Jump to content

ఫైబ్రోమైయాల్జియా

వికీపీడియా నుండి
ఫైబ్రోమైయాల్జియా
ఇతర పేర్లుఫైబ్రోమైయాల్జియా సిండ్రోమ్ (FMS)
ఫైబ్రోమైయాల్జియా 9 టెండర్ స్థానాలు
ప్రత్యేకతమానసిక వ్యాధులు , రుమాటాలజీ, నాడీ వ్యాధుల శాస్త్రం
లక్షణాలుఅలసట, నిద్ర సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవుతుండడం, శరీరం అంతా వ్యాప్తి చెందే నొప్పి
సాధారణ ప్రారంభంమధ్య వయస్సు
కాల వ్యవధిదీర్ఘ కాలం
కారణాలుకారణాలు తెలియరాలేదు
రోగనిర్ధారణ పద్ధతిలక్షణాలు
చికిత్ససరిపడినంత నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం
ఔషధండులోక్సేటైన్, మిల్నాసిప్రాన్, ప్రీగాబాలిన్, గబాపెంటిన్
రోగ నిరూపణసాధారణ జీవిత కాలం
తరుచుదనము2-8%

ఫైబ్రోమైయాల్జియా ( FM ) అంటే విపరీతమైన నొప్పి ఉన్న దీర్ఘకాలిక వ్యాధి. ఒత్తిడి వలన నొప్పి ఎక్కువగా శరీరం వ్యాపించిన పరిస్థితి. [1] ఇతర లక్షణాలలో మాములు రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేసే విధంగా అలసట, నిద్ర సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు ఉంటాయి. [2] కొందరు వ్యక్తులు రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, ప్రేగు లేదా మూత్రాశయ సమస్యలు, తిమ్మిరి, జలదరింపు, శబ్దం, లైట్లు లేదా ఉష్ణోగ్రతకు ప్రతిస్పందన కూడా చెపుతుంటారు. [3] ఫైబ్రోమైయాల్జియా తరచుగా నిరాశ, ఆందోళన, బాధానంతర ఒత్తిడి మొదలైన రుగ్మతలు కూడా కలిగి ఉంటారు. ఇతర రకాల దీర్ఘకాలిక నొప్ప్పులు కూడా వీరిలో తరచుగా కనపడుతుంటుంది.[2]

ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి కారణం తెలియదు, అయినప్పటికీ, దీనికి జన్యు పర్యావరణ కారకాలు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. [3] ఈ పరిస్థితి చాలా కుటుంబాలలో నడుస్తుంటుంది దీనికి అనేక జన్యువులు కారణమని నమ్ముతారు.[4] పర్యావరణ కారకాలు, మానసిక ఒత్తిడి, గాయం కొన్ని అంటువ్యాధులు కూడా కారణమయి ఉండవచ్చు. నొప్పి కేంద్ర నాడీ వ్యవస్థలో ప్రక్రియల ఫలితంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని "సెంట్రల్ సెన్సిటైజేషన్ సిండ్రోమ్"గా వ్యవహరిస్తారు. [1] [2] అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ లు ఫైబ్రోమైయాల్జియా ను ఒక రుగ్మతగా గుర్తించారు. [5] నిర్దిష్ట రోగనిర్ధారణ పరీక్ష లేదు. రోగనిర్ధారణ అనేది ముందుగా ఇతర సంభావ్య కారణాలను మినహాయించడం, నిర్దిష్ట లక్షణాలు ఉన్నట్లు ధృవీకరించడం. [2] [3]

ఫైబ్రోమైయాల్జియాకు చికిత్స కష్టంగా ఉంటుంది. తగినంత నిద్ర పొందడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి తరచుగా సిఫార్సు చేస్తారు. [3] కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) కూడా సహాయపడవచ్చు. [2] [6] డులోక్సేటైన్, మిల్నాసిప్రాన్ లేదా ప్రీగాబాలిన్ వంటి మందులు వాడవచ్చు. ఓపియాయిడ్ నొప్పి మందుల వాడకం వివాదాస్పదం, కొందరు అవి అంత ఉపయోగకరం కాదని పేలవంగా పని చేస్తుందని పేర్కొన్నారు [3] [7] ఇతరులు ఇతర మందులు ప్రభావవంతం కానట్లయితే బలహీనమైన ఓపియాయిడ్లు కొంతవరకు సహేతుకమైనవని చెప్పారు. [8] ఆహార పదార్ధాలు ఉపయోగకరం అను అభిప్రాయానికి ఆధారాలు లేవు. ఫైబ్రోమైయాల్జియా చాలా కాలం పాటు కొనసాగుతుంది, అయితే ఇది మరణానికి లేదా కణజాల నాశనానికి దారితీయదు. [3]

ఫైబ్రోమైయాల్జియా జనాభాలో 2-8% మందిని ప్రభావితం చేస్తుందని అంచనా వేశారు. స్త్రీలు పురుషుల కంటే రెట్టింపు తరచుగా ప్రభావితమవుతారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న సంస్కృతులలో ఒకే విధమైన ప్రభావం కనిపిస్తుంది. ఫైబ్రోమైయాల్జియా ను మొదటిసారిగా 1990లో పేర్కొన్నారు, 2011లో వాటి ప్రమాణాలు నవీకరించారు. [2] ఫైబ్రోమైయాల్జియా వర్గీకరణ, రోగ నిర్ధారణ, చికిత్స గురించిన వివాదం ఉంది. [9] [10] ఫైబ్రోమైయాల్జియా రోగనిర్ధారణ ఒక వ్యక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కొందరు భావిస్తారు, ఇతర పరిశోధనలలో రోగనిర్ధారణ ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు. [2] "ఫైబ్రోమైయాల్జియా" అనే పదం న్యూ లాటిన్ ఫైబ్రో- నుండి ఆవిర్భవించింది, దీని అర్థం "ఫైబరస్ టిష్యూస్", గ్రీక్ μυώ మైయో-, "కండరాల", గ్రీకు άλγος ఆల్గోస్, "నొప్పి"; కాబట్టి, ఈ పదానికి అక్షరార్థం " కండరం, పీచు బంధన కణజాల నొప్పి" ("muscle and fibrous connective tissue pain").అంటారు .[11]

ప్రస్తావనలు

[మార్చు]
  1. 1.0 1.1 Ngian GS, Guymer EK, Littlejohn GO (February 2011). "The use of opioids in fibromyalgia". Int J Rheum Dis. 14 (1): 6–11. doi:10.1111/j.1756-185X.2010.01567.x. PMID 21303476.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 Clauw, Daniel J. (16 April 2014). "Fibromyalgia". JAMA. 311 (15): 1547–55. doi:10.1001/jama.2014.3266. PMID 24737367.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Questions and Answers about Fibromyalgia". NIAMS. July 2014. Archived from the original on 15 March 2016. Retrieved 15 March 2016.
  4. Buskila D, Sarzi-Puttini P (2006). "Biology and therapy of fibromyalgia. Genetic aspects of fibromyalgia syndrome". Arthritis Research & Therapy. 8 (5): 218. doi:10.1186/ar2005. PMC 1779444. PMID 16887010.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  5. "Fibromyalgia". American College of Rheumatology. May 2015. Archived from the original on 17 March 2016. Retrieved 16 March 2016.
  6. Mascarenhas, Rodrigo Oliveira; Souza, Mateus Bastos; Oliveira, Murilo Xavier; Lacerda, Ana Cristina; Mendonça, Vanessa Amaral; Henschke, Nicholas; Oliveira, Vinícius Cunha (26 October 2020). "Association of Therapies With Reduced Pain and Improved Quality of Life in Patients With Fibromyalgia: A Systematic Review and Meta-analysis". JAMA Internal Medicine. doi:10.1001/jamainternmed.2020.5651.
  7. Goldenberg, DL; Clauw, DJ; Palmer, RE; Clair, AG (May 2016). "Opioid Use in Fibromyalgia: A Cautionary Tale". Mayo Clinic Proceedings (Review). 91 (5): 640–8. doi:10.1016/j.mayocp.2016.02.002. PMID 26975749. Archived from the original on 29 August 2021. Retrieved 22 July 2020.
  8. Sumpton, JE; Moulin, DE (2014). Fibromyalgia. Vol. 119. pp. 513–27. doi:10.1016/B978-0-7020-4086-3.00033-3. ISBN 9780702040863. PMID 24365316. {{cite book}}: |work= ignored (help)
  9. (June 2009). "Fibromyalgia syndrome: classification, diagnosis, and treatment".
  10. Wang, SM (June 2015). "Fibromyalgia diagnosis: a review of the past, present and future.".
  11. Bergmann, Uri (2012). Neurobiological foundations for EMDR practice. New York, NY: Springer Pub. Co. p. 165. ISBN 9780826109385.