Jump to content

కె. టి. ధోలాకియా

వికీపీడియా నుండి
కె.టి.ధోలాకియా
జననం(1920-08-12)1920 ఆగస్టు 12
రాజ్‌కోట్, గుజరాత్, భారతదేశం
మరణం2004 జూన్ 17(2004-06-17) (వయసు 83)
వృత్తిఆర్థోపెడిక్ సర్జన్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
జీవిత భాగస్వామిసరోజ్
పురస్కారాలుపద్మశ్రీ

కందర్ప్ తుల్జశాంకర్ ధోలాకియా భారతీయ కీళ్ళ శస్త్రవైద్యుడు. అతను భారతదేశంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సకు మార్గదర్శకులలో ఒకడు.[1] 1920 ఆగస్టు 12న గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ లో జన్మించిన ధోలాకియా ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసాడు.[1] భారత ప్రభుత్వం 1973లో ఆయనకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[2] అతను 83 సంవత్సరాల వయసులో 2004 జూన్ 17న మరణించారు.

  1. 1.0 1.1 "Dr. KT Dholakia: Pioneer of Joint Replacement Surgery in India" (PDF). Journal of The Association of Physicians of India. 2015. Retrieved June 6, 2015.
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved November 11, 2014.