కుళందై ఉళ్ళం
Appearance
కుళందై ఉళ్ళం (1969 తమిళం సినిమా) | |
దర్శకత్వం | సావిత్రి |
---|---|
నిర్మాణం | సావిత్రి |
తారాగణం | జెమిని గణేశన్, సావిత్రి, వాణిశ్రీ, షావుకారు జానకి, బేబి రోజా |
సంగీతం | ఎస్.పి.కోదండపాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ సావిత్రి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | జనవరి 14, 1969 |
భాష | తమిళం |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కుళందై ఉళ్ళం (తమిళం: குழந்தை உள்ளம்) 1969లో విడుదలైన ఒక తమిళ చలనచిత్రం. ఈ చిత్రాన్ని సావిత్రి నిర్మించి దర్శకత్వం వహించారు.[1] ఈ చిత్రంలో జెమిని గణేశన్, సావిత్రి, వాణిశ్రీ తదితరులు నటించారు. సావిత్రి దర్శకత్వంలోనే 1968లో తెలుగులో వచ్చిన చిన్నారి పాపలు సినిమాను తమిళంలో ఈ సినిమాగా పునర్మించారు.
కథ
[మార్చు]ఒక ధనవంతుడైన చిత్రకారుడు ఒక అడవిలో గిరిజన అమ్మాయిని కలుసుకుంటాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. తెలియకుండానే అతను ఆమెతో పెళ్లి చేసుకున్నాడు. ఒక సంతోషకరమైన రాత్రిని ఆమెతో గడిపిన తరువాత, తల్లిని సంతృప్తి పరచడానికి నగరంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవలసి వస్తుంది. గిరిజన అమ్మాయితో ఉన్న అతని భావోద్వేగ బంధం, ఆమెను మరిచిపోలేకపోవడం, పరిస్ధితిని మరింత సంక్లిష్టం చేస్తుంది. చివరికి, ఇద్దరు పిల్లల కారణంగా, విరిగిపోయిన హృదయాలు మళ్లీ కలుస్తాయి.
తారాగణం
[మార్చు]- జెమినీ గణేశన్
- షావుకారు జానకి
- వాణిశ్రీ
- ఆర్. ఎస్. మనోహర్
- తెంగై శ్రీనివాసన్
- రమాప్రభ
- వి. కె. రామసామి
- ఎ. వీరప్పన్
మూలాలు
[మార్చు]- ↑ "Kuzhandai Ullam (1969)". Indiancine.ma. Retrieved 2024-11-24.