కష్టే ఫలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కష్టే ఫలి అనగా కష్టం చేస్తేనే ఫలితం లభిస్తుందని దీని అర్థం. కష్టే ఫలిని ఆంగ్లంలో నో పెయిన్స్, నో గెయిన్స్ అంటారు, అంటే కష్టాలు లేకపోతే లాభాలు ఉండవు అని అర్థం. ఫలితాన్ని పొందటానికి శ్రమించాల్సి ఉంటుంది, ఇంకా అవసరమయితే కఠోరశ్రమ చేయవలసి ఉంటుంది. సాధించాలనే తపనతో శ్రమించడం ద్వారా తన లక్ష్యాన్ని చేరకొనగలిగినప్పుడు తగిన మూల్యాన్ని, తగిన విలువను, తగిన ప్రోత్సాహాన్ని పొందగలుగుతాడు. ఉదాహరణకు క్రీడాకారులు, కళాకారులు వంటి వారు పోటీతత్వ భావనతో ఒత్తిడిని భరిస్తూ కృషి చేయటం వలన తమ నైపుణ్యాన్ని, సమర్థతను పెంపొందించుకుంటారు, తద్వారా మెరుగైన ఫలితాలను పొందుతారు.

ఏరోబిక్స్

[మార్చు]

నటీమణీ జేన్ ఫోండా 1982లో ప్రారంభించిన ఏరోబిక్స్ వ్యాయామానికి సంబంధించిన వీడియో ధారావాహిక ఉత్పత్తుల వలన నో పెయిన్ నో గెయిన్ అనే నానుడి బాగా ప్రాచుర్యం పొందింది. వ్యాయామం చేసేటప్పుడు కలిగే కండరాల నొప్పుల వలన వ్యాయామం చేయకుండా ఉండే వారిని ఉద్దేశించి ఇప్పుడు కష్టం ఉండకపోతే భవిష్యత్తులో లాభం ఉండదు అనే విధంగా ఈ వ్యాఖ్యను ఉపయోగించారు. వ్యాయామం అనే కష్టం చేసినప్పుడే కదా దేహదారుడ్యమనే లాభం పొందుతాము.

ఇవి కూడా చూడండి

[మార్చు]

లక్ష్యం

బయటి లింకులు

[మార్చు]