Jump to content

గ్యోంగ్ లా

అక్షాంశ రేఖాంశాలు: 35°10′29″N 77°4′15″E / 35.17472°N 77.07083°E / 35.17472; 77.07083
వికీపీడియా నుండి

 

గ్యోంగ్ లా
NJ9842 నుండి ఉత్తరానికి వెళ్తే, గ్యోంగ్ లా, బిలాఫోండ్ లా,సియా లా, ఇందిరా కల్ లు భారత నియంత్రణలో ఉన్నాయి. మాషర్‌బ్రం శ్రేణి, బల్టోరో హిమానీనదం, బల్టోరో ముజ్‌టాగ్, K2 లు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నాయి.
సముద్ర మట్టం
నుండి ఎత్తు
5,686 మీ. (18,655 అ.)[1]
ప్రదేశంకారకోరం శ్రేణి, గిల్గిట్-బల్టిస్తాన్, పాకిస్తాన్
శ్రేణితూర్పు కారకోరం శ్రేణి
Coordinates35°10′29″N 77°4′15″E / 35.17472°N 77.07083°E / 35.17472; 77.07083
గ్యోంగ్ లా is located in Ladakh
గ్యోంగ్ లా
గ్యోంగ్ లా
Location in Ladakh
పటం

గ్యోంగ్ లా అనేది విస్తారమైన సియాచిన్ గ్లేసియర్‌కు నైరుతి దిశలో సాల్టోరో రిడ్జ్‌పై ఉన్న ఒక పర్వత మార్గం. ఇది, భారత పాకిస్తాన్ల మధ్య 1972 లో నియంత్రణ రేఖ ముగింపును నిర్వచించిన మ్యాప్ పాయింట్ NJ9842 కి ఉత్తరాన దాదాపు 20 కి.మీ. (12 మై.) దూరాన ఉంది. పశ్చిమాన, చుమిక్ గ్లేసియర్ వెంబడి ఉన్న ప్రాంతం[2] పాకిస్తాన్ [3] నియంత్రణలో ఉండగా, గ్యోంగ్ లా ప్రాంతం 1989 నుండి భారతదేశ నియంత్రణలో ఉంది.[4] 2013, 2016 నాటి Google Earth చిత్రాలలో 100 మీటర్ల తూర్పు, 670 మీటర్ల ఈశాన్య 2.7 కి.మీ. తూర్పు-ఈశాన్యంగా డజన్ల కొద్దీ భారతీయ సైనిక గుడారాలు, ఇతర పరికరాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశాల నుండి గ్యోంగ్ లా వరకు వాహనాల గుర్తులు స్పష్టంగ కనిపిస్తాయి.

నేపథ్యం

[మార్చు]
ఇండో-పాకిస్తాన్ పరస్పరం అంగీకరించిన వివాదరహిత "అంతర్జాతీయ సరిహద్దు" (IB) నల్ల రేఖ. ఇండో-పాకిస్తానీ "నియంత్రణ రేఖ" (LoC) ఉత్తర పశ్చిమాలలో నల్ల చుక్కల రేఖ. ఇండో-చైనా "వాస్తవాధీన రేఖ" (LAC ) తూర్పున నల్ల చుక్కల రేఖ. ఉత్తరాన సియాచిన్ మీదుగా ఇండో-పాకిస్తానీ రేఖ "వాస్తవ క్షేత్ర స్థితి రేఖ" (AGPL). ఆకుపచ్చ రంగులో చూపిన ప్రాంతాలు రెండూ పాకిస్తాన్-ఆక్రమిత ప్రాంతాలు: ఉత్తరాన గిల్గిత్-బల్టిస్తాన్, దక్షిణాన ఆజాద్ కాశ్మీర్. నారింజ రంగులో చూపబడిన ప్రాంతం జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లు తూర్పున ఐమూలగా పట్టీలు గీసిన ప్రాంతం అక్సాయ్ చిన్ అని పిలువబడే చైనా ఆక్రమిత ప్రాంతం. ఉత్తరాన, "పాకిస్తాన్ చైనాకు అప్పగించిన భారత భూభాగాలు" షక్స్‌గామ్ (ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్).

భారత పాక్ ఘర్షణలు

[మార్చు]

1984 లో ఆపరేషన్ మేఘదూత్ సమయంలో, సమీపంలోని సియా లా, బిలాఫోండ్ లాలతో పాటు గ్యోంగ్ లా వద్ద సైనిక చర్య జరిగింది.[5] 1989 నుండి గ్యోంగ్ లా, గ్యోంగ్ కాంగ్రీలను పాకిస్తాన్ దళాలు నియంత్రిస్తున్నాయి. గ్యోంగ్ కాంగ్రీ ద్వారా గోమా బేస్ వరకు పాకిస్తాన్ రహదారిని అభివృద్ధి చేసింది.

1989 మార్చిలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఐబెక్స్‌లో చుమిక్ గ్లేసియర్‌కు అభిముఖంగా ఉన్న పాకిస్తాన్ పోస్ట్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఆపరేషన్ విజయవంతం కాలేదు, పాకిస్తానీ దళాలు ఇప్పటికీ తమ స్థానాల నుండి ఉన్నాయి. బ్రిగ్ RK నానావతి నేతృత్వం లోని భారత సైన్యం చుమిక్ గ్లేసియర్‌పై పాకిస్తానీ స్థావరమైన కౌసర్ స్థావరంపై ఫిరంగి దాడి చేసి, దాన్ని ధ్వంసం చేసారు. పాకిస్తానీ దళాలు గ్యోంగ్ లాకు పశ్చిమాన ఉన్న వారి చుమిక్ పోస్టులను ఖాళీ చేసి వెనుదిరగడంతో ఆపరేషన్ ఐబెక్స్ ముగిసింది.[6] ఇప్పటికీ చుమిక్ గ్లేసియర్ చుమిక్ కాంగ్రీలలో పాకిస్తాన్ సైనికులు ఉన్నారు. చుమిక్ కాంగ్రీ గయారీ క్యాంపులో ఉంది.

1999 జూన్‌లో కార్గిల్ యుద్ధ సమయంలో, బ్రిగేడియర్ పిసి కటోచ్, కల్నల్ కొన్సామ్ హిమాలయ సింగ్ నేతృత్వంలోని భారత సైన్యం పాయింట్ 5770 ను (దీనిని గతంలో పాకిస్తానీయులు చీమా టాప్ & బిలాల్ టాప్ అనేవారు) పాకిస్తాన్ దళాల నుండి స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత దీనిని నవదీప్ టాప్ గా పేరు మార్చారు.[7] పాయింట్ 5770ని భారత్ స్వాధీనం చేసుకున్న సమయంలో, పాకిస్తానీ స్పెషల్ సర్వీస్ గ్రూప్‌కు చెందిన కెప్టెన్ తైమూర్ మాలిక్, మరికొందరు పాకిస్తాన్ సైనికులు మరణించారు. అంతకు ముందు జరిగిన కార్గిల్ యుద్ధంలో తమ సైనికుల పాత్రను పాకిస్తాన్ ఖండించింది. తమ సైనికుల మృతదేహాలను తీసుకోడానికి నిరాకరించింది. అయితే, తరువాత తైమూర్ మాలిక్ తాత, తన మనవడి మృతదేహాన్ని తిరిగి ఇవ్వమని లండన్లోని భారత హైకమిషన్ (ఐహెచ్సి) కు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయగా, ఈ అభ్యర్థనను భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మాలిక్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్‌కు పంపారు. ఆయన మృతదేహాలను వెలికితీయించి, పాకిస్తాన్‌కు పంపించారు.[8]

ఇవి కూడా చూడండి

[మార్చు]
సరిహద్దులు
వివాదాలు

మూలాలు

[మార్చు]
  1. "Gyong". Retrieved 6 August 2009.
  2. "A Slow Thaw". Time. 7 November 2005. Archived from the original on 11 September 2005. Retrieved 4 May 2010.
  3. Joshi, Manoj (2 May 2016). "The Shooting's Over But Siachen Will Keep Taking Its Toll". The Wire, New Delhi, India. Retrieved 9 September 2016.
  4. Hakeem, Asad; Gurmeet Kanwal; Michael Vannoni; Gaurav Rajen (1 September 2007). "Demilitarization of the Siachen Conflict Zone" (PDF). Sandia Report. Sandia National Laboratories, Albuquerque, NM, USA. Archived from the original (PDF) on 28 January 2017. Retrieved 9 September 2016.
  5. Barua, Pradeep P. (30 June 2005). The State at War in South Asia (Studies in War, Society, and the Military). University of Nebraska Press. pp. 253–255. ISBN 978-0-8032-1344-9. Retrieved 6 August 2009.
  6. The fight for Siachen, Brig. Javed Hassan (Retd) 22 April 2012, The Tribune
  7. Endgame at Siachen Archived 3 జూలై 2015 at the Wayback Machine, Maj Gen Raj Mehta, AVSM, VSM (Retd) 2 December 2014, South Asia Defence and Strategic Review
  8. ‘India Handed Over Body of Pakistan Soldier Killed In kargil’, The Sentinel, 28 June 2019.