాజకీయ నాయకుడు
- రామ్ సరూప్ ఆంఖీ: పంజాబీ నవలా రచయిత, కవి
- కరం సింగ్: జీవించి ఉండగా పరమ వీర చక్ర పొందిన మొదటి వ్యక్తి
విద్యా సంస్థలు
[మార్చు]బర్నాలా పట్టణం లోని విద్యా సంస్థలు:
- ఆర్యభట్ట ఇంటర్నేషనల్ స్కూల్
- బిజిఎస్ పబ్లిక్ స్కూల్
- BVM ఇంటర్నేషనల్ స్కూల్
- దయానంద్ కేంద్రీయ విద్యా మందిరం
- గాంధీ ఆర్య హై స్కూల్
- గోవింద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ భదౌర్
- ప్రభుత్వ బాలుర ఎస్ఎస్ స్కూల్
- ప్రభుత్వ బాలికల ఎస్.ఎస్ పాఠశాల
- గుర్ప్రీత్ హోలీ హార్ట్ పబ్లిక్ స్కూల్
- కేంద్రీయ విద్యాలయం, వైమానిక దళం
- లిటిల్ ఏంజెల్ ప్లే-వే స్కూల్
- మదర్ టీచర్ పాఠశాల
- సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్
- సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్
- స్ప్రింగ్ వ్యాలీ సీనియర్ సెక. పాఠశాల
- సర్వహితకారి సీనియర్ సెకండరీ స్కూల్
- సర్వోత్తమ్ అకాడమీ
- స్ప్రింగ్ డేల్ ప్లేవే స్కూల్
- తక్షశిల ప్రభుత్వ పాఠశాల
- వైయస్ పబ్లిక్ స్కూల్
ఉన్నత విద్యాసంస్థలు:
- ఆర్యభట్ట గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్
- అకాల్ పాలిటెక్నిక్ కళాశాల
- బాబా ఫరీద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- బర్నాలా పాలిటెక్నిక్ కళాశాల
- దశ్మేష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ
- ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ
- గురు అర్జున్ దేవ్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ
- గురు గోవింద్ సింగ్ విద్య కళాశాల
- గురు గోవింద్ సింగ్ కళాశాల, సంఘేరా
- గురు నానక్ దేవ్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్
- ఎల్బీఎస్ ఆర్య మహిలా కళాశాల
- ఎంపీ పట్వర్ శిక్షణా కేంద్రం
- ఎస్.డి. కాలేజీ
- సేక్రెడ్ హార్ట్ ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్
- సాంకేతిక విద్య కళాశాల, హండియా
- విశ్వవిద్యాలయ కళాశాల, బర్నాలా
మూలాలు
[మార్చు]- ↑ http://www.census2011.co.in/census/city/21-barnala.html
- ↑ "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.